క్రిప్స్ రాయబారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బ్రిటిష్ ప్రభుత్వం ప్రపంచ యుద్ధం IIలో తన ప్రయత్నాలకు భారతీయ సహకారం, మద్దతును పొందడానికి 1942 మార్చి చివర్లో చేసిన ఒక ప్రయత్నమే క్రిప్స్ రాయబారం . సీనియర్ వామపక్ష రాజకీయవాది, ప్రధానమంత్రి విన్‌స్టన్ చర్చిల్ యుద్ధ కేబినెట్‌లో ప్రభుత్వ మంత్రిగా ఉన్న సర్ స్టాఫర్డ్ క్రిప్స్ ఈ రాయబారానికి నాయకత్వం వహించాడు.

నేపథ్యం[మార్చు]

బ్రిటన్ యుద్ధం[[మరియు U.S. యుద్ధంలో ప్రవేశించడంతో ప్రపంచ యుద్ధం II, బ్రిటన్‌కు, యూరోపియన్ దేశాల భవిష్యత్ మనుగడకు ప్రమాదకారిగా, సంక్లిష్టంగా మారడం పెరిగింది.]] భారతీయులను మరింత ఎక్కువగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేర్చుకోవడం కోసం భారత రాజకీయ నేతల సంపూర్ణ సహకారాన్ని, మద్దతును పొందాలని బ్రిటిష్ ప్రభుత్వం కోరుకుంది. ఈ సైన్యం అప్పటికే బ్రిటిష్ సైన్యం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మరియు అమెరికన్ మిత్రపక్షాలతో కలిసి ఆగ్నేయాసియాలో ఇంపీరియల్ జపాన్‌తో, ఐరోపా మరియు ఉత్తర ఆఫ్రికాలలో ఫాసిస్టు ఇటలీ మరియు నాజీ జర్మనీతో పోరాడుతోంది. 1939లో వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో భారత రాజీకీయ నేతలు లేదా ఎన్నికైన ప్రాదేశిక ప్రతినిధులను ఏమాత్రం సంప్రదించకుండానే భారత్‌ని మిత్రరాజ్యాల తరపున నిలిచి పోరాడే దేశంగా ప్రకటించేశాడు. దీంతో భారత్‌లో ఆగ్రహావేశాలు మిన్నంటాయి. ఫలితంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ప్రాదేశిక ప్రభుత్వాలు సామూహికంగా రాజీనామా చేశాయి. దీంతో భారత్‌లో ప్రజా తిరుగుబాటు, రాజకీయ అస్తవ్యస్థత సంభవించే అవకాశాలు పెరిగాయి. భారత్‌‌లో తన పాలనను అస్థిరపరిచే తిరుగుబాటువల్ల జపాన్ వారిపై తాము కొనసాగిస్తున్న యుద్ధ కేంపెయిన్ ప్రమాదంలో పడుతుందని బ్రిటిష్ వారు భయపడ్డారు. పైగా వారికి ఐరోపా‌లో యుధ్ధం చేయడానికి అధిక స్థాయిలో వనరులు, మానవ శక్తిని పొందే విషయంలో ఇది వినాశకారిగా ఉంటుంది కూడా.

సహకారం లేదా నిరసనపై చర్చ[మార్చు]

భారతదేశం ప్రపంచ యుద్ధం IIలోకి ప్రవేశించడంపై స్పందించేక్రమంలో కాంగ్రెస్ చీలిపోయింది. భారత వైస్రాయి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహోదగ్రులైన కొంతమంది కాంగ్రెస్ నేతలు బ్రిటన్ స్వంత స్వేచ్ఛకే ప్రమాదకారిగా తయారవుతూ ఐరోపా‌లో యుద్ధం సాగుతుండగా, బ్రిటిష్ వారిపై ప్రజా తిరుగుబాటు లేవదీయడానికి అనుకూలతను వ్యక్తం చేశారు. ఇతరులు, చక్రవర్తి రాజగోపాలాచారివంటివారు, బ్రిటిష్ వారికి ఎర్రతివాచీ పరచాలని, ఈ కీలకమైన తరుణంలో వారికి మద్దతుగా నిలవాలని ప్రబోధించారు. ఇప్పుడు వారికి మద్దతు తెలిపితే యుద్ధానంతరం దేశ స్వాతంత్ర్యం పట్ల వారినుంచి సానుకూలత వ్యక్తమవుతుందని వీరు భావించారు. భారతదేశం మరియు కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నేత మోహన్‌దాస్ గాంధీ యుద్ధంలో భారత్ పాత్రను వ్యతిరేకించాడు. తను నైతికంగానే యుద్ధానికి వ్యతిరేకి -- పైగా అతడు బ్రిటిష్ వారి ఉద్దేశ్యాలను అనుమానించాడు. స్వాతంత్ర్యం పట్ల భారతీయ ఆకాంక్షల పట్ల బ్రిటిష్ వారు నిజాయితీగా లేరని తన నమ్మిక. అయితే రాజగోపాలాచారి మాత్రం, సర్దార్ వల్లభాయి పటేల్, మౌలానా అజాద్ మరియు జవహర్‌లాల్ నెహ్రూ మద్దతుతో క్రిప్స్‌తో చర్చలు జరిపి తమకు తక్షణం స్వయం ప్రభుత్వాన్ని, తర్వాత స్వాతంత్ర్యాన్ని ఇస్తామనే హమీ తీసుకుని బ్రిటిష్ యుద్ధ ప్రయత్నాలకు పూర్తి మద్ధతు తెలిపారు.

ముస్లి లీగ్ నేత, మహమ్మదాలీ జిన్నాయుద్ధ ప్రయత్నాలకు మద్దతు తెలిపి కాంగ్రెస్ విధానాన్ని ఖండించాడు. విడిగా తమకు ముస్లిం ప్రభుత్వం కావాలని డిమాండ్ చేస్తూ ఇతడు సమైక్య భారత సహకారం కోసం, తక్షణ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ ఇచ్చిన పిలుపును ప్రతిఘటించాడు.

రాయబారం వైఫల్యం[మార్చు]

దస్త్రం:Cripps-gandhiji.jpg
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మహాత్మా గాంధీతో క్రిప్స్ సమావేశం

భారత్‌కు రాగానే, క్రిప్స్ భారతీయ నేతలతో చర్చలు జరిపాడు. చర్చిల్, లియో అమెరి (హిస్ మెజెస్టీ భారత హోంశాఖ కార్యదర్శి) తరపున భారత జాతీయ నాయకులకు క్రిప్స్ తీసుకువచ్చిన అధికారిక ప్రతిపాదనలు ఏమిటన్న విషయంలో కాస్త అయోమయం ఉండేది. పైగా అప్పటి వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో క్రిప్స్‌ పట్ల శతృత్వం ప్రదర్శించాడు. యుద్ధం ముగిశాక భారత్‌కు పూర్తి అధినివేశ ప్రతిపత్తిని ప్రతిపాదించడం ద్వారా క్రిప్స్ రాయబారం ప్రారంభించాడు, కామన్వెల్త్ నుంచి విడిపోయి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని పొందే అవకాశం కూడా ఉందని క్రిప్స్ ఊరించాడు. లిన్‌లిత్‌గోను వెనక్కు పిలిపిస్తామని, తక్షణమే భారత్‌కు అధినివేశ ప్రతిపత్తిని మంజూరు చేసి, రక్షణ మంత్రిత్వశాఖను మాత్రమే బ్రిటిష్ వారికి కేటాయిస్తామని క్రిప్స్ వ్యక్తిగతంగా వాగ్దానం చేశాడు కూడా. ఏమైనప్పటికీ, బహిరంగంగా మాత్రం అతడు వైస్రాయ్ నేతృత్వంలోని కార్యనిర్వాహక మండలిలో భారతీయ సభ్యుల సంఖ్యను పెంచుతామనే అస్పష్ట ప్రకటన చేయడం తప్పితే స్వల్పకాలంలోనే విస్తృత స్థాయి స్వీయ ప్రభుత్వం గురించిన ఎలాంటి నిర్దిష్టమైన ప్రతిపాదనలను బహిరంగంగా ప్రకటించడంలో అతడు విఫలమయ్యాడు. యుద్ధానికి, ప్రభుత్వానికి మద్దతుగా జనాన్ని సిద్ధం చేయడం అనే ఉమ్మడి లక్ష్యంతో ముందుకు రావలసిందిగా కాంగ్రెస్ నేతలను, జిన్నాను ప్రోత్సహించడంలోనే క్రిప్స్ ఎక్కువకాలం గడిపేశాడు. అయితే క్రిప్స్ బయటకు ఏమి చెప్పినా తమపై సామూహిక బాధ్యత ఉందని లేదా యుద్ధకాలంలో రక్షణశాఖపై భారతీయుల నియంత్రణ ఉండాలని కాంగ్రెస్ నేతలు భావించారు. రాజకీయ యజమానులు వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిని సంపూర్ణంగా భారతీయులతో నింపడం పట్ల పెద్దగా ఆసక్తిగా లేరని అనుమానాలు కూడా వ్యాపించాయి, భవిష్యత్తులో ఏర్పడే ఏ అధినివేశ ఏర్పాటులో అయినా సరే బ్రిటిష్ వారు ముస్లిం లీగును మంత్రి వర్గంలోకి ఆహ్వానించనున్నారనే పుకార్లు కూడా విస్తృతంగా వ్యాపించాయి. ఈ దశలో బ్రిటిష్ వారికి, కాంగ్రెస్‌కి మధ్య పెద్దగా విశ్వాసం ఉండేది కాదు, ఇరు పక్షాలూ ఇతరులు తమ నిజమైన పథకాలను మరుగును ఉంచుతున్నారని భావించేవి.

కాంగ్రెస్ క్రిప్స్‌తో చర్చలను నిలిపివేసింది, మోహన్‌దాస్ గాంధీ మార్గదర్శకత్వంలో జాతీయ నాయకత్వం యుద్ధానికి మద్ధతు ఇస్తే ప్రతిఫలంగా తక్షణం స్వయం ప్రభుత్వాన్ని ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. బ్రిటిష్ వారు దీనికి స్పందించకపోవడంతో, గాంధీ, కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమం పేరిట ముఖ్యమైన ప్రజా తిరుగుబాటుకు పథకం రచించడానికి ప్రారంభించారు, ఈ ఉద్యమం భారత్ నుంచి బ్రిటిష్ వారిని తక్షణం వైదొలగాల్సిందిగా సిఫార్సు చేసింది. [[మయన్మార్|బర్మా[[ను గెల్చుకున్న తర్వాత ఇంపీరియల్ జపనీస్ ఆర్మీ]]]] భారత్‌‌ సమీపంలోకి వస్తుండటంతో బ్రిటిష్ వారు భారత్‌ను నిలుపుకోలేని అశక్తతలో పడ్డారని భారతీయులు అభిప్రాయానికి వచ్చారు. ఈ కాలంలోనే [[సుభాష్ చంద్రబోస్|సుభాష్ చంద్రబోస్[[నేతృత్వంలో భారత జాతీయ సైన్యం]]]] వికసించసాగింది. క్విట్ ఇండియా ఉద్యమానికి జవాబుగా బ్రిటిష్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకత్వాన్ని చాలావరకు జైళ్లలో పెట్టింది.

జిన్నా ముస్లిం లీగ్ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఖండించి ప్రాదేశిక ప్రభుత్వాలలో, అదే విధంగా బ్రిటిష్ రాజ్ యొక్క శాసన మండళ్లలో పాలు పంచుకుంది, యుద్ధంలో పాలు పంచుకోవలిసిందిగా ముస్లింలను ప్రోత్సహించింది. ముస్లిం లీగ్ నుంచి ఈ పరిమిత సహకారంతో, యుద్ధ కాలంలో భారత రాజకీయ నేతలు కనిపించని వాతావరణంలో అధికారులు, సైనిక బలగాలను ఉపయోగించి భారత్‌లో తమ పాలనను బ్రిటిష్ వారు కొనసాగించగలిగారు. అయితే, ఇది దీర్ఘకాలంలో పనిచేస్తుందని నిరూపణ కాలేదు.

క్రిప్స్ రాయబారం యొక్క దీర్ఘ కాలిక ప్రాధాన్యత వాస్తవానికి యుద్ధానంతరం అంటే బలగాలు ఉపసంహరించబడి స్వదేశానికి పంపిన తర్వాత మాత్రమే స్పష్టంగా ప్రదర్శించబడింది. చర్చిల్ సైత క్రిప్స్ చేసిన స్వాతంత్ర ప్రకటన పెద్దగా ఫలితాలను ఇవ్వలేదని గ్రహించాడు. యుద్ధం చివరినాటికి చర్చిల్ గద్దె దిగాడు. కొత్తగా అధికారంలోకి వచ్చిన లేబర్ ప్రభుత్వం భారత్‌కు స్వాతంత్ర్యం ప్రసాదించిన ఘటనను చూస్తుండిపోయాడు. బ్రిటిష్ వారు త్వరలోనే దేశం వదిలి వెళ్లనున్నారన్న నమ్మకమే కాంగ్రెస్ వారిని 1945-46లో నిర్వహించబడిన ఎన్నికలలో పాల్గొనడానికి సంసిద్ధులను చేసింది. కాంగ్రెస్ ప్రాదేశిక ప్రభుత్వాలను ఏర్పర్చారు కూడా.[1] సింహాకలోకనంలో, తాత్కాలికంగా యుద్ధానికి మద్దతు ప్రకటించి కాంగ్రెస్‌ను తృప్తిపరచడానికి సరైన పథకం లేకుండా చేసిన ఈ విఫలయత్నం వల్ల యుద్ధం ముగింపుకు వచ్చేసరికి భారత్ నుంచి బ్రిటిష్ వారు వైదొలగడం అనివార్యం అయిపోయింది.

సూచనలు[మార్చు]

  1. జుడిత్ బ్రౌన్ మోడ్రన్ ఇండియా. ది మేకింగ్ ఆఫ్ ఎన్ ఆసియన్ డెమాక్రసీ' (ఆక్స్‌ఫర్డ్) 1999 (2వ ఎడిషన్) pp. 328–30.

క్రిప్స్ రాయబారం గురించి మహాత్మా గాంధీ మాట్లాడుతూ అది పతనమవుతున్న బ్యాంకుల చెల్లని చెక్కుగా వర్ణించాడు.

మరింత చదవడానికి[మార్చు]

బాహ్య లింకులు[మార్చు]