Jump to content

క్రిస్టల్ డిసౌజా

వికీపీడియా నుండి


క్రిస్టల్ డిసౌజా
2018లో క్రిస్టల్ డిసౌజా
జననం (1990-03-01) 1990 మార్చి 1 (వయసు 34)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2007 - ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
  • ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై
    * ఏక్ నయీ పెహచాన్
    * బ్రహ్మరక్షస్
    * బేలన్ వలీ బహు

క్రిస్టల్ డిసౌజా (ఆంగ్లం: Krystle D'Souza; జననం 1990 మార్చి 1) ప్రధానంగా హిందీ టెలివిజన్‌ ధారావాహికలలో నటించే భారతీయ నటి. ఆమె 2007లో కహే నా కహే(Kahe Naa Kahe)లో కింజల్ పాండే పాత్రతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై(Ek Hazaaron Mein Meri Behna Hai)తో ఆమె జీవికా వధేరా పాత్రను పోషించింది.[1]

ఏక్ నయీ పెహచాన్‌లో సాక్షి మోడీ, బ్రహ్మరాక్షస్‌లో రైనా శర్మ,[2] బెలన్ వలీ బహులో రూపా అవస్థి పాత్రలలో ఆమె నటనతో బాగా ప్రసిద్ధి చెందింది. ఆమె 2019లో ఫిట్‌రాత్తో వెబ్‌ సీరీస్ లోకి అడుగుపెట్టింది. 2021లో చెహ్రేతో సినీ రంగ ప్రవేశం చేసింది.

బాల్యం

[మార్చు]

ఆమె 1990 మార్చి 1న ముంబైలో క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఆమె దేవుడిని బలంగా నమ్ముతుంది.[3]

కెరీర్

[మార్చు]

ఆమె కళాశాల విద్యలో ఉండగానే తన నటనా వృత్తిని ప్రారంభించింది. ఆపై 2007లో కహే నా కహేలో నటించింది. ఆ తర్వాత క్యా దిల్ మే హైలో తమన్నా పాత్రలో మెప్పించింది. 2008లో ఆమె స్టార్ ప్లస్ కస్తూరిలో నవనీత్‌గా, కిస్ దేశ్ మే హై మేరా దిల్‌లో వీర పాత్రలలో నటనకు గుర్తింపుపొందింది.

2010లో ఆమె సోనీ టీవీ బాత్ హమారీ పక్కి హైలో తారగా నటించింది. ఆమె సోనీ టీవీ ఆహత్‌లో కూడా అతిధి పాత్రలో కనిపించింది, అదే సంవత్సరంలో యామిని పాత్రను పోషించింది.

2011లో ఆమె కరణ్ టాకర్ సరసన ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హైలో జీవికా వధేరా పాత్ర పోషించింది.

గుర్తింపు

[మార్చు]
  • 2013లో ఈస్టర్న్ ఐ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్ట్‌లో ఆమె 19వ స్థానంలో నిలిచింది.[4]
  • టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియన్ టెలివిజన్ 2017లో టాప్ 20 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్‌ల జాబితాలో ఆమె 5వ స్థానంలో నిలిచింది.[5]

అవార్డులు, నామినేషన్లు

[మార్చు]
Year Award Category Show Result Reference
2012 గోల్డ్ అవార్డులు మోస్ట్ ఫిట్ యాక్టర్ (ఫిమెల్) విజేత [6]
ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు బెస్ట్ యాక్ట్రెస్ డ్రామా (జ్యూరీ) ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై నామినేటెడ్ [7]
2014 ఇండియన్ టెలీ అవార్డులు బెస్ట్ యాక్ట్రెస్ ఏక్ నయీ పెహచాన్ నామినేటెడ్
గోల్డ్ అవార్డులు మోస్ట్ ఫిట్ యాక్టర్ (ఫిమేల్) నామినేటెడ్
2015 ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డులు మోస్ట్ స్టైలిష్ నటి విజేత
2018 గోల్డ్ అవార్డులు స్టైల్ దివా నామినేటెడ్
మోస్ట్ ఫిట్ యాక్టర్ (ఫిమెల్) నామినేటెడ్
బెస్ట్ యాక్టర్ ఇన్ ఎ కామిక్ రోల్ (ఫిమేల్) బేలన్ వలీ బహు విజేత [8]

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday Krystle D'souza: Interesting facts about this green-eyed young star | Entertainment News,The Indian Express". web.archive.org. 2023-04-21. Archived from the original on 2023-04-21. Retrieved 2023-04-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Ekk Nayi Pahchaan to end in September? - Times of India". web.archive.org. 2023-04-21. Archived from the original on 2023-04-21. Retrieved 2023-04-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "I have a friend in Jesus: Krystle D'souza - Times of India". web.archive.org. 2023-04-21. Archived from the original on 2023-04-21. Retrieved 2023-04-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "Katrina Kaif named world's sexiest Asian woman for the fourth time : Bollywood, News - India Today". web.archive.org. 2016-09-17. Archived from the original on 2016-09-17. Retrieved 2023-04-21.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Meet The Times 20 Most Desirable Women on TV - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2018-08-07.
  6. "Winners & Nominees of 5th Boroplus Gold Awards, 2012". 16 July 2012. Retrieved 26 July 2016.
  7. "The Indian Television Academy Awards, 2012". IndianTelevisionAcademy.com. Archived from the original on 21 October 2013. Retrieved 18 March 2016.
  8. "In Pics: Zee Gold Awards 2018 Full Winners List: Jennifer Winget, Nakuul Mehta, Mouni Roy walk away with the trophies". DNA India. 20 June 2018. {{cite web}}: |first= missing |last= (help)