క్రిస్టోఫర్ పిన్ని
| క్రిస్టోఫర్ పిన్ని | |
|---|---|
2013 ఏప్రిల్ 20న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఇన్వెస్టిచర్ సెర్మనీ-IIలో ప్రొఫెసర్ క్రిస్టోఫర్ పిన్నీకి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. | |
| నివాస ప్రాంతం | యునైటెడ్ కింగ్‌డమ్ |
| వృత్తి | మానవ శాస్త్రవేత్త (Anthropologist) |
| పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
క్రిస్టోఫర్ పిన్ని (ఆంగ్లం: Christopher Pinney), ఒక మానవ శాస్త్రవేత్త, చరిత్రకారుడు. ఆయన యూనివర్శిటీ కాలేజ్ లండన్ లో మానవ శాస్త్రం, దృశ్య సంస్కృతి ప్రొఫెసర్.[1] దక్షిణాసియా, ముఖ్యంగా భారతదేశం దృశ్య సంస్కృతిపై చేసిన అధ్యయనాలకు ఆయన ప్రసిద్ధి చెందాడు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషికి గాను 2013లో భారత ప్రభుత్వం ఆయనకు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ ప్రదానం చేసి సత్కరించింది.[2]
క్రిస్టోఫర్ పిన్ని భారతదేశాన్ని పర్యటించాడు. ఆయన క్రోమోలితోగ్రాఫ్స్ సేకరణ శతాబ్దం ప్రారంభంలో గ్రామీణ మధ్యప్రదేశ్, కుంభమేళా, హోళీ, రంగ్ పంచమి వంటి సాంస్కృతిక పండుగలు, హుస్సేన్ టెక్రి, భేరూజీ మందిర్, సౌత్ పార్క్ స్ట్రీట్ సిమెట్రీ, ఇండియన్ మ్యూజియం వంటి చారిత్రక ప్రదేశాలను కవర్ చేసింది.[3][4]
ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ చికాగో, యూనివర్శిటి ఆఫ్ కేప్ టౌన్, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి అనేక సంస్థలలో ఆయన పనిచేసాడు. ఆయన లండన్ లోని యూనివర్శిటీ కాలేజీలో ఆంత్రోపాలజీ, విజువల్ కల్చర్ ప్రొఫెసర్ గా, నార్త్వెస్ట్రన్ యూనివర్శిటీలో ఆర్ట్ హిస్టరీ క్రో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నాడు.
క్రిస్టోఫర్ పిన్ని అనేక పుస్తకాలను ప్రచురించాడు. కెమెరా ఇండికాః ది సోషల్ లైఫ్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రాఫ్స, ఫోటోస్ ఆఫ్ ది గాడ్స్, ది కమింగ్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఇన్ ఇండియా వంటివి కొన్ని ముఖ్యమైనవి.[5][6][7][8][9][10][11][12]
ఆయన ఎడిటర్ హోదాలో అనేక పత్రికలు, ఇతర ప్రచురణలో సహకరించాడు. ఆయన బియాండ్ ఎస్తెటిక్స్ః ఆర్ట్ అండ్ ది టెక్నాలజీస్ ఆఫ్ ఎన్చాన్ట్మెంట్, ప్లెజర్ అండ్ ది నేషన్ః ది హిస్టరీ, పాలిటిక్స్ అండ్ కన్స్యూమషన్ ఆఫ్ పబ్లిక్ కల్చర్ ఇన్ ఇండియా, ఫోటోగ్రఫీ ఇతర పత్రికలకు సహ-సంపాదకుడు.[13]
గుర్తింపు
[మార్చు]- పద్మశ్రీ పురస్కారం (2013), భారత ప్రభుత్వం
మూలాలు
[మార్చు]- ↑ "Chris Pinney". UCL Anthropology. University College London. Archived from the original on 23 January 2015. Retrieved 23 January 2015.
- ↑ "Padma 2013". The Hindu. 26 January 2013. Retrieved 10 October 2014.
- ↑ "Rubin Museum". Rubin Museum. 2015. Archived from the original on 28 జనవరి 2015. Retrieved 24 January 2015.
- ↑ "Travel". Pinney.com. 2014. Archived from the original on 21 August 2015. Retrieved 12 October 2014.
- ↑ "FCT World". FCT World. 2015. Archived from the original on 24 September 2015. Retrieved 24 January 2015.
- ↑ "Amazon". Amazon. 2015. Retrieved 24 January 2015.
- ↑ "Book Depository". Book Depository. 2015. Retrieved 24 January 2015.
- ↑ Christopher Pinney (11 April 1998). Camera Indica: The Social Life of Indian Photographs. University Of Chicago Press. p. 240. ISBN 978-0226668659.
- ↑ Christopher Pinney (2004). Photos of the Gods - The Printed Image and Political Struggle in India. Oxford University Press. ISBN 978-0195669008.
- ↑ Christopher Pinney (22 October 2008). Coming of Photography in India. British Library. ISBN 978-0712349727.
- ↑ "University of Chicago". University of Chicago Press. 2014. Retrieved 12 October 2014.
- ↑ "University of London". University of London. 2014. Archived from the original on 26 అక్టోబర్ 2014. Retrieved 12 October 2014.
{{cite web}}: Check date values in:|archive-date=(help) - ↑ "Chris Pinney". UCL Anthropology. University College London. Archived from the original on 23 January 2015. Retrieved 23 January 2015.