క్రిస్ గార్డనర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chris Gardner
Chrisgardner.jpg
జననం (1954-02-09) 1954 ఫిబ్రవరి 9 (వయస్సు: 65  సంవత్సరాలు)
Milwaukee, Wisconsin
వృత్తిFounder & CEO of Gardner Rich & Co

క్రిస్టోఫర్ పాల్ గార్డనర్ (జననం: ఫిబ్రవరి 9, 1954 నాడు మిల్వాకీ, విస్కాన్సిన్లో) ఒక మిలియనీర్, వ్యాపారవేత్త, ప్రేరణాత్మక ఉపన్యాసకుడు మరియు పరోపకారి. 1980ల ప్రారంభములో క్రిస్టోఫర్, జూనియర్ అనే తన పసిబిడ్డను పెంచే సమయములో ఉండడానికి ఇల్లు లేక కష్టపడేవాడు[1] గార్డనర్ వ్రాసిన ద పర్సూట్ అఫ్ హాపీనెస్ అనే తన జ్ఞాపకాల తాలూకు పుస్తకం మే 2006లో ప్రచురించబడింది.[2]

2006 నాటికి అతను చికాగో, ఇల్లినాయిస్లోని అతని స్వంత స్టాక్‌బ్రోకరేజ్ సంస్థ అయిన గార్డనర్ రిచ్ & కంపెనీకు సీఈఓగా ఉన్నాడు. అతను టొరొంటోలో లేని సమయాలలో చికాగోలోనే గడిపేవాడు. తన తల్లి గార్డనర్ బెట్టీ జీన్ ట్రిప్లెట్ (వివాహానికి ముందు పేరు: గార్డనర్) [2][3][4] నుంచి తనకు లభించిన "ఆధ్యాత్మిక జన్యువులు" మరియు తన కొడుకు క్రిస్ జూనియర్ (1981లో జననం) మరియు కూతురు జసింతా (1985లో జననం) లు తన పై అమితంగా ఆశలు పెట్టుకోవటమే తన పట్టుదలకు మరియు విజయానికి కారణమని అతని అభిప్రాయం.[1] తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ఇల్లు లేకుండా కష్టపడుతూ తనను ఒక స్టాక్‌బ్రోకర్ గా స్థిరపరుచుకోవడానికి గార్డనర్ చేసిన వ్యక్తిగత పోరాటం, విల్ స్మిత్ నటించిన ది పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్, అనే 2006 చలనచిత్రములో చిత్రీకరించబడింది.[4][5]

ప్రారంభ సంవత్సరాలు[మార్చు]

గార్డనర్ మిల్వాకీ, విస్కాన్సిన్ లో థామస్ టర్నర్, బెట్టీ జీన్ గార్డనర్ లకు జన్మించాడు. అతను బెట్టీ జీన్ కు రెండవ బిడ్డగా జన్మించాడు. అతని అక్క ఒఫేలియా, పూర్వపు వివాహము ద్వారా జన్మించింది; అతనికంటే చిన్నవారైన అతని ఇతర తోబుట్టువులు షరోన్, కింబర్లీలు అతని తల్లి, ఫ్రెడ్డీ ట్రిప్లేట్ లకు పుట్టారు.

గార్డనర్ యొక్క చిరుప్రాయములో అతనికి మంచి అనుసరణీయయోగ్య పురుషులు ఎక్కువగా ఉండేవారు కాదు ఎందుకంటే అతను పుట్టినప్పుడు అతని తండ్రి లూసియానాలో ఉండేవాడు. అతని సవితి తండ్రి, భార్యా పిల్లలను శారీరకంగా హింసించేవాడు. ట్రిప్లేట్ యొక్క ఆవేశాలను చూసి గార్డనర్ అతని చెల్లెలు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు.[3] ఒక సారి, బెట్టీ జీన్ సంక్షేమ మోసానికి పాల్పడిందని ట్రిప్లెట్ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి, ఆమెను జైలులో పెట్టించాడు; పిల్లలు పెంపుడు తల్లి తండ్రుల సంరక్షణలో ఉంచబడ్డారు. గార్డనర్ యూక్క ఎనిమిదవ ఏట, అతను మరియు అతని సోదరి రెండవసారి పెంపుడు తల్లితండ్రుల సంరక్షణలోకి వెళ్ళవలసి వచ్చింది. వారి తల్లి, పిల్లలకు తెలియకుండా, ట్రిప్లెట్ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటికి నిప్పు అంటించి అతన్ని చంపడానికి ప్రయత్నించినందున ఆమె జైలుకు వెళ్ళింది.[3][6]

పెంపుడు తల్లితండ్రుల సంరక్షణలో ఉన్నప్పుడు, గార్డనర్ కు తన ముగ్గురు మేనమామలతో మొదటిసారిగా పరిచయం ఏర్పడింది: ఆర్చిబాల్డ్, విల్లీ మరియు హెన్రీ. ముగ్గురులో, హెన్రీ అతని మీద గట్టి ప్రభావం చూపించాడు. అతనికి ఒక తండ్రి లాంటి వ్యక్తి బాగా అవసరమయిన సమయములో హెన్రీ అతని జీవితములో అడుగు పెట్టాడు. దురదృష్టవశాత్తు, క్రిస్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో హెన్రీ మిసిస్సిప్పీ నదిలో మునిగిపోయాడు.[2] హెన్రీ అంత్యక్రియలకు తమ తల్లి ఒక జైలు కాపలాదారునితో వచ్చినప్పుడే, తమ తల్లి జైలులో ఉన్నట్లు పిల్లలు తెలుసుకున్నారు.[6]

సంతోషంలేని వివాహము, తరచూ తను లేకపోవడం వంటి అంశాలు ఉన్నప్పటికీ, బెట్టీ జీన్, తన కొడుకు క్రిస్ కు స్ఫూర్తిని మరియు శక్తిని ఇచ్చే వ్యక్తిగా నిలిచింది. తనలో తాను నమ్మకం పెట్టమని ప్రోత్సాహించి, అతనిలో స్వావలంబన యొక్క విత్తనాలను నాటింది. ఆమె ఈ విధంగా చెప్పేదని గార్డనర్ చెప్పాడు, "నువ్వు కేవలం నీ మీద మాత్రమే ఆధారపడాలి. నీ రక్షణకు అశ్వదళము ఏమీ రాదు."[7] తన బాల్య అనుభవాలను బట్టి మద్యపానం, గృహహింస, పిల్లలను హింసించడం, నిరక్షరాస్యత, భయం, చేతకానితనం వంటి అంశాలను తన భవిష్యత్తులో రానీయకూదదని నిర్ణయించుకున్నాడు.[3]

యవ్వన ఆరంభము[మార్చు]

1960ల చివరిలో మరియు 1970ల ప్ర్రారంభం కూడా, గార్డనర్ కు రాజకీయంగాను, సంగీతపరంగానూ ఒక మేలుకొలిపే సమయంగా ఉన్నాయి. మార్టిన్ లూథర్ కింగ్, జూనియర్, మాల్కం ఎక్స్ మరియు ఎల్డ్రిడ్జ్ క్లీవర్ల పుస్తకాలను చదివి, అతనికి తాను నల్లజాతికి చెందిన వాడినని గొప్ప అభిమానం ఏర్పడింది. తనకు తెలిసిన ఆఫ్రికా-అమెరికా అనుభవాలకు బయట అతని ప్రపంచం విస్తరించింది; షార్ప్‌విల్లె జనసంహారం వంటి చారిత్రాత్మక సంఘటనల గురించి తెలుసుకున్నాడు. కావున దక్షిణాఫ్రికాలో అపార్తీడ్ (నల్లజాతి వివక్ష) గురించి మరియు అంతర్జాతీయ స్థాయిలో జాతి విపక్ష సమస్యల గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాడు.[2] గార్డనర్ ట్రంపెట్ వాయించడం నేర్చుకున్నాడు. స్లై స్టోన్, బడ్డీ మైల్స్, జేమ్స్ బ్రౌన్ మరియు అతనికి ఎల్లప్పుడూ ఇష్టమైన మైల్స్ డేవిస్ యొక్క సంగీతాన్ని వినడాన్ని ఇష్టపడ్డాడు.

తన మామ హెన్రీ యు.ఎస్. నౌకాదళంలో చేసిన ప్రపంచవ్యాప్త సాహసాల వలన ప్రేరణ పొంది, తన ఉన్నత పాఠశాల చదువు పూర్తి కాగానే, గార్డనర్ సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నాడు. అతను నార్త్ కరోలినాలోని క్యాంపు లేజూనేలో నాలుగు సంవత్సరాలు ఒక కార్ప్స్‌మాన్ గా ఉన్నాడు. అలంకరించబడిన సాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన గుండె శస్త్రవైద్యుడైన డా. రాబర్ట్ ఎల్లిస్ తో అతనికి పరిచయం ఏర్పడింది. సాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలోని కాలిఫోర్నియా మెడికల్ సెంటర్ విశ్వవిద్యాలయం మరియు వెటెరన్స్ అడ్మినిస్ట్రేషన్ ఆసుపత్రిలో అతను చేస్తున్న నూతన క్లినికల్ పరిశోధనలో తనకు సహాయం చేసే ఒక ఉద్యోగములో చేరడానికి గార్డనర్ ను పిలిచాడు. గార్డనర్ దానికి ఒప్పుకొని, నౌకాదళమునుండి వైదొలిగిన తరువాత 1974లో సాన్ ఫ్రాన్సిస్కో చేరాడు. రెండేళ్లలో, ఒక ప్రయోగశాలను ఏ విధంగా నిర్వహించాలని, వివిధ శస్త్రచికిత్స పద్ధతులను ఏ విధంగా చేయాలో అతను నేర్చుకున్నాడు. 1976 నాటికి ఒక ప్రయోగశాలను నిర్వహించే పూర్తి బాధ్యత అతనికి ఇవ్వబడింది. డా. ఎల్లిస్ తో కలిసి అతను వైద్య సంచికలలో పలు వ్యాసాలు వ్రాశాడు.[2]

వివాహం మరియు ఇబ్బందులు[మార్చు]

జూన్ 18, 1976 నాడు క్రిస్ గార్డనర్ వర్జీనియావాసి అయిన షెర్రీ డైసన్ ను వివాహం చేసుకున్నాడు. ఆమె గణితవిద్యలో నిపుణురాలు. అతని పరిజ్ఞానం, అనుభవం మరియు వైద్యరంగములో అతనికి ఉన్న పరిచయాలు వంటి అంశాల వలన, గార్డనర్ వైద్య వృత్తిని చేపడతాడని అనిపించింది. కాని ఇంకా పది సంవత్సరాలు వైద్యములో శిక్షణ పొందవలసిన అవసరం ఉండడం, వైద్య సంరక్షణ విధానములో ఏర్పడుతున్న మార్పులు వంటి అంశాల వలన, అతను వైద్య వృత్తిని ప్రారంభించే సమయానికి వైద్య వృత్తి చాలా భిన్నంగా ఉంటుందని అతను గ్రహించాడు. అందువలన మరింత లాభసాటిగా ఉండే వృత్తులను ఎంచుకోమని గార్డనర్ కు సలహా ఇవ్వటం జరిగింది; తన 26వ ప్పుట్టిన రోజుకు కొద్ది రోజుల ముందు, తాను ఒక వైద్యుడు కావాలనే కలను విడిచిపెట్టినట్లు అతడు తన భార్య షెర్రీకి చెప్పాడు.[2]

షెర్రీతో అతని సంబంధం సన్నిహితంగా ఉండేది కాదు. దీనికి అతను వైద్య వృత్తిని వద్దని అనుకోవడం కొంత వరకు కారణం. వారి ప్రవర్తనలో ఉన్న తేడాలు కూడా మరొక కారణం. షెర్రీతో కలిసి ఉన్నప్పుడే, జాకీ మెడినా అనే ఒక దంత విద్యార్థినితో అతనికి సంబంధం ఏర్పడింది. సంబంధం మొదలయిన కొన్ని నెలలోనే ఆమె గర్భిణి అయింది. షేర్రితో వివాహం అయి మూడు ఏళ్ళు అయిన తరువాత, అతను ఆమెను వదిలేసి, జాకీతో నివసించడం మొదలు పెట్టి, తండ్రి పాత్రకు సిద్ధమయ్యాడు. తొమ్మిది సంవత్సరాల తరువాత 1986లో అతనికి షేర్రికి చట్టప్రకారం విడాకులు రావటం జరిగింది.[2]

వారి కొడుకు క్రిస్టోఫర్ మెడినా గార్డనర్ జనవరి 28, 1981 నాడు జన్మించాడు. సైన్యములో సేవను వదిలిన తరువాత, గార్డనర్ యూసిఎస్ఎఫ్ మరియు వెటరన్స్ ఆసుపత్రులలో పరిశోధనా సహాయకుడుగా పనిచేశాడు. ఆ పరిశోధనా సహాయకుడిగా ఉద్యోగంలో ఏడాదికి కేవలం $8, 000 జీతమే వచ్చేది. అది తనతో నివసిస్తున్న తనతో సహవాసం చేస్తున్న తన చెలియను, తన బిడ్డను పోషించడానికి సరిపోలేదు. నాలుగు సంవత్సరాల తరువాత, అతను ఈ ఉద్యోగాలను మానేసి, ఒక వైద్య పరికరాల విక్రయదారుడుగా పనిలో చేరి తన జీతమును రెట్టింపు చేసుకున్నాడు.[8]

అతని కొడుకు, అతని అసలు తండ్రి గురించిన వివరాల కోసం ఆరా తీస్తుండగా, గార్డనర్ తన అసలు తండ్రి ఎక్కడ ఉన్నాడో టెలిఫోను ద్వారా తెలుసుకోగలిగాడు. కొత్త ఉద్యోగంలో ఎక్కువ జీతం రావడంతో, సరిపోను డబ్బు ఆదా చేసి గార్డనర్ తన కొడుకుతో కలిసి మోన్రో, లూసియానాకు వెళ్లి తన తండ్రి టర్నర్ ను మొదటి సారిగా కలిశాడు.[2]

సాన్ ఫ్రాన్సిస్కోకు తిరిగి వచ్చిన గార్డనర్ ఎలాగైనా వ్యాపారంలో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. సాన్ ఫ్రాన్సిస్కో జెనెరల్ ఆసుపత్రికి వ్యాపారం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా అతని జీవితములో ఒక్క ముఖ్య ఘట్టం జరిగింది. అప్పుడు ఒక ఎర్ర రంగు ఫెరారీ కారులో నిష్కళంకమైన దుస్తులు ధరించిన ఒక వ్యక్తిని అతను చూశాడు. ఆ వ్యక్తిని అతని వృత్తి గురించి గార్డనర్ ఆసక్తిగా అడిగాడు. తాను ఒక స్టాక్ బ్రోకర్ అని అతను చెప్పడంతో, ఆ క్షణమే గార్డనర్ తన వృత్తి ఏమిటో ఎంచుకున్నాడు.[7] ఎట్టకేలకు, గార్డనర్ తన స్వంత ఫెరారీ కారును ప్రసిద్ధ బాస్కెట్‌బాల్ ఆటగాడైన మైకేల్ జోర్డాన్ నుంచి కొన్నాడు.[3] గార్డనర్ యొక్క నల్ల రంగు ఫెరారీలో ఉన్నఇల్లినాయిస్ లైసెన్స్ ప్లేట్ లో "నాట్ ఏంజే" అని వ్రాసి ఉంటుంది.

ఎర్ర రంగు ఫెరారీలో ఉన్న స్టాక్‌బ్రోకర్ పేరు బాబ్ బ్రిడ్జస్. అతను గార్డనర్ లతో కలిసి, ఆర్థిక ప్రపంచం గురించి పరిచయం చేశాడు. ప్రధాన స్టాక్ బ్రోకరేజ్ సంస్థల నిర్వాహకులను గార్డనర్ కలిసేలా బ్రిడ్జస్ సమావేశాలు ఏర్పాటు చేశాడు. మెర్రిల్ లించ్, పైన్ వేబ్బెర్, ఈ.ఎఫ్. హట్టన్, డీన్ విట్టర్ రేనాల్డ్స్, స్మిత్ బర్నీ వంటి ఈ సంస్థలు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాయి. తదుపరి రెండు నెలలు, తన విక్రయ సమావేశాలను గార్డనర్ రద్దు చేసుకున్నాడు. ఆతను నిర్వాహకులతో సమావేశములో ఉన్నప్పుడు, అతని కారు ఎక్కువ మొత్తములో పార్కింగ్ టికట్టు కట్టవలసి వచ్చింది.[2]

ఈ.ఎఫ్. హట్టన్ వారు తమ శిక్షణ కార్యక్రమానికి గార్డనర్ ను చేర్చుకున్నప్పుడు, అతని జీవితం ఒక మలుపు తిరిగిందని అనిపించింది. ఒక స్టాక్ బ్రోకర్ లాగా పూర్తి స్థాయిలో శిక్షణ తెసుకోవడానికోసం అతను తరువాత తన విక్రయ ఉద్యోగాన్ని మానేశాడు. తరువాత అతను పనిలో చేరడానికి కార్యాలయానికి వెళ్ళినప్పుడు, అక్కడ అతనిని ఉద్యోగములో తీసుకున్న మేనేజరు క్రితం వారమే ఉద్యోగము నుంచి తొలగించబడ్డాడని తెలుసుకుంటాడు. ఇదే సమయములో, గార్డనర్ జాకీ మధ్య సంబంధాలు చెడిపోవడంతో, అతని పరిస్థితి మరింత ఘోరంగా మారింది. ఆమె అతడు తనను కొట్టినట్లు ఆరోపించి, కొడుకును తీసుకుని తూర్పు తీరానికి వెళ్లిపోయింది.- అయితే, ఆ ఆరోపణ నిజం కాదని ఈ నాటికి కూడా అతను చెపుతున్నాడు. అతను జెయిలుకు తీసుకు వెళ్ళబడ్డాడు. పార్కింగ్ టికట్ జరిమానా క్రింద $1, 200 కట్టలేక పోయేసరికి అక్కడే పది రోజులు ఉండవలసిందిగా ఒక న్యాయమూర్తి అతనికి శిక్ష విధించాడు.[4]

గార్డనర్ జైలు నుండి ఇంటికి తిరిగి రాగా, తన అపార్ట్ మెంట్ ఖాళీగా ఉంది. అతని స్నేహితురాలు మరియు అతని కొడుకు, అతని మిగిలిన అన్ని వస్తువులు (అతని సూట్లు, బూట్లు మరియు వ్యాపార దుస్తులతో సహా), మాయమవటం జరిగింది. ఏ అనుభవం లేకుండా, ఏ కాలేజీ విద్య లేకుండా, దాదాపుగా ఏ సంబంధాలు లేకుండా, మరియు కస్టడీలోకి తీసుకున్న రోజున వేసుకున్న అవే సాధారణ దుస్తులు వేసుకుని, గార్డనర్ డీన్ విట్టర్ రేనాల్డ్స్ యొక్క స్టాక్ ఎక్స్చేంగ్ యొక్క శిక్షణా కార్యక్రమంలో స్థానం సంపాదించాడు. అయినా కూడా, నెలవారీ వేతనం అయిన $1, 000 తో (ప్రస్తుతం రోజున $సమాసంలో (Expression) లోపం: "[" అనే విరామ చిహ్నాన్ని గుర్తించలేకపోతున్నాను.{Inflation} - NaN check amount: 1000 or year: 1983. తో సమానమైన విలువ కలిగిన), మరియు ఏమీ దాచుకున్న సొమ్ము లేకుండా, అతనికి జీవించడానికి సరిపోను ఖర్చులకు డబ్బు చాలేది కాదు.[7]

నిలవటానికి ఇల్లు లేని స్థితిలో పితృత్వం[మార్చు]

గార్డనర్ డీన్ విట్టర్ రేనాల్డ్స్ వద్ద ఉత్తమ శిక్షితుడిగా ఉండేవాడు. అతను ప్రతి రోజూ కార్యాలయానికి ముందుగానే వచ్చి, ఆలస్యంగా ఉండేవాడు. రోజుకు కనీసం 200 కాల్స్ చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుని కాబోయే ఖాతాదారులకు ఫోన్ కాల్స్ చేస్తూ ఉండేవాడు. అతని శ్రమ ఫలించి, 1982లో గార్డనర్ లైసెన్సింగ్ పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత పొంది, సంస్థకు పూర్తి స్థాయి ఉద్యోగి అయ్యాడు. తరువాత గార్డనర్ ను సాన్ ఫ్రాన్సిస్కో లోని బేర్ స్టియర్న్స్ & కంపెనీ సంస్థ ఉద్యోగములో తీసుకుంది.

కొడుకును తీసుకుని వెళ్ళిపోయిన జాకీ, నాలుగు నెలలు తరువాత తిరిగి వచ్చి కొడుకును గార్డనర్ తో వదిలేసి వెళ్లిపోయింది. అప్పటికి, అతను కొద్ది పాటి అద్దె కట్టగలే స్థితిలో ఉన్నందున ఒక ఫ్లాప్‌హౌస్ లో ఒక గదిలో ఉండేవాడు. తన కొడుకు బాధ్యతను మనస్ఫూర్తిగా తన ఒక్కడే తీసుకున్నాడు; అయితే, అతను ఉన్న గదిలో పిల్లలను అనుమతించరు. అప్పటికి అతనికి ఒక ఉద్యోగం ఉన్నప్పటికి, గార్డనర్, అతని కొడుకు ఇద్దరూ ఉండడానికి ఇల్లు లేక చాలా శ్రమ పడ్డారు. అతను బెర్కేలే, కాలిఫోర్నియాలో ఒక అద్దె ఇంటికోసం డబ్బు ఆదా చేస్తూ ఉన్నాడు.

దాదాపు ఒక ఏడాది పాటు సాన్ ఫ్రాన్సిస్కోలో టెన్డెర్‌లాయిన్ జిల్లాలో అతను, అతని కొడుకు ఉండడానికి ఇల్లు లేకుండా బాధ పడుతున్నారనే సంగతి గార్డనర్ యొక్క సహా ఉద్యోగులు ఎవరికీ కూడా తెలియలేదు. పగటి పూట పిల్లలను చూసుకునే సంస్థలలో తన కొడుకును పెట్టడానికి గార్డనర్ హడావడిగా పరిగెత్తేవాడు, సూప్ కోసం లైన్ లో నిలబడేవాడు, ఎక్కడ సురక్షితం అనిపిస్తే అక్కడే నిద్ర పోయేవారు - పని వేళల తరువాత కార్యాలయాలలో, ఫ్లాప్‌హౌస్లొ, పార్కులలో, కొన్ని సార్లు బే ఏరియా రేపిడ్ ట్రాంసిట్ స్టేషనులో తాళం వేసిన స్నానాలగదిలో కూడా పడుకునేవారు.[1]

క్రిస్ జూనియర్ యొక్క మంచిని దృష్టిలో పెట్టుకుని, గ్లిడ్ మెమోరియల్ యునైటెడ్ మేతడిస్ట్ చర్చ్ వారి ఇల్లులేని స్త్రీల యొక్క ఆశ్రమములో ఉండడానికి రేవేరెండ్ సిసిల్ విల్లియమ్స్ను గార్డనర్ అనుమతి కోరాడు. ఈ ఆశ్రమం ప్రస్తుతం ది సిసిల్ విల్లియమ్స్ గ్లిడ్ కమ్యూనిటి హౌస్గా పిలవబడుతుంది. ఏ మాత్రం అనుమానం లేకుండా, విల్లియమ్స్ ఒప్పుకున్నాడు.[2] ఇల్లు లేకుండా కష్టపడిన ఆ రోజుల గురించి ఏమి గుర్తున్నాయని ఈనాడు క్రిస్టోఫేర్ గార్డనర్ జూనియర్ ను అడిగితే, "మాకు ఇల్లు లేదని నేను చెప్పలేను కాని మేము ఎప్పుడూ ప్రయాణిస్తూ ఉండేవాళ్ళం. అందుకని, ఏదైనా గుర్తుందంటే అది ఎప్పుడూ తిరుగుతూ ఉండడమే." [3]

వ్యాపార కార్యక్రమాలు[మార్చు]

1987లో చికాగో, ఇల్లినాయిస్లో గార్డనర్ రిచ్ & కో అనే ఒక బ్రోకరేజ్ సంస్థను క్రిస్ గార్డనర్ స్థాపించాడు. అది "ఋణం, ఈక్విటి, డెరివేటివ్ ఉత్పత్తుల పై కేంద్రీకరించిన ఒక సంస్థాగత దళారీ సంస్థ. ఈ సంస్థ దేశములో అతిపెద్ద సంస్థలకు, ప్రజా పింఛను పధకాలకు మరియు యూనియన్లకు సేవలను అందించింది."[4] అతని క్రొత్త సంస్థ, అతని చిన్న ప్రెసిడెన్షియల్ టవర్స్ అపార్ట్‌మెంట్ లో, $10, 000 ప్రారంభ మూలధనంతో ప్రారంభమయింది. కేవలం ఒకే ఒక్క చెక్క బల్ల ఉండేది- అది కుటుంబానికి భోజనపు బల్లగా కూడా వాడబడేది.[9] ఆ స్టాక్ బ్రోకరేజ్ సంస్థలో 75% వాటా గార్డనర్ కు ఉన్నట్లు చెప్పబడుతుంది. మిగిలిన వాటా ఒక హెడ్జ్ ఫండ్ వద్ద ఉంది.[ఉల్లేఖన అవసరం] తన సంస్థలు "గార్డనర్ రిచ్" అనే పేరు పెట్టడానికి కారణము ఏమంటే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్చే క్షమాభిక్ష పొందిన మార్క్ రిచ్ అనే ఒక సరుకుల వర్తకుడిని "ప్రపంచంలోనే అతి గొప్ప విజయాలు సాధించిన ఫ్యూచర్స్ వర్తకులలో ఒకరిగా" గార్డనర్ భావిస్తున్నాడు.[7]

గార్డనర్ రిచ్ లో తన చిన్న వాటాను కొన్ని మిలియన్ల డాలర్లకు 2006లో అమ్మేసి, క్రిస్టోఫర్ గార్డనర్ ఇంటర్‌నేషనల్ హోల్డింగ్స్ అనే సంస్థను స్థాపించి దానికి సిఈఓ అయ్యాడు. ఈ సంస్థకు న్యూ యార్క్, చికాగో మరియు సాన్ ఫ్రాంసిస్కో లలో కార్యాలయాలు ఉన్నాయి.[4] దక్షిణాఫ్రికాలో జాతి విపక్ష ముగిసిన 10వ వార్షికోత్సవ సమయములో అక్కడ ఎన్నికలను చూడడానికి వెళ్ళిన గార్డనర్, నెల్సన్ మండేలాను కలిసి, దక్షిణ ఆఫ్రికా మార్కెట్ లలో పెట్టుబడి పెట్టె అవకాశాన్ని గురించి చర్చించాడు. ఈ విషయాన్ని తన 2006 ఆత్మకథలో సూచించాడు. దక్షిణాఫ్రికాతో కలిసి ఒక పెట్టుబడి కార్యక్రమాన్ని గార్డనర్ రూపొందిస్తున్నట్లు చెప్పబడుతుంది. ఇది వందలాది మందికి ఉపాధి కల్పిస్తుందని మిలియన్ల పరిమాణంలో విదేశీ నగదు దేశములోకి తీసుకు రాబడుతుందని చెప్పబడుతుంది. ఆ పధకం యొక్క వివరాలను, సెక్యూరిటీల చట్టం దృష్ట్యా, వెల్లడించడానికి గార్డనర్ నిరాకరించాడు.[10]

దాతృత్వ యత్నాలు[మార్చు]

క్రిస్ గార్డనర్ ఒక పరోపకారి. అనేక దాతృత్వ సంస్థలకు అతను ప్రయోజితుడు.[11] ముఖ్యంగా కారా ప్రోగ్రాం మరియు సాన్ ఫ్రాన్సిస్కో లోని గ్లిడ్ మెమోరియల్ యునైటెడ్ మెధడిస్ట్ చర్చి. అక్కడే అతను, అతని కొడుకు ఇద్దరూ వారికి చాలా అవసరమైన ఆశ్రయాన్ని పొందారు.[4] సాన్ ఫ్రాన్సిస్కోలో ఒక యుఎస్ $50 మిలియను పధకానికి నిధులు సమకూర్చడంలో అతను సహాయపడ్డాడు. ఈ పధకం ద్వారా అతను ఒకప్పుడు ఇల్లు లేక నిరాశ్రయంగా ఉన్న అదే ప్రాంతములో, తక్కువ-ఆదాయం కలిగిన వారికి ఇళ్ళు మరియు ఉద్యోగ అవకాశాలు కలించటం జరుగుతుంది.[1] నిధులు సహాయం చేయడమే కాకుండా, బట్టలు, బూటులను కూడా గార్డనర్ విరాళంగా ఇస్తాడు. చికాగోలో ఉన్న నిరాశ్రయ ప్రజలకు, ఆపదలో ఉన్న సమాజాలకు నిరంతరమైన ఉద్యోగం కొరకు సహాయం, వృత్తిరీత్యా సలహాలు, పూర్తి స్థాయి ఉద్యోగ శిక్షణ వంటి అంశాలకు అతనే స్వయంగా అందుబాటులో ఉంటాడు.[4]

నేషనల్ ఫాదర్‌హుడ్ ఇనిషియేటివ్ (ఎన్‌ఎఫ్‌ఐ) అనే సంస్థ యొక్క పాలక మండలి సభ్యుడిగా వ్యవహరిస్తూ, పిల్లల సంరక్షణలో తండ్రి యొక్క పాత్రను ప్రోత్సాహించడంలో నిమగ్నుడై ఉన్నాడు.[4] అతను నేషనల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు పాలక మండలి సభ్యుడుగా ఉంటూ రెండు వార్షిక విద్యా అవార్డులను అతను స్పాన్సర్ చేస్తున్నాడు: నేషనల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ వారి నేషనల్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ పర్సనల్ అవార్డు మరియు అమెరికన్ ఫెడెరేషన్ అఫ్ టీచర్స్ పారాప్రొఫెషనల్స్ అండ్ స్కూల్-రిలేటడ్ పర్సనల్ అవార్డు .[4]

2002లో, ఫాదర్ అఫ్ ది ఇయర్ అవార్డును గార్డనర్ ఎన్ఎఫ్ఐ నుండి అందుకున్నాడు. ఆ అరువాత గార్డనర్ లాస్ ఏంజెలెస్ కమిషన్ ఆన్ అసాల్ట్స్ అగైన్స్ట్ విమెన్ (LACAAW) నుండి 25వ యాన్యువల్ హ్యుమానిటేరియన్ అవార్డును మరియు కాంటినెంటల్ ఆఫ్రికా చాంబర్ అఫ్ కామర్స్ నుండి 2006 ఫ్రెండ్స్ అఫ్ ఆఫ్రికా అవార్డును అందుకున్నాడు.[4]

2008లో, తన కూతురు హాంటన్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయిన సందర్భములో అతను ప్రసంగించాడు.

జనరంజక సంస్కృతిలో[మార్చు]

ది పుర్సూట్ అఫ్ హాప్పీనెస్[మార్చు]

జనవరి 2002లో 20/20కు అతను ఇచ్చిన ఒక ముఖాముఖి కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లభించిన ప్రతిస్పందనను చూసిన అతను తన కథకు హాలివుడ్ సామర్ధ్యం ఉందని తెలుసుకున్నాడు.[12] మే 23, 2006 నాడు అతను తన ఆత్మకథను ప్రచురించాడు. తరువాత డిసెంబర్ 15, 2006 నాడు ద పర్సూట్ అఫ్ హ్యాపీనెస్ అనే పెద్ద చలన చిత్రానికి ఒక సహనిర్మాతగా వ్యవహరించాడు. ఈ చిత్రానికి గాబ్రియేల్ ముక్కినో దర్శకత్వం వహిస్తే, కొలంబియా పిక్చర్స్ విడుదల చేసింది.[4] ఈ చిత్రం యొక్క అసాధారణమైన శీర్షిక, నిరాశ్రయంగా ఉన్నప్పుడు గార్డనర్ చూసిన ఒక జ్ఞాపిక నుండి వచ్చింది. ఆ చిత్రములో గార్డనర్ కొడుకు ఉన్న పగటి పూట పిల్లలను చూసుకునే సంస్థ బయట "హాపీనెస్ (happiness)" అనే పదం ("హప్పినెస్ -happyness" ) అని తప్పుగా వ్రాయబడి ఉంటుంది.

విల్ స్మిత్, తాండీ న్యూటన్, స్మిత్ కొడుకు జాడేన్ స్మిత్ నటించిన ఈ చిత్రం దాదాపు ఒక ఏడాదిగా నిరాశ్రయంగా గార్డనర్ పడ్డ కష్టాల పై కేంద్రీకరిస్తుంది. దేశవ్యాప్తంగా $163 మిలియను, ప్రపంచవ్యాప్తంగా $300 మిలియను వసూళ్లు నమోదు చేసిన ఈ చిత్రం, $100 మిలియనుకు పైన నమోదు చేసిన విల్ స్మిత్ యొక్క వరుస ఘనవిజయాలలో ఒకటిగా నిలిచింది. గార్డనర్ యొక్క యధార్ధ జీవిత కథలో ఈ చిత్రం కొన్ని మార్పులు చేసింది. కొన్ని వివరాలు, సంఘటనలు వాస్తవముగా కొన్ని సంవత్సరాల వ్యవధిలో జరుగగా, చిత్రములో వాటిని తక్కువ కాల వ్యవధిలోనే జరిగినట్లు చూపించారు. అలాగే, అప్పుడు గార్డనర్ కొడుకు క్రిస్ జూనియర్ ఒక పసిబిడ్డ కాగా, చిత్రములో ఐదు ఏళ్ల బాలుడుగా చూపించి, ఆ పాత్రాన్ని ఎనిమిది ఏళ్ల వయస్సు గల జేడన్ పోషించాడు. యాక్షన్ చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించిన స్మిత్, తన లాగా నటించటానికి సరైన నటుడు కాదని క్రిస్ గార్డనర్ అనుకున్నాడట. అయితే, "మోహమద్ అలీ పాత్రనే స్మిత్ పోషించినప్పుడు, నీ పాత్రను సుళువుగా చేయగలడు!" అని అతని కూతురు జసింతా అతనికి "నచ్చ చెప్పింది".[13] గార్డనర్ ఆ చిత్రములో ఒక కేమియో పాత్రలో కనిపిస్తాడు. ఆఖరి దృశ్యంలో, విల్, జేడన్ ఇద్దర్ని దాటి అతను నడుచుకుంటూ వెళ్తాడు. గార్డనర్, విల్ ఇద్దరూ ఒకరినొకరు పలుకరించుకుంటారు; తరువాత గార్డనర్ నడచి వెళ్లిపోతున్న దాన్ని విల్ తిరిగి చూస్తాడు. అతని కొడుకు నాక్ నాక్ చలోక్తులు చెప్పడం ప్రారంభిస్తాడు.

చట్టనూగా, టేనసీలో అడుగు స్థాయిలో నిరాశ్రయంగా ఉన్న ప్రజలకు గార్డనర్ కథ స్ఫూర్తిని ఇచ్చి, వారు ఆర్థికంగా మెరుగు పడతారు, వారు తమ కుటుంబాల పై మరింత బాధ్యతలు తీసుకుంటారనే ఆశతో, చట్టనూగా మేయర్ ఆ నగర నిరాశ్రయ ప్రజలకు ఈ చిత్రాన్ని చూపించడానికి ఏర్పాటు చేశాడు.[14] తన కథలో ఉన్న సామాజిక సమస్యల దృష్ట్యా, దానిని ఇతరులతో పంచుకోవలసిన అవసరం ఉందని గార్డనర్ కే అనిపించింది. "గృహములో తాగుబోతుతనం, గృహ హింస, పిల్లలను దూషించడం, నిరక్షరాస్యత గురించి నేను మాట్లాడినప్పుడు, అవన్ని కూడా సర్వత్రా ఉన్న సమస్యలు; కేవలం కొన్ని జిప్ కోడ్లకే పరిమితం కావు" అని అతను చెప్పాడు.[1]

గార్డనర్ డిసెంబర్ 15, 2006న జరిగిన ఆ సినిమా యొక్క ప్రీమియర్ నుండి గైరు హాజరయ్యాడు. అతను దానికి బదులుగా, స్ఫూర్తికారక అతిథి ఉపన్యాసకారునిగా కెనోషా, విన్కన్సిన్లోని జేహెచ్ టీ హొల్డింగ్స్, ఇంక్., వద్ద జరిగిన క్రిస్మస్ పార్టీలో ప్రసంగించాడు.[15]

ఇతర నటనా ప్రదర్శనలు[మార్చు]

గార్డనర్ కెనడా యొక్క లఘుచిత్రం కం ఆన్ డౌన్: సర్చింగ్ ఫర్ థ అమెరికన్ డ్రీం (2004) లో నటించగా, [16] అక్కడ అతను అమెరికన్ డ్రీం గురించి డౌన్ టౌన్ చికాగోలోని తన కార్యాలయంలో మాట్లాడాడు. ఆ లఘుచిత్రంలో బాబ్ బార్కర్ మరియు హంటర్ ఎస్. థామ్సన్లు నటించారు.

గార్డనర్ 2008 లోని హాస్యప్రధానమైన చిత్రం థ ప్రమోషన్లో అతిథి పాత్రలో కనిపించి, ఒక సంఘానికి నాయకుడిగా పాత్రను పోషించాడు.[17]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • రాగ్స్-టు-రిచెస్

గమనికలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 Gandossy, Taylor (January 16, 1222). "From sleeping on the streets to Wall Street". CNN. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help) ఉదహరింపు పొరపాటు: చెల్లని <ref> ట్యాగు; "CNN" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 2.7 2.8 2.9 Gardner, Chris (2006). The Pursuit of Happyness. Amistad. ISBN 978-0-06-074487-8.
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 Oprah Winfrey (2006-12-14). The Oprah Winfrey Show (TV Show). Chicago, Il.
 4. 4.00 4.01 4.02 4.03 4.04 4.05 4.06 4.07 4.08 4.09 4.10 "Christopher Gardner: The Official Site". మూలం నుండి 2012-03-14 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite web requires |website= (help)
 5. "The Pursuit of Happyness". Sony. December 2006. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help)
 6. 6.0 6.1 Barber, Andrew (2006-12/2007-1). "Christopher Gardner". aTrader. మూలం నుండి 2013-08-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-10-20. Cite news requires |newspaper= (help); Check date values in: |date= (help)
 7. 7.0 7.1 7.2 7.3 Yang, Jia Lynn (2006-09-15). "'Happiness' for sale: He's gone from homeless single dad to successful stockbroker". CNN Money. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help)
 8. క్రిస్ గార్డనర్ గ్లైడ్ సూప్ కిచన్ నుండి పెద్ద తెర వరకు, సంతోషానికై ప్రాకులాడాడు.
 9. Konkol, Mark J. (2006-12-15). "'Jesus loves me. He only likes you'". Chicago Sun-Times. మూలం నుండి 2008-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help)
 10. Costantinou, Marianne (2005-10-10). "Chris Gardner has pursued happiness, from the Glide soup kitchen to the big screen". San Francisco Chronicle. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help)
 11. "Christopher Gardner Biography". Keppler Speakers.
 12. Zwecker, Bill (2003-07-17). "There's a Way—and Maybe a Will—for Gardner Story". Chicago Sun-Times. p. Pg. 36.
 13. "Christopher Gardner unimpressed with Will Smith". Newswire. HT Media Ltd. 2006-12-14. pp. 102 words. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 14. "News briefs from around Tennessee". AP Newswire. 2006-12-15. pp. 788 words. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help); Cite news requires |newspaper= (help)
 15. AP staff (December 24, 2006). "Man Who Inspired B.O. Hit Skips Opening". Associated Press. మూలం నుండి 2009-01-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-07-14. Cite news requires |newspaper= (help)
 16. "మానిఫెస్టేషన్ టెలివిషన్ ఇంక్". మూలం నుండి 2005-08-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2020-01-07. Cite web requires |website= (help)
 17. "క్రిస్ గార్డనర్ మీడియా - వీడియోలు". మూలం నుండి 2009-04-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-03-08. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]