క్రోసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొలమానం

క్రోసు దూరానికి కొలమానం. దీనిని పురాతనకాలంలో ఎక్కువగా వాడేవారు. దీనిని విష్ణు పురాణంలో వివరించడమైనది.

వివరణ[మార్చు]

యోజనము రెండు రకములుగా నిర్వచింపబడుతున్నది. అంటే రెండు వేరువేరు విలువలు గల కొలతలు, ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకే పేరు యోజనముతో ఉన్నాయి అన్నమాట. రెండు యోజనాల నాలుగవ వంతును ఒక క్రోసు అని అంటారు.   చిన్న యోజనము 4.6 మైళ్ళకు సమానము. చిన్న యోజనములో నాలుగవ వంతు అయిన క్రోసులు 60, ఒక డిగ్రీ అక్షాంశాలకు సమానంగా కనబడుతున్నది. పెద్ద యోజనము సుమారు 8.59 మైళ్ళకు సమానం. అంటే భూమధ్యరేఖ వద్ధ 1/8 వంతు అక్షాంశ డిగ్రీకి సమానం ఔతుంది[1].

ఈజిప్టులోని అతి పెద్ద పిరమిడ్ గిజా. ఇది జ్యోతిర్మండల కొలతలకు అనుగుణంగా కట్టబడింది అంటారు. ఆ గిజా పిరమిడ్ చుట్టుకొలత ఒక చిన్న యోజనము క్రోసుకు సమానం.

పురాణాలలో వాడుక[2][మార్చు]

3 బెత్తెలు = 1 జాన

2 జానలు = 1 మూర

2 మూరలు = 1 గజము (1 గజము = 3 అడుగులు / 1 అడుగు = 12 అంగుళాలు)

2 గజాలు = 1 బార

2 బారలు = 1 దండము

1000 దండములు = 1 క్రోసు[3]

5 క్రోసులు = 1 యోజనం / 1 ఆమడ (1 – యోజన 9.09 మైళ్లు, 14.62894 కిలో మీటర్లు)

ఇతిహాసాలలో ఈ కొలమనాలని వాడటం జరిగింది,

ఉదాహరణకు : ఆంజనేయ స్వామి 100 యోజనాల సముద్రాన్ని దూకాడు. అంటే సుమారు 1462 కి.మీ.

సామెత[మార్చు]

ఎంత దూరం పెద్దమ్మా, క్రోసెడు దూరం చిన్నయ్యా - వంటి సామెతలతో ఇంకా ఈ పదం వాడుకలోనే ఉంది.

మూలాలు[మార్చు]

  1. సాంబశివరావు, శ్రీ ఊలపల్లి. "యోజనము కొలత : వ్యాసములు : వివరణలు : పోతన తెలుగు భాగవతము". telugubhagavatam.org. Retrieved 2020-04-19.
  2. "ప్రాచీన కాలంలో దూరాన్ని ఎలా కొలిచే వారు?". Vedic RAYS - తెలుగు (in ఇంగ్లీష్). Retrieved 2020-04-19.[permanent dead link]
  3. "వేదాలలో వైజ్ఞానిక విశేషాలు | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2020-04-19.
"https://te.wikipedia.org/w/index.php?title=క్రోసు&oldid=3262418" నుండి వెలికితీశారు