Jump to content

క్లాస్‌మేట్స్

వికీపీడియా నుండి
(క్లాస్ మేట్స్ నుండి దారిమార్పు చెందింది)
క్లాస్‌మేట్స్‌
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ భాస్కర్
నిర్మాణం రవికిశోర్‌
కథ జేమ్స్ ఆల్బర్ట్
చిత్రానువాదం విజయ భాస్కర్‌
తారాగణం సుమంత్‌,సదా, కమలినీ ముఖర్జీ, శర్వానంద్‌, సునీల్‌, రవివర్మ, తనికెళ్ల భరణి, గిరిబాబు, వేమూరి సత్యనారాయణ, సుధ
సంగీతం కోటి
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం అనుమోలు హరి
కళ పేకేటి రంగా
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌
విడుదల తేదీ 20 ఏప్రిల్, 2007
భాష తెలుగు

క్లాస్ మేట్స్ 2007 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా. స్రవంతి మూవీస్ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రంలో యార్లగడ్డ సుమంత్, సదా, కమలినీ ముఖర్జీ, శర్వానంద్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం, కె. విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కినది . సంగీతం కోటి సమకూర్చారు .

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఒకే కాలేజీలో... ఓ బ్యాచ్‌ విద్యార్థులంతా పదేళ్ల తర్వాత మళ్లీ కలుసుకుంటారు. రవికుమార్‌ (సుమంత్‌), రాజేశ్వరి (సదా) ఆ బృందంలో ఉంటారు. అప్పటి క్లాస్‌మేట్స్‌ కాలేజీ రోజుల్లోకి వెళ్లి... నాటి చిలిపి పనులు... ఎన్నికల హంగామా... సరదాగా రాసుకున్న ప్రేమ లేఖలు... ప్రిన్సిపాల్‌ హెచ్చరికలూ... ఒక్కోటీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ గడప దాటేశాక వామపక్ష భావాలతో ఉన్న విద్యార్థి కాస్తా వ్యాపారవేత్తగా స్థిరపడటం... ఓ యువకుడు రాజకీయ నాయకుడిగా మారడం... జరుగుతుంది. వాళ్లంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ రహస్యం బయటపడుతుంది.

తారాగణం

[మార్చు]
  • సుమంత్_రవికిరణ్
  • సదా_రాజేశ్వరి
  • శర్వానంద్_మురళీ
  • కమలినీ ముఖర్జీ_రజియా
  • రవివర్మ_యం.ఎల్.ఎ.సతీష్
  • సునీల్_బద్దు
  • శివారెడ్డి_సతీష్ ఫ్రెండ్
  • కోట శ్రీనివాస్_మురళీ తండ్రి
  • సుధ_మురళి తల్లి
  • ఎర్రా గిరిబాబు_ప్రిన్సిపాల్
  • తనికెళ్ల భరణి_హాస్టల్ వార్డెన్
  • ఉత్తేజ్_హాస్టల్ బాయ్
  • చిట్టిబాబు_బంట్రోతు
  • కరుణ_బద్దు భార్య
  • ఆహుతి ప్రసాద్
  • రఘుబాబు _పోలీస్ ఇన్ స్పెక్టర్
  • రజిత.

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: కుంభకోణం విజయభాస్కర్
  • చిత్రానువాదం: కె.విజయభాస్కర్
  • కథ: జేమ్స్ అలర్ట్
  • మాటలు: అబ్బూరి రవి
  • సంగీతం: కోటి
  • గీత రచయితలు: చెంబోలు (సిరివెన్నెల )సీతారామశాస్త్రి
  • నేపథ్య గాయకులు: వేదాల హేమచంద్ర, సందీప్ కౌసల్య, టిప్పు, మల్లిఖార్జున్, అంజనా సౌమ్య, కె ఎస్ చిత్ర, అంబడిపూడి
  • ఛాయ గ్రహణం: అనుమోలు హరి
  • ఎడిటింగ్: అక్కినేని శ్రీకర ప్రసాద్
  • ఆర్ట్: పేకేటి రంగా
  • నిర్మాత: రవికిశోర్
  • నిర్మాణ సంస్థ: స్రవంతి మూవీస్
  • విడుదల:20:04:2007.

పాటలు

[మార్చు]
  • గుండె చాటుగా ఇన్ని నాల్లుగా , వేదాల హేమ చంద్ర
  • భూగోళంతో బంతాట ఆడాలంటుంది మన పాదం, వేదాల హేమ చంద్ర, సందీప్ కౌసల్య
  • నరనరాల్లో ఉత్సాహం ఉరకలే యువతరం, టిప్పు
  • మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు, మల్లికార్జున్, అంజనా సౌమ్య
  • గుండె చాటుగా , (ఫిమేల్ వాయిస్), చిత్ర, అంబడిపూడి .