క్లింట్ ఈస్ట్‌వుడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లింట్ ఈస్ట్‌వుడ్
క్లింట్ ఈస్ట్‌వుడ్ (2010)
30వ కార్మెల్-బై-ది-సీ మేయర్
In office
1986, ఏప్రిల్ 8 – 1988, ఏప్రిల్ 12
వ్యక్తిగత వివరాలు
జననం
క్లింటన్ ఈస్ట్‌వుడ్ జూనియర్

(1930-05-31) 1930 మే 31 (వయసు 93)
శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా
రాజకీయ పార్టీలిబర్టేరియన్ పార్టీ (యునైటెడ్ స్టేట్స్) (2008–ప్రస్తుతం)[1]
ఇతర రాజకీయ
పదవులు
రిపబ్లికన్ (1951–2008)[1]
జీవిత భాగస్వామి
  • మాగీ జాన్సన్
    (m. 1953; div. 1984)
  • దినా రూయిజ్
    (m. 1996; div. 2014)
Domestic partner
  • సోండ్రా లాక్ (1975–1989)
  • ఫ్రాన్సెస్ ఫిషర్ (1990–1995)
  • క్రిస్టినా సాండెరా (2015–ప్రస్తుతం)
వృత్తి
  • నటుడు
  • దర్శకుడు
  • నిర్మాత
సంతకం

క్లింటన్ ఈస్ట్‌వుడ్ జూనియర్ అమెరికన్ సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. "రాహైడ్" అనే వెస్ట్రన్ టివి సీరియల్ మంచి ఆదరణ పొందిన తరువాత, 1960ల మధ్యకాలంలో "డాలర్స్ ట్రయాలజీ "లో "మ్యాన్ విత్ నో నేమ్" అనే పాత్రతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాడు. యాంటీహీరో కాప్ హ్యారీ కల్లాహన్‌గా 1970లు, 1980లలో ఐదు డర్టీ హ్యారీ సినిమాలు చేశాడు.[2] 1986లో ఎన్నికైన ఈస్ట్‌వుడ్, కాలిఫోర్నియాలోని కార్మెల్-బై-ది-సీ మేయర్‌గా రెండు సంవత్సరాలు పనిచేశాడు.

జననం[మార్చు]

ఈస్ట్‌వుడ్ 1930, మే 31న క్లింటన్ ఈస్ట్‌వుడ్ - రూత్ దంపతులకు కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కోలోని సెయింట్ ఫ్రాన్సిస్ మెమోరియల్ హాస్పిటల్‌లో దంపతులకు జన్మించాడు.

సినిమారంగం[మార్చు]

ఎవ్రీ విచ్ వే బట్ లూస్ (1978), ఎనీ విచ్ వే యు కెన్ (1980)[3] ఈస్ట్‌వుడ్ సినిమాలలో వెస్ట్రన్ హాంగ్ ఎమ్ హై (1968), పేల్ రైడర్ (1985), యాక్షన్-వార్ ఫిల్మ్ వేర్ ఈగల్స్ డేర్ (1968), ఎస్కేప్ ఫ్రమ్ ఆల్కాట్రాజ్ (1979), హార్ట్‌బ్రేక్ రిడ్జ్ (1986), ఇన్ ది లైన్ ఆఫ్ ఫైర్ (1993), ది బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ (1995), గ్రాన్ టొరినో (2008), ది మ్యూల్ (2018), క్రై మాకో (2021) సినిమాలు తీశాడు.

అన్‌ఫర్గివెన్ (1992), మిలియన్ డాలర్ బేబీ (2004) సినిమాలకు ఉత్తమ చిత్రం అవార్డులతోపాటు ఉత్తమ దర్శకుడి అవార్డులు గెలుచుకున్నాడు, ఉత్తమ నటుడిగా అకాడమీ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మిస్టిక్ రివర్ (2003), లెటర్స్ ఫ్రమ్ ఇవో జిమా (2006) వంటి సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు, ఈ రెండు సినిమాలకు అకాడమీని అవార్డుకు నామినేట్ అయ్యాడు. చేంజ్లింగ్ (2008), ఇన్విక్టస్ (2009), అమెరికన్ స్నిపర్ (2014), సుల్లీ (2016), రిచర్డ్ జ్యువెల్ (2019) వంటి జీవితచరిత్ర సినిమాలకు కూడా దర్శకత్వం వహించాడు.

ది ఈగర్ సాంక్షన్ (1975) సినిమా షూటింగ్‌లో

అవార్డులు, సన్మానాలు[మార్చు]

ఈస్ట్‌వుడ్ నాలుగు అకాడమీ అవార్డులు, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు, మూడు సీజర్ అవార్డులు, ఏఎఫ్ఐ లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు గెలుచుకున్నాడు. 2000లో, ఇటాలియన్ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ గోల్డెన్ లయన్ అవార్డును కూడా అందుకున్నాడు. 1994లో కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్, 2007లో లెజియన్ ఆఫ్ హానర్‌ వంటి ఫ్రాన్స్ అత్యున్నత పౌర గౌరవాలను అందుకున్నాడు.

ఈస్ట్‌వుడ్ సినిమాలకు వచ్చిన అవార్డులు
సంవత్సరం పేరు అకాడమీ అవార్డులు బ్రిటీష్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు
నామినేషన్ విజేత నామినేషన్ విజేత నామినేషన్ విజేత
1971 ప్లే మిస్టీని ఫర్ మీ 1
1973 బ్రీజి 3
1976 ది అవుట్‌లా జోసీ వేల్స్ 1
1986 హార్ట్బ్రేక్ రిడ్జ్ 1
1988 బర్డ్ 1 1 2 3 1
1992 ఫర్ గివెన్ 9 4 6 1 4 2
1995 ది బ్రిడ్జెస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ 1 2
2000 స్పేస్ కౌబాయ్స్ 1
2003 మిస్టిక్ నది 6 2 4 5 2
2004 మిలియన్ డాలర్ బేబీ 7 4 5 2
2006 ఫ్లాగ్స్ ఆఫ్ అవర్ ఫాదర్స్ 2 1
లెటర్స్ ఫ్రమ్ ఇవో జిమా 4 1 1 1
2008 చేంజింగ్ 3 8 2
గ్రాన్ టొరినో 1
2009 ఇన్విక్టస్ 2 3
2010 హియర్ ఆఫ్టర్ 1
2011 జె. ఎడ్గార్ 1
2014 అమెరికన్ స్నిపర్ 6 1 2
2016 సుల్లీ 1
2019 రిచర్డ్ జ్యువెల్ 1 1
మొత్తం 41 13 22 1 33 8

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Brockes, Emma (February 14, 2009). "Emma Brockes meets Clint Eastwood, one of the last American heroes, to talk about films, politics and ageing". The Guardian. Retrieved 2023-05-27.
  2. Kitses, p. 307.
  3. "Clint Eastwood movie box office results". Box Office Mojo. Retrieved 2023-05-27.

బయటి లింకులు[మార్చు]