Jump to content

క్లోపిడోగ్రెల్

వికీపీడియా నుండి
క్లోపిడోగ్రెల్
Skeletal formula
Ball-and-stick model clopidogrel
వ్యవస్థాత్మక (IUPAC) పేరు
(+)-(S)-methyl 2-(2-chlorophenyl)-2-(6,7-dihydrothieno[3,2-c]pyridin-5(4H)-yl)acetate
Clinical data
వాణిజ్య పేర్లు ప్లావిక్స్
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a601040
లైసెన్స్ సమాచారము EMA:[[[:మూస:EMA-EPAR]] Link], US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B1 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) POM (UK) ℞-only (US)
Routes మాత్రల రూపంలో నోటి ద్వారా
Pharmacokinetic data
Bioavailability >50%
Protein binding 94–98%
మెటాబాలిజం Liver
అర్థ జీవిత కాలం 7–8 గంటలు
Excretion 50% మూత్రపిండాలు >46% పిత్తాశయం
Identifiers
ATC code ?
Chemical data
Formula C16H16ClNO2S 
  • InChI=1S/C16H16ClNO2S/c1-20-16(19)15(12-4-2-3-5-13(12)17)18-8-6-14-11(10-18)7-9-21-14/h2-5,7,9,15H,6,8,10H2,1H3/t15-/m0/s1 checkY
    Key:GKTWGGQPFAXNFI-HNNXBMFYSA-N checkY

 checkY (what is this?)  (verify)

క్లోపిడోగ్రెల్ (ఆంగ్లం: Clopidogrel) రక్తం గడ్డకట్టే ప్రక్రియను నిరోధించే ఒక ఔషధం. ఇది ప్లావిక్స్ అనే వాణిజ్య పేరుతో కూడా విక్రయించుతారు. గుండె జబ్బులు, పోటు (స్ట్రోక్) వంటి అధిక ప్రమాదం ఉన్నవారిలో ఆ ప్రమాదం తగ్గించడానికి ఉపయోగించే ఔషధం. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నిరోధించే (యాంటీప్లెట్లెట్) ఔషధం[1][2] గుండెపోటు, కొరోనరీ ఆర్టరీ స్టెంట్ (ద్వంద్వ యాంటీప్లెట్లెట్ థెరపీ) వేసిన తరువాత కూడా దీనిని ఆస్పిరిన్ తో కలిపి ఉపయోగిస్తారు. దీనిని మాత్రల రూపంలో నోటి ద్వారా తీసుకుంటారు. ఈ ఔషధ ప్రభావం సుమారు రెండు గంటలు నుండి ఐదు రోజుల పాటు ఉంటుంది.[2]

ఈ క్లోపిడోగ్రెల్ థియోనోపైరిడిన్-యాంటీప్లెట్లెట్ల వర్గానికి చెందినది. ఇది ప్లేట్లెట్లపై P2Y<sub id="mwWw">12</sub> అనే స్థిరమైన (irreversible) గ్రాహకాన్ని నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[2]

ఉపయోగాలు

[మార్చు]

పక్షవాతం, గుండెపోటు, తీవ్రమైన ఛాతీ నొప్పి లేదా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ (కాళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల రక్త ప్రసరణ సరిగా లేకపోవడం) వంటి వ్యాధులున్న వ్యక్తులలో, మళ్ళీ గుండెపోటు లేదా పక్షవాతం రాకుండా నివారించడానికి క్లోపిడోగ్రెల్ ఉపయోస్తారు. ఇది ప్లేట్‌లెట్లు (ఒక రకమైన రక్త కణాలు) రక్తనాళాలలో ఒకచోట చేరి గుండెపోటు లేదా పక్షవాతానికి కారణమయ్యే విధంగా గడ్డలుగా ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీనిని వైద్యుల సలహా ప్రకారం నిర్దేశించిన మోతాదులో తీసుకోవాలి. స్వంత నిర్ణయం పై తీసుకోవడం ఆపివేసినా వ్యాధి లక్షణాలు పునరావృతమవవచ్చు.[3]

దుష్ప్రభావాలు

[మార్చు]

సాధారణంగా దుష్ప్రభావాలలో తలనొప్పి, వికారం, సులభంగా గాయపడటం, దురద, గుండెల్లో మంట ఉంటాయి. రక్తస్రావం, థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనిక్ పర్పురా వంటి ఇంకా తీవ్రమైన దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.[2]

  • శ్వాస తీసుకోవడం లేదా మింగడం కష్టం
  • ముఖం, గొంతు, నాలుక, పెదవులు, కళ్ళు, చేతులు, పాదాలు, చీలమండలు లేదా దిగువ కాళ్ళ వాపు
  • బొంగురుపోవడం
  • నలుపు, నల్ల రంగులో మలం, మలంలో ఎర్రటి రక్తం
  • రక్తపు వాంతి, కాఫీ రంగులో కనిపించే వాంతి
  • అధిక వినియోగం వలన ఏర్పడే అసాధారణ రక్తస్రావం లేదా గాయాలు
  • గులాబీ లేదా గోధుమ రంగు మూత్రం
  • నెమ్మదిగా లేదా కష్టమైన మాట్లాడడం, బలహీనత, చేయి లేదా కాలు తిమ్మిరి, దృష్టిలో మార్పులు, గందరగోళం
  • జ్వరం; శ్వాస ఆడకపోవుట; వేగవంతమైన హృదయ స్పందన; చర్మం కింద ఊదా పాచెస్ లేదా రక్తస్రావం; లేత చర్మం; చర్మం లేదా కళ్ళు పసుపు రంగులోకి మారడం
  • మూర్ఛలు[3]

గర్భధారణ సమయంలో దీని వినియోగం వల్ల హాని జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, అటువంటి వినియోగం గురించి ఎక్కువగా జరిగిన అధ్యయనాలు లేవు.[4]

ఇతర మందులతో పరస్పర చర్యలు

[మార్చు]

క్లోపిడోగ్రెల్ కు ఇతర మందులతో సంకర్షణ (interaction) చెందే సామర్థ్యం సాధారణంగా తక్కువ. ఆస్పిరిన్, హెపారిన్‌లు థ్రోంబోలైటిక్స్ వంటి రక్తం గడ్డకట్టడాన్ని ప్రభావితం చేసే ఇతర మందులతో కలిపి వాడినప్పుడు, ఎటువంటి సంబంధిత సంకర్షణలు కనిపించలేదు. ఇతర నాన్‌స్టెరాయిడల్ యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ మందుల వాడకం విషయంలో 'నాప్రోక్సెన్' జీర్ణకోశ రక్తస్రావం సంభావ్యత కనిపించింది.[5]

నవంబర్ 2009లో, యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ప్రోటాన్-పంప్ ఇన్హిబిటర్లైన ఒమెప్రజోల్ లేదా ఎసోమెప్రజోల్ వాడే వ్యక్తులలో క్లోపిడోగ్రెల్‌ను జాగ్రత్తగా ఉపయోగించాలని ప్రకటించింది[6][7][8] అయితే పాంటోప్రజోల్ తో సురక్షితం అని భావిస్తున్నారు.[9]వేరే యాంటీప్లేట్‌లెట్ ఏజెంట్ ప్రసుగ్రెల్‌కు ఒమెప్రజోల్‌తో అతి తక్కువ పరస్పర చర్య ఉంటుంది, కాబట్టి ప్రోటాన్-పంప్ ఇన్హిబిటర్లను తీసుకుంటున్న వ్యక్తులలో (ఇతర వ్యతిరేకతలు లేనట్లయితే) ఇది మంచి ప్రత్యామ్నాయం కావచ్చు.[10]

తీసుకోవలసిన జాగ్రత్తలు

[మార్చు]

క్లోపిడోగ్రెల్ తీసుకోవడం ప్రారంభించడానికి ముందు ఈ క్రింది పరిస్థితులలో వైద్యునకు తెలియచేయవలసి ఉంటుంది

  • ఎసోమెప్రజోల్; ఆస్పిరిన్ లేదా ఇబుప్రోఫెన్ లేదా న్యాప్రోక్సెన్ వంటి ఇతర నాన్‌స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు) తీసుకుంటున్నారని .
  • ఇంతకుముందే రక్తస్రావం, అల్సర్లు (కడుపు లేదా చిన్న ప్రేగు లైనింగ్‌లో పుండ్లు), మెదడులో రక్తస్రావం లేదా తీవ్రమైన రక్తస్రావం కలిగించే ఏదైనా ఇతర పరిస్థితి ఉంటే
  • ఇటీవల గాయపడినట్లయితే లేదా కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లయితే
  • కడుపు సమస్యలు లేదా అల్సర్ వంటి రక్తస్రావం కలిగించే ఏదైనా పరిస్థితి ఉంటే
  • దంత శస్త్రచికిత్సతో సహా ఏదేని శస్త్రచికిత్స ఉంటే, (శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం నివారించడానికి కనీసం 5 రోజుల ముందు క్లోపిడోగ్రెల్ తీసుకోవడం ఆపమని డాక్టర్ చెప్పవచ్చు).
  • క్లోపిడోగ్రెల్ తీసుకునేటప్పుడు సాధారణం కంటే ఎక్కువ రక్తస్రావం అవుతుంది కాబట్టి కోతలు లేదా గాయాలు లేకుండా జాగ్రత్త వహించాలి. [3]

క్లోపిడోగ్రెల్ ను 1982 లో పేటెంట్ చేశారు. 1997 లో వైద్య ఉపయోగం కోసం ఆమోదించారు.[11][12] ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన అత్యవసర ఔషధాల జాబితాలో ఉంది.[13] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో టోకు ధర నెలకు సుమారు US $0.77-31.59.[14] యునైటెడ్ స్టేట్స్ లో, ఒక నెల చికిత్స ఖర్చు US $25 కంటే తక్కువ.[15] 2017 లో దీనిని 19 మిలియన్లకు పైగా వైద్యుల సూచనలు చేసారు. యునైటెడ్ స్టేట్స్ లో అత్యంత సాధారణంగా సూచించే ఔషధాలలో ఇది 40వది.[16][17]

సూచనలు

[మార్చు]
  1. ↑ "Clopidogrel International brand names". Drugs.com. Archived from the original on 1 April 2017. Retrieved 1 April 2017.
  2. 1 2 3 4 "Clopidogrel Bisulfate". The American Society of Health-System Pharmacists. Archived from the original on 21 December 2016. Retrieved 8 December 2016.
  3. 1 2 3 "Clopidogrel". MedlinePlus Connect for EHRs. 2026-08-15. Retrieved 2026-09-11.
  4. ↑ "Clopidogrel (Plavix) Use During Pregnancy". Drugs.com. Archived from the original on 21 December 2016. Retrieved 14 December 2016.
  5. ↑ Jasek, W, ed. (2007). Austria-Codex (in జర్మన్) (62nd ed.). Vienna: Österreichischer Apothekerverlag. pp. 6526–7. ISBN 978-3-85200-181-4.
  6. ↑ DeNoon DJ (23 February 2016). "FDA Warns Plavix Patients of Drug Interactions". WebMD. Archived from the original on 23 February 2016. Retrieved 23 November 2009.
  7. ↑ "Public Health Advisory: Updated Safety Information about a drug interaction between Clopidogrel Bisulfate (marketed as Plavix) and Omeprazole (marketed as Prilosec and Prilosec OTC)". Food and Drug Administration (FDA). 17 November 2009. Archived from the original on 29 December 2009. Retrieved 13 March 2010.
  8. ↑ Farhat N, Haddad N, Crispo J, Birkett N, McNair D, Momoli F, Wen SW, Mattison DR, Krewski D (February 2019). "Trends in concomitant clopidogrel and proton pump inhibitor treatment among ACS inpatients, 2000-2016". Eur. J. Clin. Pharmacol. 75 (2): 227–235. doi:10.1007/s00228-018-2564-8. PMID 30324301. S2CID 53085923.
  9. ↑ Wedemeyer RS, Blume H (2014). "Pharmacokinetic Drug Interaction Profiles of Proton Pump Inhibitors: An Update". Drug Safety. 37 (4): 201–11. doi:10.1007/s40264-014-0144-0. PMC 3975086. PMID 24550106.
  10. ↑ John J, Koshy SK (2012). "Current Oral Antiplatelets: Focus Update on Prasugrel". The Journal of the American Board of Family Medicine. 25 (3): 343–349. doi:10.3122/jabfm.2012.03.100270. PMID 22570398.
  11. ↑ "Plavix- clopidogrel bisulfate tablet, film coated". DailyMed. Bristol-Myers Squibb/Sanofi Pharmaceuticals Partnership. 17 May 2019. Archived from the original on 4 August 2020. Retrieved 26 December 2019.
  12. ↑ Fischer, Janos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery. John Wiley & Sons. p. 453. ISBN 9783527607495. Archived from the original on 2016-12-20.
  13. ↑ World Health Organization (2019). World Health Organization model list of essential medicines: 21st list 2019. Geneva: World Health Organization. hdl:10665/325771. WHO/MVP/EMP/IAU/2019.06. License: CC BY-NC-SA 3.0 IGO.
  14. ↑ "Clopidogrel Bisulfate". International Drug Price Indicator Guide. Archived from the original on 13 October 2018. Retrieved 8 December 2016.
  15. ↑ Hamilton, Richart (2015). Tarascon Pocket Pharmacopoeia 2015 Deluxe Lab-Coat Edition. Jones & Bartlett Learning. p. 147. ISBN 9781284057560.
  16. ↑ "The Top 300 of 2020". ClinCalc. Archived from the original on 12 February 2021. Retrieved 11 April 2020.
  17. ↑ "Clopidogrel Bisulfate - Drug Usage Statistics". ClinCalc. 23 December 2019. Archived from the original on 12 April 2020. Retrieved 11 April 2020.