Jump to content

క్వీన్ ఓజా

వికీపీడియా నుండి
క్వీన్ ఓజా

పదవీ కాలం
2019 – 2024
ముందు బిజోయ చక్రవర్తి
తరువాత బిజులీ కలిత మేధి
నియోజకవర్గం గౌహతి

గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
పదవీ కాలం
1996-1997
ముందు హేమప్రభ సైకియా
తరువాత సోనాధర్ దాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-11-27) 1950 November 27 (age 74)
గౌహతి, అస్సాం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు అసోం గణ పరిషత్
వృత్తి రాజకీయ నాయకురాలు

క్వీన్ ఓజా (జననం 27 నవంబర్ 1950) భారతదేశానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గౌహతి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

క్వీన్ ఓజా అసోం గణ పరిషత్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996 నుండి 1997 వరకు గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా, 2017 నుండి 2019 వరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ అస్సాం వైస్-చైర్‌పర్సన్‌గా పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరింది.[3] ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గౌహతి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బొబ్బిట శర్మపై 3,45,606 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. క్వీన్ ఓజాకు 1,008,936 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి బొబ్బిట శర్మకి 6,63,330 ఓట్లు వచ్చాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Queen Oja" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  2. "3 women elected as MPs from North East for 17th Lok Sabha" (in ఇంగ్లీష్). India TV News. 25 May 2019. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  3. "Battle of the 'queens' for Gauhati seat" (in Indian English). The Hindu. 21 April 2019. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.
  4. "Blazing a trail: A look at first-time women MPs" (in ఇంగ్లీష్). Hindustan Times. 30 May 2019. Archived from the original on 16 August 2025. Retrieved 16 August 2025.