క్వెట్టా జిల్లా
క్వెట్టా జిల్లా
ضلع کوئٹہ | |
|---|---|
జిల్లా | |
బలూచిస్తాన్ పటంలో క్వెట్టా జిల్లా గుర్తింపుతో | |
| నిర్దేశాంకాలు: 30°10′N 67°00′E / 30.167°N 67.000°E | |
| దేశం | |
| ప్రావిన్స్ | మూస:Country data బలూచిస్తాన్ |
| విభాగం | క్వెట్టా |
| స్థాపన | ఏప్రిల్ 1983 |
| పరిపాలనా కేంద్రం | క్వెట్టా మెట్రోపాలిటన్ కార్పొరేషన్ |
| పరిపాలనా పట్టణాలు | 5
|
| ప్రభుత్వం | |
| • క్వెట్టా కమిషనర్ | హంజా షఫ్కాత్ |
| • డిప్యూటీ కమిషనర్ | లెఫ్టినెంట్ (విరమణ) సాద్ బిన్ అసద్ |
| • నియోజకవర్గం | NA-263 క్వెట్టా-II |
| విస్తీర్ణం | |
• జిల్లా | 3,447 కి.మీ2 (1,331 చ. మై) |
| ఎత్తు | 1,680 మీ (5,510 అ.) |
| జనాభా | |
• జిల్లా | 25,95,492 |
| • జనసాంద్రత | 750/కి.మీ2 (2,000/చ. మై.) |
| • Urban | 15,65,546 (60.32%) |
| • Rural | 10,29,946 (39.68%) |
| అక్షరాస్యత | |
| • అక్షరాస్యత శాతం |
|
| టైమ్ జోన్ | UTC+05:00 (PKT) |
| • Summer (DST) | DST అమలులో లేదు |
| జిప్ కోడ్ | |
| ప్రాంతీయ కోడ్ | 081 |
| ISO 3166 code | PK-BA |
| CNIC కోడ్ | 54400 |
క్వెట్టా (Urdu: کوئٹہ) పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ వాయవ్య భాగంలో ఉన్న ఒక జిల్లా. 2023 పాకిస్తాన్ జనగణన ప్రకారం క్వెట్టా జిల్లా జనాభా 2,272,290 (2.2 మిలియన్లు).
ఇది క్వెట్టా విభాగంలో భాగంగా ఉంది. ఈ జిల్లా వ్యవసాయ ఉత్పత్తులకు, ముఖ్యంగా ఆపిల్‌లు, ద్రాక్ష వంటి పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందింది. హన్నా లోయలో బాదంపప్పు సాగు చేస్తారు. 1998 జనగణనలో జనాభా 7,60,000 కాగా, 2010లో అది సుమారు 12,35,000గా అంచనా వేయబడింది,[4] 2017లో 2,275,699గా నమోదైంది.[1][5]
చరిత్ర
[మార్చు]క్వెట్టా యొక్క ప్రాచీన పేరు షాల్కోట్. ఈ పేరుతోనే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు దీనిని పిలుస్తారు. ఈ జిల్లాను వివిధ కాలాల్లో గజ్నవీలు, ఘురీలు, మంగోలు పరిపాలించారు. పదిహేనవ శతాబ్దం చివర్లో హెరాత్ పాలకుడు దీనిని షా బేగ్ అర్ఘున్ కు అప్పగించాడు. అయితే త్వరలోనే పెరుగుతున్న మొఘల్ శక్తికి అతను తలొగ్గాల్సి వచ్చింది. అయిన్-ఇ-అక్బరీలో షాల్, పిషిన్ ప్రాంతాలు అక్బర్‌కు సైనిక సేవలు, ఆదాయం అందించినట్లు పేర్కొనబడింది. అయితే ఈ ప్రాంతాలు కందహార్ తో పాటు సఫవీ వంశం ఆధీనంలోకి వెళ్లాయి. పదెనిమిదవ శతాబ్దం ఆరంభంలో కందహార్‌లో ఖిల్జీ శక్తి పెరుగుదలతో పాటు కలాత్‌లో బలూచ్ ప్రభావం పెరగడంతో, క్వెట్టా, పిషిన్ ప్రాంతాలు చివరకు డ్యూరాండ్ ఒప్పందం ద్వారా బ్రిటిష్ ఆధీనంలోకి వచ్చాయి.[6]
బ్రిటిష్ పాలన
[మార్చు]19వ శతాబ్దంలో రెండో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం సమయంలో 1879లో బ్రిటిష్ దళాలు క్వెట్టా (షాల్కోట్)ను ఆక్రమించాయి.[6]
1839లో బ్రిటిష్ ఇండస్ సైన్యం ముందుకు సాగినప్పుడు కెప్టెన్ బీన్‌ను షాల్కోట్ తొలి రాజకీయ ప్రతినిధిగా నియమించారు. అతను షా షుజా-ఉల్-ముల్క్ తరఫున ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. 1876లో సర్ రాబర్ట్ గ్రోవ్స్ సాండెమన్ కలాత్‌కు చేసిన మిషన్ తరువాత, క్వెట్టా కోటను అతని రక్షక దళం ఆక్రమించింది. 1883 వరకు ఈ ప్రాంతాన్ని కలాత్ ఖానేట్ ఖాన్ తరఫున నిర్వహించారు. ఆ తర్వాత ఖాన్, బ్రిటిష్ సామ్రాజ్యాల మధ్య ఒప్పందం ద్వారా సంవత్సరానికి రూ. 25,000 అద్దెపై బ్రిటిష్ ప్రభుత్వానికి లీజుకు ఇచ్చారు. 1883లో దీనిని పిషిన్, షోరారుద్ ప్రాంతాలతో కలిపి ఒకే పరిపాలనా యూనిట్‌గా రూపొందించారు. 1888 వరకు పాత చమన్ సరిహద్దులో అత్యంత ముందున్న కేంద్రంగా ఉండేది. అయితే రైలుమార్గం ఖ్వాజా అమ్రాన్ దాటి విస్తరించడంతో, దాని తుది కేంద్రం ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో స్థాపించబడింది. అది పాత చమన్‌కు 7 మైళ్ళు దూరంలో ఉంది. ఆఫ్ఘానిస్తాన్ తో సరిహద్దు 1895–1896లో అధికారికంగా నిర్ణయించబడింది.[6]
షాల్కోట్ నగర ప్రాంతంలో ప్రధానంగా కాసి తెగ నివసించేది. పరిసర ప్రాంతాలను బజాయ్ తెగతో పాటు సులైమంకైల్, ఖరోటి, నసర్, బైతనై వంటి సంచార తెగలు ఆక్రమించాయి. కందహార్ అంచున ఉన్నందున ఈ ప్రాంతం పెద్దగా అభివృద్ధి చెందలేదు. బ్రిటిష్ దళాల రాకతో అభివృద్ధి మార్గాలు తెరుచుకున్నాయి. కొద్ది కాలంలోనే ప్రజలు రహదారులు, రైళ్లు, పాఠశాలలను ఈ ప్రాంతంలో చూశారు.[6]
పరిపాలనా విభాగాలు
[మార్చు]1975లో క్వెట్టా, పిషిన్లను వేర్వేరు జిల్లాలుగా విభజించారు. నేటి క్వెట్టా జిల్లా రెండు పట్టణాలు[7], ఒక ఉప-తహసీల్తో కూడి ఉంది. 2001లో క్వెట్టా జిల్లాను సిటీ జిల్లాగా ప్రకటించారు. ఇందులో రెండు తహసీల్లు, ఒక ఉప-తహసీల్, మొత్తం 67 యూనియన్ కౌన్సిళ్లు ఉన్నాయి.
| తహసీల్ | విస్తీర్ణం (చ.కి.మీ.)[8] |
జనాభా (2023) |
సాంద్రత (వ్యక్తులు/చ.కి.మీ.) (2023) |
అక్షరాస్యత రేటు (2023)[9] |
యూనియన్ కౌన్సిళ్లు |
|---|---|---|---|---|---|
| చిల్తాన్[7] | 558 | 1,360,600 | 2,438.35 | 63.97% | ... |
| జర్ఘూన్[7] | ... | ... | ... | ... | ... |
| పంజ్‌పాయ్ | 1,205 | 21,371 | 17.74 | 37.67% | ... |
| క్వెట్టా సదర్ | 1,283 | 330,421 | 257.54 | 56.66% | ... |
| కుచ్‌లాక్ | 180 | 310,246 | 1,723.59 | 50.59% | ... |
| సరియాబ్ | 221 | 572,854 | 2,592.10 | 42.99% | ... |
జనసాంఖ్యికాలు
[మార్చు]| చారిత్రికంగా జనాభా | ||
|---|---|---|
| సంవత్సరం | జనాభా | ±% p.a. |
| 1951 | N/A | — |
| 1961 | N/A | — |
| 1972 | N/A | — |
| 1981 | N/A | — |
| 1998 | 7,74,547 | — |
| 2017 | 22,69,473 | +5.82% |
| 2023 | 25,95,492 | +2.26% |
| మూలాలు:[10] | ||
జనాభా
[మార్చు]2023 పాకిస్తాన్ జనగణన ప్రకారం, క్వెట్టా జిల్లాలో 288,459 గృహాలు, 2,595,492 జనాభా ఉన్నాయి. జిల్లాలో ప్రతి 100 మహిళలకు 103.48 మంది పురుషులు ఉన్నారు. అక్షరాస్యత రేటు 56.29% — ఇందులో పురుషుల అక్షరాస్యత 65.06%, మహిళల అక్షరాస్యత 46.96%గా ఉంది.[11][12] సర్వే చేయబడిన జనాభాలో 720,934 మంది (31.74%) 10 సంవత్సరాల లోపు వయస్సు కలవారు.[13] 1,565,546 మంది (60.32%) పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[11]
1998లో జిల్లాలోని 74% జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసించింది.[14]
భాష
[మార్చు]2023 జనగణన సమయంలో, జిల్లాలోని 59.95% మంది ప్రజలు పష్తో, 15.51% బ్రాహుయి, 7.38% బలోచీ, 2.95% పంజాబీ, 2.56% ఉర్దూ, 1.34% సింధీ, 1.09% సరైకి,, 0.82% హింద్కో భాషలను తమ మాతృభాషలుగా మాట్లాడారు. జనగణనలో సుమారు 200,000 మంది "ఇతర" భాషలు మాట్లాడేవారిగా నమోదయ్యారు. వీరిలో ప్రధానంగా హజారాగీ మాట్లాడేవారు ఉన్నారు.[15]
మతం
[మార్చు]1998 జనగణన ప్రకారం ప్రధాన మతం ఇస్లాం (96%) కాగా, క్రైస్తవ (2.7%), హిందూ (0.5%) సముదాయాలు కూడా ఉన్నాయి.[16]
2023 జనగణనలో జనాభాలో 99.95% మంది ఇస్లాం మతస్థులు కాగా, 0.05% మంది క్రైస్తవులు ఉన్నారు.[2]
| మత సమూహం |
1901[17] | 1911[18] | 1921[19] | 1931[20] | 1941[21] | |||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జనాభా | % | జనాభా | % | జనాభా | % | జనాభా | % | జనాభా | % | |
| ఇస్లాం |
96,600 | 84.67% | 106,702 | 83.59% | 103,456 | 75.47% | 107,945 | 73.16% | 113,288 | 72.49% |
| హిందూమతం |
11,752 | 10.3% | 13,746 | 10.77% | 22,300 | 16.27% | 26,718 | 18.11% | 28,629 | 18.32% |
| క్రైస్తవం |
3,743 | 3.28% | 4,564 | 3.58% | 6,139 | 4.48% | 7,370 | 5% | 5,441 | 3.48% |
| సిక్కు మతం |
1,798 | 1.58% | 2,430 | 1.9% | 4,848 | 3.54% | 5,255 | 3.56% | 8,787 | 5.62% |
| జరోస్త్రియనిజం |
151 | 0.13% | 137 | 0.11% | 151 | 0.11% | 161 | 0.11% | 73 | 0.05% |
| యూద మతం |
43 | 0.04% | 47 | 0.04% | 16 | 0.01% | 15 | 0.01% | 11 | 0.01% |
| జైనమతం |
0 | 0% | 9 | 0.01% | 8 | 0.01% | 32 | 0.02% | 7 | 0% |
| బౌద్ధం |
N/a | N/a | 12 | 0.01% | 159 | 0.12% | 40 | 0.03% | 42 | 0.03% |
| గిరిజన మతాలు | N/a | N/a | N/a | N/a | N/a | N/a | 0 | 0% | 0 | 0% |
| ఇతరులు | 0 | 0% | 1 | 0% | 5 | 0% | 5 | 0% | 11 | 0.01% |
| మొత్తం జనాభా | 114,087 | 100% | 127,648 | 100% | 137,082 | 100% | 147,541 | 100% | 156,289 | 100% |
| గమనిక: బ్రిటిష్ బలూచిస్తాన్ కాలం నాటి జిల్లా సరిహద్దులు ప్రస్తుత సరిహద్దులతో పూర్తిగా సరిపోలవు. స్వాతంత్ర్యం అనంతరం జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని అనేకసార్లు జిల్లా విభజనలు చేయబడటంతో కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. | ||||||||||
మూలాలు
[మార్చు]- 1 2 "District And Tehsil Level Population Summary - Quetta District" (PDF). Pakistan Bureau of Statistics, Government of Pakistan website. Archived from the original (PDF) on 27 August 2018. Retrieved 8 February 2024.
- 1 2 3 "Pakistan census 2023" (PDF). Pakistan Bureau of Statistics, Government of Pakistan website.
- ↑ "Literacy rate, enrolments, and out-of-school population by sex and rural/urban, CENSUS-2023, BALOCHISTAN" (PDF).
- ↑ PDD 2011, p. viii.
- ↑ "Screenshot of Itunes Library - Archived Platform Itunes 2010". doi:10.3998/mpub.11435021.cmp.6. Retrieved 2024-01-26.
{{cite journal}}: Cite journal requires|journal=(help) - 1 2 3 4 "Quetta-Pishin - Imperial Gazetteer of India, v. 21, p. 13-14". Archived from the original on 5 June 2024. Retrieved 20 February 2021.
- 1 2 3 "Towns & Unions in the City District of Quetta". National Reconstruction Bureau, Government of Pakistan website. Archived from the original on 9 February 2012. Retrieved 8 February 2024.
- ↑ "TABLE 1 : AREA, POPULATION BY SEX, SEX RATIO, POPULATION DENSITY, URBAN POPULATION, HOUSEHOLD SIZE AND ANNUAL GROWTH RATE, CENSUS-2023, BALOCHISTAN" (PDF).
- ↑ "LITERACY RATE, ENROLMENT AND OUT OF SCHOOL POPULATION BY SEX AND RURAL/URBAN, CENSUS-2023, BALOCHISTAN" (PDF).
- ↑ "Population by administrative units 1951-1998" (PDF). Pakistan Bureau of Statistics.
- 1 2 "7th Population and Housing Census - Detailed Results: Table 1" (PDF). Pakistan Bureau of Statistics.
- ↑ "7th Population and Housing Census - Detailed Results: Table 12" (PDF). Pakistan Bureau of Statistics.
- ↑ "7th Population and Housing Census: Population by Mother Tongue, Sex and Rural/Urban" (PDF). Pakistan Bureau of Statistics.
- ↑ 1998 Census, pp. 17, 21.
- ↑ "Pakistan Census 2023" (PDF).
- ↑ 1998 Census, p. 20.
- ↑ "Census of India 1901. Vol. 5A, Baluchistan. Pt. 2, Imperial tables". 1901. p. 5. JSTOR saoa.crl.25352844. Retrieved 8 September 2024.
- ↑ "Census of India 1911. Vol. 4, Baluchistan : pt. 1, Report; pt. 2, Tables". 1911. p. 11. JSTOR saoa.crl.25393764. Retrieved 8 September 2024.
- ↑ "Census of India 1921. Vol. 4, Baluchistan : part I, Report; part II, Tables". 1921. p. 165. JSTOR saoa.crl.25394124. Retrieved 8 September 2024.
- ↑ "Census of India 1931. Vol. 4, Baluchistan. Pts. 1 & 2, Report [and] Imperial and provincial tables". 1931. p. 390. JSTOR saoa.crl.25797115. Retrieved 8 September 2024.
- ↑ India Census Commissioner (1941). "Census of India, 1941. Vol. 14, Baluchistan". p. 17. JSTOR saoa.crl.28215993. Retrieved 8 September 2024.
గ్రంథసూచి
[మార్చు]- 1981 District census report of Quetta. Vol. 2. Islamabad: Population Census Organization, Statistics Division, Government of Pakistan. 1983.
- 1998 District census report of Quetta. Census publication. Vol. 158. Islamabad: Population Census Organization, Statistics Division, Government of Pakistan. 2001.
- Planning & Development Department, Government of Balochistan (2011). Quetta District Development Profile (PDF) (Report).
బాహ్య లింకులు
[మార్చు]- క్వెట్టా జిల్లా at
- క్వెట్టా జిల్లా Archived 23 సెప్టెంబరు 2015 at the Wayback Machine at