క‌మ్లా భాసిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క‌మ్లా భాసిన్
పుట్టిన తేదీ, స్థలం(1946-04-24)1946 ఏప్రిల్ 24
షహీదానువాలి, మందీ బహావుద్దీన్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్ (బ్రిటిష్ ఇండియా)
(ఇప్పుడు పాకిస్తాన్)[1]
మరణం2021 సెప్టెంబరు 25(2021-09-25) (వయసు 75)
ఢిల్లీ, భారతదేశం
వృత్తిఉద్యమకారిణి, కవయిత్రి, రచయిత్రి
భాషహిందీ , ఇంగ్లీష్
విద్యమాస్టర్స్ ఇన్ ఆర్ట్స్
పూర్వవిద్యార్థిరాజస్థాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ మున్స్టర్
గుర్తింపునిచ్చిన రచనలుబోర్డర్స్ & బౌండరీస్: విమెన్ ఇన్ ఇండియాస్ పార్టిషన్ (పుస్తకం)

క‌మ్లా భాసిన్ భారతదేశానికి చెందిన కవయిత్రి, రచయిత్రి, మహిళా హక్కుల ఉద్యమకారిణి. ఆమె ‘సేవా మందిర్‌’ ఎన్జీవో సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు చేసింది. భారత్‌, దక్షిణాసియా దేశాల్లో మూడు దశాబ్దాలుగా లింగ వివక్ష, అభివృద్ధి, శాంతి, మానవ హక్కులు వంటి సమస్యలపై పోరాడింది. దక్షిణాసియాలో ' వన్‌ బిలియన్‌ రైజింగ్‌' ప్రచారంతో పాటు పలు ముఖ్యమైన ఉద్యమాల్లో పాల్గొన్నది.[2]

జననం, విద్యాభాస్యం[మార్చు]

క‌మ్లా భాసిన్ 24 ఏప్రిల్ 1946లో ఇప్పటి పాకిస్తాన్ లోని మందీ బహావుద్దీన్ జిల్లా షహీదానువాలి లో జన్మించింది. ఆమె రాజస్థాన్ లోని భాసిన్ విశ్వవిద్యాలయం నుండి ఎంఏ పూర్తి చేసి ఫెలోషిప్‌తో పశ్చిమ జర్మనీలోని మున్స్టర్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ ఆఫ్ డెవలప్‌మెంట్ పూర్తి చేసింది. ఆమె అనంతరం బాడ్ హోన్నేఫ్‌లోని అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం జర్మన్ ఫౌండేషన్ యొక్క ఓరియంటేషన్ సెంటర్‌లో పని చేసింది.

రచనలు[మార్చు]

కమ్లా బాసిన్ 1970లో ఉద్యమాల్లో పని చేస్తున్న నాటి నుండి స్త్రీవాదం, మహిళల సమస్యలపై పలు పుస్తకాలు రాసింది.

  1. లాఫింగ్ మ్యాటర్స్ (2005)
  2. బోర్డర్స్ & బౌండరీస్: విమెన్ ఇన్ ఇండియాస్ పార్టిషన్ [3]
  3. అండర్ స్టాండింగ్ జెండర్ [4]
  4. వాట్ ఇస్ పాట్రియార్చ్య్?

మరణం[మార్చు]

క‌మ్లా భాసిన్ క్యాన్స‌ర్‌తో బాధపడుతూ ఢిల్లీలోని సిటీ హాస్పిట‌ల్లో 25 సెప్టెంబర్ 2021న మరణించింది.[5][6][7]


మూలాలు[మార్చు]

  1. "Let's change the world: Kamla Bhasin". The Dawn. 29 July 2005. Retrieved 25 September 2021.
  2. Andrajyothy (30 September 2021). "మన కాలం మహిళా చైతన్యఝరి". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
  3. Menon, Ritu; Bhasin, Kamla (1998-01-01). Borders & Boundaries: Women in India's Partition (in ఇంగ్లీష్). Rutgers University Press. ISBN 9780813525525.
  4. "Understanding Gender (Kali Monographs)". Goodreads. Retrieved 2017-02-25.
  5. Namasthe Telangana (25 September 2021). "Kamla Bhasin: మ‌హిళా హ‌క్కుల ఉద్య‌మ‌కారిణి క‌మ్లా భాసిన్ క‌న్నుమూత‌". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.
  6. 10TV (25 September 2021). "Kamla Bhasin: క్యాన్సర్ తో మ‌హిళా హ‌క్కుల ఉద్య‌మ‌కారిణి క‌మ్లా భాసిన్ క‌న్నుమూత‌" (in telugu). Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  7. Andrajyothy (2 September 2021). "ఉద్యమకారిణి కమలా భాసిన్‌ కన్నుమూత". Archived from the original on 27 September 2021. Retrieved 27 September 2021.