Jump to content

ఖండం

వికీపీడియా నుండి
రంగుల-కోడ్ లతో యానిమేషన్ చేయబడిన చిత్రం, వివిధ ఖండాలు చూపబడినవి. ఖండములు విడదీయబడు నమూనా, కొన్ని ఖండాలు మరిన్ని ఖండాలుగా విడదీయబడినవి: ఉదా. యూరేషియా, యూరప్ మరియు ఆసియా (ఎర్రని రంగులో), అలాగే ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికా కొన్ని సార్లు అమెరికాలుగా గుర్తింపబడుతాయి. (ఆకుపచ్చ రంగులో).
దస్త్రం:Dymaxion map unfolded-no-ocean.png
బక్మిన్‌స్టర్ ఫుల్లర్ గీసిన "డైమాక్సియాన్ మ్యాపు", ఇందులో భూభాగాలన్నీ ఒకదానినొకటి అతుక్కుని ఒకే ఖండంగా వున్నట్టు చూపబడింది.

ఖండము (ఆంగ్లం కాంటినెంట్, "continent") భూమి ఉపరితలంపై గల పెద్ద భూభాగాన్ని 'ఖండము'గా వ్యవహరిస్తారు. ప్రపంచంలో ఖండాలు 7 గలవు. అవి (వైశాల్యం వారీగా ('ఎక్కువ' నుండి 'తక్కువ') ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్ మరియు ఆస్ట్రేలియా.[1]

  • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిపెద్దది : ఆసియా
  • ఖండాలలో వైశాల్యం ఆధారంగా అతిచిన్నది : ఆస్ట్రేలియా
  • జనావాసం లేని ఖండం : అంటార్కిటికా (మంచుతో కప్పబడియున్న భూభాగం)
200 మిలియన్‌ సంవత్సరాల క్రితం లోర్సియా-గోండ్వానా ఖండాలు

ఖండముల సంఖ్య

ఖండముల సంఖ్యను తెలుపడానికి పలు విధాలుగా స్పందిస్తారు.

నమూనాలు
Color-coded map showing the various continents. Similar shades exhibit areas that may be consolidated or subdivided.
7 ఖండములు[2][3][4][5][6]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[7][2]
    ఉత్తర అమెరికా
    దక్షిణ అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
6 ఖండములు
[8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
    యూరప్
    ఆసియా
    ఆస్ట్రేలియా
5 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
    ఆఫ్రికా
       యురేషియా
    ఆస్ట్రేలియా
4 ఖండములు
[7][8][9]
       అమెరికా
    అంటార్కిటికా
          ఆఫ్రో-యురేషియా
    ఆస్ట్రేలియా

విస్తీర్ణము మరియు జనాభా

విస్తీర్ణము మరియు జనాభాల పోలిక
ఖండము విస్తీర్ణం (చ.కి.మీ.) రమారమి జనాభా
2002
మొత్తం జనాభాలో
శాతము
జనసాంద్రత
జనాభా
ప్రతి చ.కి.మీ. నకు
ఆఫ్రో-యూరేషియా 84,360,0005,710,000,00085%56.4
యూరేషియా 53,990,0004,510,000,00071%83.5
ఆసియా 43,810,0003,800,000,00060%86.7
ఆఫ్రికా 30,370,000922,011,00014%29.3
అమెరికాలు 42,330,000890,000,00014%20.9
ఉత్తర అమెరికా 24,490,000515,000,0008%21.0
దక్షిణ అమెరికా 17,840,000371,000,0006%20.8
అంటార్కిటికా 13,720,0001,0000.00002%0.00007
యూరప్ 10,180,000710,000,00011%69.7
ఓషియానియా 8,500,00030,000,0000.5%3.5
ఆస్ట్రేలియా 7,600,00021,000,0000.3%2.8

ఈ ఖండముల మొత్తం విస్తీర్ణం 148,647,000 చ.కి.మీ. లేదా మొత్తం భూమియొక్క ఉపరితల భూభాగంలో దాదాపు 29% (510,065,600 కి.మీ.2).

ఇవీ చూడండి

మూలాలు మరియు పాదపీఠికలు

  1. britannica.com
  2. 1 2 "Continent". ఎన్-సైక్లోపీడియా బ్రిటానికా. 2006. Chicago: Encyclopædia Britannica, Inc.
  3. World, [[:en:National Geographic|]] - Xpeditions Atlas. 2006. Washington, DC: National Geographic Society.
  4. The New Oxford Dictionary of English. 2001. New York: Oxford University Press.
  5. "Continent". MSN Encarta Online Encyclopedia 2006.
  6. "Continent". McArthur, Tom, ed. 1992. The Oxford Companion to the English Language. New York: Oxford University Press; p. 260.
  7. 1 2 3 "Continent". The Columbia Encyclopedia. 2001. New York: Columbia University Press - Bartleby.
  8. 1 2 3 Océano Uno, Diccionario Enciclopédico y Atlas Mundial, "Continente", page 392, 1730. ISBN 84-494-0188-7
  9. 1 2 3 Los Cinco Continentes (The Five Continents), Planeta-De Agostini Editions, 1997. ISBN 84-395-6054-0
"https://te.wikipedia.org/w/index.php?title=ఖండం&oldid=2441746" నుండి వెలికితీశారు