Jump to content

ఖన్వా యుద్ధం

వికీపీడియా నుండి
ఖన్వా యుద్ధం
మొఘల్ సామ్రాజ్యం విస్తరణలో భాగము

మొఘలులు armed with Matchlocks
తేదీ1527
ప్రదేశంఖన్వా, near ఆగ్రా, భారత్
ఫలితంDecisive victory of the first Mughal Emperor Babur.[1]
రాజ్యసంబంధమైన
మార్పులు
Expansion of the Mughal Empire into Rajput territories.
ప్రత్యర్థులు
మూస:Country data Mughal Empire[1]Rajput Confederates[1]
Muslim Rajputs
Lodi warriors
సేనాపతులు, నాయకులు
Babur
Humayun
Ustad Ali Quli
Mustafa Rumi
Chin Timur Khan
Mir Mohib Ali Khalifa
Mir Abdul Aziz
Mir Muhammed Ali Khan
Khusrau Shah Kokultash
Kassim Husain Khan
Muhammad Zaman Mirza
Askari Mirza
Hindal Mirza
Sayyed Mehdi Khwaja
Asad Malik Hast
Raja Sanghar Ali Khan
Silhadi
Rana Sanga 
Rahul Uday Singh Nagari 
Manik Chand Chauhan 
Chandrabhan Chauhan 
Ratan Singh Chundawat 
Raj Rana Ajja 
Rao Ramdas 
Gokaldas Parmar 
Rawal Udai Singh 
Ratan Singh 
Raimal Rathore 
Raja Hasan Khan Mewattpati 
Mahmud Lodi
Silhadi
Madni Rao
బలం
20,000 to 25,000 Mughals
500 Kabul Reinforcements
40,000 Rajputs
10,000 Lodi soldiers
500 War Elephants[1]

1527 మార్చి 17 న ఆగ్రాకు 60కి.మీ దూరంలో ఉన్న ఖన్వా యుద్ధం గ్రామంలో జరిగింది. ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో ఇది రెండవదిగా గుర్తించబడింది. మొదటి యుద్ధం 1526లో ముగల్ చక్రవర్తి బాబర్ పానిపట్టు వద్ద చేసిన పానిపట్టు యుద్ధం. ముగల్ సామ్రాజ్యం విస్తరించే సమయంలో వారికి సరికొత్త శత్రువులు కూడా అధికం అయ్యారు. ప్రత్యేకంగా ఆగ్రా పరిసర ప్రాంతాలలోని రాజపుతానా శత్రువులు మరింత అధికం అయ్యారు. ఇబ్రహీం లోఢీని ఓడించిన తరువాత ముగల్ చక్రవర్తి బాబర్ అనేక మంది లోఢీ వీరులను ఎదుర్కొన్నాడు. సికిందర్ లోడీ ఆయన కుమారుడు ముహమ్మద్ లోఢీ కూడా వారిలో ఉన్నారు. ముహమ్మద్ లోఢీ ప్రఖ్యాత ముస్లిం రాజపుత్ర రాజు మేవాత్‌కు చెందిన " రాజా ఖంజడా "తో సఖ్యత ఏరపరుచుకున్నాడు.

రాజా ఖంజడా హాసన్ మేవాతి ఆయనకు ఆయన స్వయంగా రాజపుత్రునిగా ప్రకటించుకుని సులువుగా శక్తివంతమైన రాణాసింగ్ మద్దతును పొందగలిగాడు. వారిద్దరూ కలుసి ముగల్ చక్రవర్తిని ఆయన ముగల్ అనుయాయులను ఓడించి ముగల్ సామ్రాజ్యాన్ని పతనం చేయాలని ప్రణాళిక వేసాడు.

హిందూ రాజపుత్రులు బాబర్ ముస్లిం శత్రువులు ఏకమై శక్తివంతమైన సైన్యాన్ని తయారుచేసారు. ఇది ముందరి ఇబ్రహీం లోఢీ సైన్యంకంటే శక్తివంతమైనదిగా తయారు చేయబడింది. ఇబ్రహిం లోడీ పానిపట్టు యుద్ధంలో (1526) మాల్వా రాజు చేత మోసగించబడ్డాడు.

బాబర్ మనుమడు అక్బర్ ఇక్కడ నగారాన్ని స్థాపించి తనతాత బాబర్ విజయానికి చిహ్నంగా దానికి ఫతేపూర్ సిక్రీ అని నామకరణం చేసాడు.

నేపథ్యం

[మార్చు]

1526లో బాబర్ తన ముగల్ సైన్యంతో పానిపట్టు వైపు దూసుకువెళ్ళాడు. అక్కడ బాబర్‌ వద్దకు ఈ ప్రాంతంలో అప్పుటి శక్తివంతమైన రాజైన మేవార్ రాజా రాణా సంగా దూత వచ్చాడు. [1] రాజపుత్రులు లోడీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బాబర్‌తో మైత్రి చేయడానికి అంగీకరించి ముగల్ సైన్యాలతో కలిది ఆగ్రా వైపు కదిలారు. వెనుకకు వచ్చే సమయంలో బాబర్ రాణా సంగాకు కల్పి, ధోల్పూర్, బైనా ప్రాంతాలను కానుకగా ఇవ్వడానికి అంగీకరించాడు.[1] బాబర్ పానిపట్టు ఇబ్రహీం లోడీని ఓడించిన తరువాత రాజపుత్రులకు వారు కోరిన ప్రాంతాలను స్వాధీనం చేయడానికి తిరస్కరించాడు. .[1]

బాబర్ ప్రతిస్పందనకు ఆగ్రహించిన రాణా సంగా తనే స్వయంగా ముస్లిం యదువంశి రాజపుత్రునితో రాజా ఖంజడా హాసన్ ఖాన్ (మేవత్) కూటమి చేరాలని పేయత్నించాడు. రాజా ఖంజడాహాసన్ కూటమికి అంగీకరిస్తూనే సికిందర్ లోడీ, మొహమ్మద్ లోడీ మీద తిరుగుబాటుకు నిరాకరుంచాడు.[1]

పరిస్థితి గమనించిన సిల్హది ముందుకు వచ్చి రాణా సంగా తరఫున బాబర్ వద్దకు రాయబారం వెళతానని తెలిపాడు. రాణా సంగా ఆగ్రా పరిసర ప్రాంతాలను స్వాధీనం చేయాలని నిర్బంధించాడు. బాబర్ అతి విశ్వాసం, అసంఖ్యాక సైనిక బలం ఉన్న రాణా సంగా దాడి చేయవచ్చని భావించాడు. 1527 మార్చి మాసంలో హిందువులు సమైక్యమై 80,000 సైన్యంతో బాబర్‌ను ఎదుర్కొన్నారు.

ఈ సంఘటన ముగల్స్‌కు ఆగ్రహం తెప్పించింది. బాబర్ ఆదేశంతో ముగల్ సైన్యాలు ఏకీకృతం అయ్యే ప్రయత్నాలు కొనసాగాయి. ఈ సారి యుద్ధంలో సంపదకొరకు కాక మతపరమైన పట్టదల కొనసాగింది. సుశిక్షుతులైన అసంఖ్యాకమైన రాణా సంగా సైన్యాలను ఎదుర్కోవడానికి బాబర్ సైన్యాలను సమాయత్తం చేసాడు. ఖంజడా హాసన్ నాయకత్వంలో 20,000 ముస్లిం రాజపుత్రులు బైనా వైపు కదిలారు. సైన్య సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్న బాబర్ ప్రరిస్థితి గమనించి ఆగ్రా నుండి బలగాలను ఉపసంరించుకుని తనకుమారుడైన హుమాయూన్కు దండయాత్ర జౌంపూర్ నిలిపివేసి వెనుతిరిగి రమ్మని ఆదేశించాడు. తరువాత బాబర్ముగల్ సైన్యాలను ఏకీకృతం చేయడం మీద దృష్టి కేంద్రీకరించాడు. .[1][1]

మేవాత్ పాలకుడు ఖంజడా హాసన్ ఖాన్ రాజ్యం ఢిల్లీకి దక్షిణంగా హర్యాన, ఈశాన్య రాజస్థాన్ భూభాగంలో విస్తరించి ఉన్న మేవాత్ రాజ్యం మద్దతు కారణంగా రాణా సంగాను ఎదిరించడం కష్టమని బాబర్ గ్రహించాడు.[1] ఖజండా హాసన్ ఖాన్ బలీయమైన శత్రువని ఆయన స్థానిక భారతీయ ముస్లిముల గౌరవం పొందినవాడని గ్రహించిన బాబర్ అయనను శాంతింపజేయడానికి ఖజండా నాహెర్ ఖాన్‌ను విడుదల చేసాడు. (ఖజండా నాహెర్ ఖాన్‌ మేవాత్ పాలకుడు ఖంజండా హాసన్ ఖాన్ కుమారుడు. పానిపట్ యుద్ధం (1526 లో) ఖజండా నాహెర్ ఖాన్‌ను బాబర్ చేత బంధించబడి ఖైదుచేయబడ్డాడు). బాబర్ ఖజండా నాహెర్ ఖాన్‌ను విడుదల చేసేసమయంలో ముగల్ సంప్రదాయం అనుసరించి చక్కటి అరేబియన్ గుర్రాలను కానుకగా పంపడు. ఖజండా హాసన్ ఖాన్‌ను ప్రసన్నం చేసుకుని రాణా సంగా నుండి విడదీయలని బాబర్ ఈ ప్రయత్నం చేసాడు.[1]

బాబర్ చర్యకు ఖజండా హాసన్ ఖాన్ శాంతించినా ఆయన తన అనుయాలను వదలడానికి, బాబర్‌తో శతృత్వం మాత్రం విడిచిపెట్టలేదు. అంతేకాక తన కుమారుని విడుదల ముగల్ పాలకుల బలహీనమని భావించాడు. ఖజండా హాసన్ ఖాన్ తిరస్కరణను బాబర్ సహించలేక పోయాడు. ఫలితంగా ఖజండా హాసన్ ఖాన్ మతవిద్రోహి అని ప్రకటించాడు. అయినప్పటికీ మేవాత్ పాలకుడు ఖజండా హాసన్ ఖాన్ ఇస్లాం మతాన్ని విడినట్లు సాక్ష్యాలు లేవు. బాబర్ కఠినమైన ప్రకటన తరువాత మత అవిశ్వాసులని భావించిన 100,000 రాజపుత్ర సైన్యాలను చూసి వెరపు చెందాడు.[2]

ఆరంభకాల వివాదాలు

[మార్చు]
Combat between the Mughal Army of Babur and the Rajputs of Rana Sanga.

1527 ఫిబ్రవరి 11 బాబర్ చక్రవర్తి కొద్ది రోజులు ఆగ్రాలో నివసించి తన సైన్యాలను పరిశీలించి సైనిక శిక్షకులను పిలిచి సైనికులకు శిక్షణమివ్వమని ఆదేశించాడు. అలాగే యుద్ధానికి అవసరమైన సన్నాహాలు చేయడం ఆరంభించాడు. .[1] తరువాత ఆయన ఆఫ్ఘన్‌ సైనికాధికారులు, భారతీయ అనుయాయులను కూడగట్టుకున్నాడు. బాబర్ తనసైన్యాలను బలోపేతం చేయడానికి వారిని పంపాడు. తరువాత ఆయన పశ్చిమంగా మెధాకర్ వైపు పయనం సాగించాడు. తరువాత ఫతేపూర్ సిక్రీ చేరుకున్నాడు. అక్కడ పుష్కలంగా నీరు ఉండడం వలన అక్కడ మకాం వేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే రాణా సంగా ఆప్రదేశానికి చేరుకుని అక్కడ సరోవర ప్రాంతంలో మకాంవేసి యుద్ధ్హనికి సన్యసమేతంగా సిద్ధం అయ్యాడు. అక్కడ ఆయనతో బయానా నుండి వచ్చిన మహాదిఖ్వాజ సేనలు కలుసుకున్నాయి. .[1]

బాబర్ సైన్యాలు రాజపుత్రులతో తీవ్రమైన ప్రతిఘటనలను ఎదుర్కొని తనకొత్త శత్రువులను సైతం గౌరవించడం అలవాటు చేసుకున్నాయి. సైన్యంలో కొంత భాగం కోట వద్దకు ముందుకు కలిలారు. రాజపుత్రులు వారిని ఎదుర్కొని వారిని వెనుకకు మళ్ళించారు. ఈ యుద్ధంలో రాజపుత్రులు సంఘటితం అయి పరాక్రమం చూపారు. చగాటా, టర్కిక్, మంగోలీలు వారు బలీయమైన శత్రువులను (ఆఫ్ఘన్ భారతీయులు, స్థానిక భరతిఒయులు) ఎదుకొన్నారని గ్రహించారు.[1] పరాక్రమవంతులు, యుద్ధోత్సాహులు అయిన రాజపుత్రులు అపారమైన రాజభక్తితో శత్రువులను ఎదుర్కొన్నారు. రాజపుత్రులు శత్రుస్థావరాల కదలికలను తెలుసుకోవడానికి గూఢాచారులను నియమించారు..[1]

బాబర్ చక్రవర్తి ప్రధాన సైనికాధికారులను ఉత్సాహపరచి ముందుకు కదిలేలా ప్రోత్సహించాడు. మిర్ అబ్దుల్ అజీజ్ ధైర్యసాహసాలు ప్రదర్శించే వీరులతో ఫతేపూర్ సిక్రీ వైపు మునుదు సాగాడు. రాజపుత్రులు శత్రువులు ముందుకు కదలడం గ్రహించి 4,000-5000 మంది అశ్వికులతో ఎదుర్కొనారు. మిర్ అబ్దుల్ అజీజ్ సైన్యంలో 1000-1500 మంది అశ్వికులు మాత్రమే ఉన్నారు. [1] మిర్ అబ్దుల్ అజీజ్ సైనికులలో చాలామంది హతులయ్యారు. మిగిలినవారు ఖైదుచేయబడ్డారు. వార్తను తెలుసుకున్న బాబర్ ప్రధాన వజీరు కుమారుడు మొహీబ్ అలీ ఖలీఫా అతని అనుయాయులు వారికి సహాయంగా ముందుకు కదిలారు. వారు అనేక అశ్వికులను సమకూర్చుకుని యుద్ధానికి సన్నద్ధులై వేగంగా ముందుకు కదిలారు. యుద్ధభూమికి చేరికొనగానే పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని గ్రహించారు.[1] అబ్దుల్ అజీజ్ విజయం పొందలేక తనకు తాను అశ్వం నుండి కిందకు త్రోయబడ్డాడు. యుద్ధంలో అద్భుతమైన సైనికాధికారులు వధించబడ్డారు. చివరకు వారు నిరాశగా వెనుదిరిగారు.[1] చక్రవర్తి సైన్యాలను కూడా ముహమ్ండ్ అలిఖాన్ వెకకు మళ్ళించాడు. రాజపుత్ర సైన్యం తన మేవత్ మద్దతుదార్లను కలుపుకుని క్రమంగా 1,20,000 అశ్వికులతో బలపడింది. బాబర్ ఎదుర్కొన్న సైన్యంలో అది అతిపెద్ద సైన్యగ గుర్తించబడింది. [1] బాబర్ తనసేనలు నిరుత్సాహపడడం గ్రహించాడు. తరువాత తన సైన్యాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. క్లిష్టమైన సమయంలో బాబర్ కాబూల్ నుండి 500 అశ్వికుల సైన్యాన్ని అందుకున్నాడు. .[1] బాబర్ శత్రువుల దృష్టిని మేవాత్ నుండి మళ్ళించడానికి ప్రయత్నిస్తూ కొంత సైన్యాన్ని పంపాడు. అయినప్పటికీ సైన్యం బాబర్ ఆసించిన విజయాన్ని అందించలేదు.[1]

రాణాసంగా ప్రసంగం

[మార్చు]

" ప్రతియొక్క యోధుడు వీరలక్షణంతో , మా పూర్వీకులు ధైర్య సాహసాలు గుర్తుచేసుకుంటూ పని చేయాలి. మా పవిత్ర భూమి కళంకం చేసిన ఆక్రమణదారుల నాశనం కోసం మాత్రమే పనిచేయాలి. మన పవిత్రభూమిని కొన్ని సంవత్సరాలుగా అపవిత్రం చేసే మేము ఆక్రమణ దారులను ఎదుర్కోవడానికి అందివచ్చిన అవకాశం పట్టుకుని విజయం సాధించాలి. ఒకసారి మన అవకాశాన్ని వినియోగించుకుని విజయం సాధిస్తే శత్రువులిక తలెత్తుకోవడానికి అవకాశం ఉండదు. హిందూపాలకుల పతాకం దేశంమంత స్వతంత్రగా ఎగరాలి" [3]

బాబర్ సైన్య సమీకరణ

[మార్చు]
Khusrau Shah Kokultash

మొఘల్ చక్రవర్తి బాబర్ తరువాత అధికంగా సైనిక శిబిరంలో కాలంగడిపి సేనలకు సూచనలు ఇవ్వడం ఆరంభించారు. రాజపుత్రులతో యుద్ధం కొనసాగించడానికి అవసరమైన వ్యూహాలను అమలుచేయడం ప్రాంభించాడు. ఆయనలో మతపరమైన పశ్చాత్తాపం తలెత్తింది. తమ పెద్దలు మతపరంగా విధించిన ఆంక్షలను అధిగమిస్తూ అధికంగా మద్యం ఉపయోగించడం కారణంగా తలెత్తిన సమస్యలను గమనించాడు.చంఘిస్ ఖాన్ నుండి మొదలైన మద్యం మీద ఉన్న నిషేధాన్ని అధిగమించడం పొరపాటని గ్రహించాడు.

చక్రవర్తి సమక్షంలో తీసుకున్న ప్రమాణం ఆధారంగా దాదాపు 300 మంది పురప్రముఖులు మధ్యనిషేధంలో చక్రవర్తికి సహకారం అందించారు.[1] ద్రాక్షాసారాయి మీద ఉప్పు కుమ్మరించబడింది. శిబిరాలలో కనిపించిన ద్రాక్షాసారాయి కుమ్మరించడానికి ఒక బావి త్రవ్వించబడింది. పశ్చాత్తాపం గుర్తుగా ఒక సత్రం నిర్మించబడింది. [1] ముస్లిం అనుయాయులకు బహుమతిగా తెంగా (స్టాంప్ పన్ను) రద్దుచేయబడుతూ ఫిబ్రవరి 26 న ఫిర్మన్ ప్రకటించబడింది. [1]

బాబర్ సైనిక శిబిరాలలో కలుషితాలను తొలగించడం సైనిక కుటుంబాలలో మరింత నిరాశను కలిగించింది. ఆయన తనపట్ల విశ్వసాన్ని ప్రదర్శించే మొహిబ్ అలీ ఖాన్‌ను అధికారికంగా ప్రధాన వజీరుగా నియమించాడు. .[1] బాబర్ ధైర్యం, మేధాసంపత్తి ఆయనను నిరాశ నుండి వైదొలగి ఆశాకిరణం వైపు నడిపించింది. ఆయన మతం, సంప్రదాయం ఆధారితంగా సైన్యాలను సమీకరిస్తూ తన సైనిక శక్తిని బలపరిచాడు. .[1]

బాబర్ విజయం

[మార్చు]

బాబర్ తనసైన్యం దీర్ఘ్జకాలికంగా ఎదురుచూస్తున్నట్లు 1527 మార్చి 12 న తన సైన్యంతో మేవాత్ మీద దండయాత్ర కొనసాగించాడు.[1] బాబర్ స్వయంగా సైన్యాలకు అధ్యక్షత వహిస్తూ సైన్యాన్ని ముందుకు కదిలించాడు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన సూచనలిస్తూ సౌన్యాన్ని నడిపించాడు. అది గ్రహించిన రాజపుత్రులు వారిని ఎదుర్కోవడానికి తగిన సన్నాహాలు చేసుకున్నారు.[1] బాబర్ దండయాత్ర ముగించి సైన్యాలను వెనుకకు తీసుకున్నాడు. బాబర్ చేత పంపబడిన కొంతమంది సైన్యం శత్రువులను ఖైదుచేసి తీసుకువచ్చారు. అది బాబర్ సైన్యం ఆత్మవిశ్వసాన్ని అధికం చేసింది.[1] తరువాత బాబర్ సైన్యం కందకాలను అధిగమిస్తూ ముందుకు కదిలింది.[1] బాబర్ సైన్యాన్ని ఉత్సాహపరుస్తూ విజయకేతనం ఎగురవేసాడు..

బాబర్ యుద్ధ పరిస్తితి

[మార్చు]

బాబర్ చితమూర్‌ను తన కుడి పక్షానికి నాయకుడుగా చేసి హుమాయూనును ఎడమ పక్షానికి నాయకునిగా చేసి ఖాసిం హుస్సైన్ ఖాన్, హిండల్ మిర్జా, ఖుస్రౌ షా కొకుల్టాష్ సాయంగా పంపాడు. హుమాయూన్ సయ్యద్ మెహిదీ ఖ్వాజా, ముహమ్మద్ జమాన్ మిర్జా, మిర్ అబ్దుల్ అజిజ్, మిర్ ముహమ్మద్ అలి ఖాన్ లకు బాధ్యత అప్పగించాడు. .[1] బాబర్ ఆయుధాల నిర్వహణ బాధ్యత టర్కిష్ సైనికాధికారులకు అప్పగించబడింది. ఆయుధాల విర్వహణాధికారిగా అలి క్విలి నియమించబడ్డాడు. తుపాకుల బాధ్యత ముస్తాఫా రుమీకి అప్పగొంచబడింది.[4]

బాబర్ తన పదాతి దళాలను నలుచదరంగా నిలిపాడు. ముదు వరుస దళాలు చెక్క డాలు రక్షణగా నిలుపబడ్డాయి. సైన్యం రక్షణ కవచం వెనుక సురక్షితంగా నిలిచింది. బాబర్ ఆశ్వదళం సైన్యాలకు రెండు వైపులా నిలిచి మధ్యమధ్యలో బాబర్ ప్రత్యేక సైన్యం నిలుపబడింది. అశ్వదళాలకు ముగల్ సామ్రాజ్య విశ్వాసులు ధైర్యసాహసాలు కలిగిన వీరులు నాయకత్వం వహించారు.

అవసరమైన సమయంలో విపత్కర నివారణ దళాలను సిద్ధంగా సైన్యం అంతటా అక్కడక్కడా నిలిపాడు. కుడి ఎడమలలో నిలిపిన దళాలను తులుఘమ [1] బాబర్ గతంలో ఉజ్బెకిన్లతో చేసిన యుద్ధంలో కలిగిన అనుభవాలతో అద్భుతమైన మేధాశక్తిని మేళవించి బాబర్ యుద్ధవ్యూహ రచన చేసాడు. [1] ఆయన భారతీయ మద్దతుదారులు ఎడమ వైపు నిలబెట్టబడ్డాయి.[1] ఉస్తాద్ అలి కులి సారథ్యంలోని ఆయన సైన్యం కేంద్రస్థానంలో నిలుబబడింది. వారిలి ముందుగా బలమైన లోహపు గొలుసులు రక్షణగా ఏర్పరచబడ్డాయి. వారి వెనుక నిలుపబడిన దళాలు వెనుక నుండి వచ్చే దాడిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నాయి.[1] విస్తారమైన సైన్యానికి బాబర్ వద్ద సైనిక శిక్షణ తీసుకున్న అనుభవశాలురు నాయకత్వం వహించారు.

రాణా సంగా యుద్ధవ్యూహం

[మార్చు]

రాణాసంగా నాయకత్వంలో సైన్యంలో గొప్ప సంస్థానాధీశులు ఉన్నారు. సంస్థానాధీశులతో అపారమైన సైన్యం రాణాసంగాకు మద్దతుగా నిలిచింది. ఈశాన్య మాల్వాలోని తోమర్ రాజపుత్ర సంస్థానాధీశుడు సిల్హాది, భిల్సా సంస్థానాధీశులు 30,000 పురాబియా సైనికులతో మద్దతుగా నిలిచాడు, మేవత్ రాజా ఖంజడా హాసన్ ఖాన్ 40,000 సైనికులతో మద్దతుగా నిలిచాడు, డొగర్‌పూర్ రాజా రాహుల్ ఉదయ్ సింగ్ నగరి 10,000 సైన్యాలతో నిలిచాయి, [1] వీరిలో మాల్వా సంస్థానాధీశుడు ప్రాధాన్యతలో ప్రథమ స్థానంలో ఉన్నాడు. సుల్తాన్ సికిందర్ లోడీ కుమారుడు సుల్తాన్ మొహమ్మద్ లోడీ తన సోదరుడు ఇబ్రహీం లోడీతో 10,000 సైన్యంతో ఢిల్లీ ఆఫ్ఘన్ పాలకుల తరఫున రాణాసింగాకు మద్దతుగా నిలిచాడు. .[1] మిగిలిన సంస్థానాధీశులు ఒక్కొక్కరు 4000-7000 సైన్యాలతో రాణాసంగాకు మద్దతుగా నిలిచాడు. వారికి 500 గజసైన్యం కూడా మద్దతుగా నిలిచింది. వారంతా అతిశయించిన ఆత్మవిశ్వాసంతో వారి ఏకైక శత్రువు మీద విపరీతమైన ద్వేషంతో నిలిచారు.[1] వారిలో 7 రాజులు, 9 రావోలు, 104 మంది రావల్స్ (జమీందారులు) ఉన్నారు.

యుద్ధం

[మార్చు]

ఖన్వా ఆగ్రాకు పశ్చిమంలో 60కి.మీ దూరంలో ఉంది.[1] ఇక్కడ హిందూ సంస్థానాధీశులు, ముగల్ పాలకుడు బాబర్ మధ్య ఇతిహాస సమాన యుద్ధం జరిగింది. .[1] ప్రత్యేక సైనిక దళాలు కూడా సైన్యంలో నియమించబడ్డాయి. ముస్తాఫా రూమీ ఒకవైపు సన్యానికి అధ్యక్షత వహించాడు. కుడి వైపు కేంద్రంలో శత్రువుల మీద అగ్నిని కురిపించడానికి ఫిరంగి దళం నిలుపబడింది.[1] శత్రువులు నిరంతరంగా దాడి చేస్తూనే ఉన్నారు. వారి నుండి రక్షించడానికి విమోచన దళం పంపబడుతూనే ఉంది. కుడివైపు దళం నిరాశకు లోనైన సమయంలో నివారణ సైన్యం మద్దతుగా నిలిచింది. యుద్ధం అయిపోయిన కొన్ని గంటల పాటు యుద్దోన్మాదం కొనసాగింది. సైన్యాన్ని చంక్రంలా నిలిపి తుపాకులను కాల్చమని బాబర్ సందేశాలను జారీ చేసాడు. ఏకకాలంలో పదాతి దళాలను సమాయత్తం చేసి శత్రువుల మీద దాడి సాగించారు. ఈ విభిన్నమైన యుధ్హవ్యూహాలు శత్రువులను అయోనయంలో పడవేసాయి.[1] బాబర్ రూపొందించిన ఎదురుచూడని యుద్ధ వ్యూహాలు శత్రువులను అయోనయంలో పడవేసింది. ముగల్ సైన్యం అంటించిన అగ్ని వలన రాజపుత్ర గజసైన్యం భీతిల్లి చిందరవందర అయింది.[1] ముగల్ విలుకాడ్రు కుడి ఎడమల నిలిచి శత్రువుల మీద బాణవర్షం కురిపించారు. వీరు రాపుత్ర సైన్యంలో అధికనష్టం కలుగజేసారు. ముగల్ యుద్ధ వ్యూహాలు రాజపుత్రులకు కొత్తవిగా ఉండడం అపజయానికి కారణం అయింది. సైన్యంలో మధ్యభాగం చిందవందర కావడంతో సైన్యం కకావికలైంది. కుడి ఎడమ సైన్యం వెనుక సైన్యం స్థానభ్రంశం వలన రాజపుత్ర సైన్యంలో వత్తిడి అధికమైంది.[1] ధౌర్యసాహాసాలు కలిగిన రాజపుత్ర సైన్యం అప్పటికీ ధైర్యంగా నిలిచింది.మొగల్ పాలకులు భారతదేశంలో మొదటిసారిగా ఫిరంగులను ప్రవేశపెట్టారు. కాలంచెల్లిపోయిన భారతీయుల యుద్ధ వ్యూహాలకు ముగల్ ఫిరంగి దళం ముగింపు పలికింది.[5] వారు చక్రవర్తి కేంద్రీకృత దళాల మీద నిరంతరంగా సాగించిన దాడి నిష్ఫలం అయింది. ధైర్యంగా స్థిరంగా నిలిచిన ముగల్ సైన్యం విజయం సాగించింది. [1] రాజపుత్రులు అపారమైన సైనిక నష్టంతో అపజయం పొందారు.

రాజత్రులు చేయడానికి ఏమీ మిగల లేదు. వారు చివరికి యుద్ధంలో వెనుదిరిగారు. .[1] బాబర్ అశ్విక దళాలను పంపి రాజపుత్ర సైన్యాలను రాజపుత్ర సైన్యాలు తిరిగి కూడదీసుకోలేనంతగా చెదరగొట్టాడు.[1] రాణాసంగా తప్పించుకున్నాడు.[1] బాబర్ ఫిరంగి దళం లేకుండా రాణాసంగాను గెలవడం సాధ్యపడేది కాదు.[6]

యుద్ధానంతర పరిస్థితి

[మార్చు]

రాజపుత్రులు పూర్తిగా చెదిరిపోయి కనిపించకుండా పోయారు. బయానా, ఆల్వార్ రహదారులు రక్తసిక్తమై మృతదేహాలతో నిండిపోయాయి. మరణించించిన వారిలో మేవాధిపతి రాజా హాసన్ ఖాన్ డోంగర్పూర్ రాజు ఉదయసింగ్ చౌహాన్, మాణ్జిక్చంద్ చౌహాన్, కొఠారియా ఉన్నారు. బాబర్ అద్భుతమైన నాయకత్వం, ఆధునిక సాంకేతికత యుద్ధంలో!విజేతలుగా నిలిచాయి. బాబర్ తరువాత ఘాజీ వీరుడు బిరుదుతో గౌరవించబడ్డాడు. యుద్ధభూమి నుండి పారిపోయిన సుల్తాన్ లోడీ తూర్పు దిశగా పోయి తలదాచుకున్నాడు. తరువాతి కాలంలో రెండు సంవత్సరాల తరువాత జరిగిన ఘాఘ్రా యుద్ధంలో సుల్తాన్ లోడీ బాబర్‌కు సవాలుగా నిలిచాడు.[1]

బాబర్ ఆగ్రాను వదిలి వెళ్ళగానే అంతటా తిరుగుబాటు మొదలైంది. అత్యంత కష్టతరంగా స్వాధీనం చేసుకున్న కోటలకు, పట్టణాలకు కొత్త అధికారులు నియమించబడ్డారు.ఆఫ్ఘన్ పాలకుల ఆధీనంలో ఆగ్రాకు సమీపంలో ఉన్న యమునాతీరంలోని రాబెరీ, చంద్వార్, డోయాబ్ లోని కొయల్, గంగాతీరంలో ఉన్న సంబల్ ప్రాంతాలు స్వాధీనం చేసుకోబడ్డాయి. అయినప్పటికీ కనౌజ్‌ను మాత్రం స్వాధీనం చేసుకోవడానికి బాబర్ బృందాలకు సాధ్యపడలేదు.[1] గ్వాలియర్‌ను రాజపుత్రులు దిగ్భంధించారు. గ్వాలియర్‌ను విడిపించడానికి పంపబడిన కల్పీకి చెందిదిన అలీం ఖాన్ జిగత్ సేనలు ఉపసంహరించబడి స్వస్థలానికి వెనుతిరిగాయి.[1] బాబర్ వలన పలు హిందూ సంస్థానాధీశులు తమ రాజాస్థానలను వదిలి వెళ్ళారు.[1] హిందూ రాజు రాణాసంగా గతంలో విజయాలు సమీపకాలంలో సాధించిన విజయం రాజపుత్రులకు ఆత్మవిశ్వాసం కలిగించింది. స్థానిక ప్రభుత్వం విజయం వారికి సమృద్ధి సంతోషం కలిగించింది. యుద్ధానంతరం బాబర్ తిరుగుబాటు దారులను తమ సైన్యాలను పంపి త్వరగా భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు. [1]

బాబర్ రాణాసంగాకు వ్యతిరేకంగా వ్యూహరచన చేస్తున్న తరుణంలో వెసులుబాటును ఆసరాచేసుకుని ఆగ్రాసమీప సంస్థానాధీశులు స్వతంత్రంగా వ్యవహరించసాగారు. యుద్ధానంతరం బాబర్ సేనలను పంపి చంద్వార్, రాబేరీ భూభాగాలను స్వాధీనం చేసుకున్నారు.[1] అయినప్పటికీ ఎతావాను మాత్రం స్వాధీనం చేసుకోవడానికి సాధ్యపడలేదు. .[1] రాణాసంగా 1527లో మేవాత్ ఉత్తర సరిహద్దులో ఉన్న బస్వా వద్ద మరణించాడు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.00 1.01 1.02 1.03 1.04 1.05 1.06 1.07 1.08 1.09 1.10 1.11 1.12 1.13 1.14 1.15 1.16 1.17 1.18 1.19 1.20 1.21 1.22 1.23 1.24 1.25 1.26 1.27 1.28 1.29 1.30 1.31 1.32 1.33 1.34 1.35 1.36 1.37 1.38 1.39 1.40 1.41 1.42 1.43 1.44 1.45 1.46 1.47 1.48 1.49 1.50 1.51 1.52 1.53 1.54 1.55 A History of India Under the Two First Sovereigns of the House of Taimur, Báber and Humáyun, by William Erskine, Published by Longman, Brown, Green, and Longmans, 1854, Public Domain
  2. http://www.columbia.edu/itc/mealac/pritchett/00islamlinks/ikram/part2_10.html
  3. Decisive Battles India Lost
  4. https://sites.google.com/site/airavat/matchlock
  5. Barua, Pradeep (2005). The State at War in South Asia. University of Nebraska Press. p. 33. ISBN 978-0-80321-344-9.
  6. Barua, Pradeep (2005). The State at War in South Asia. University of Nebraska Press. p. 34. ISBN 978-0-80321-344-9.
  • A History of India Under the Two First Sovereigns of the House of Taimur, Báber and Humáyun by William Erskine, Published by Longman, Brown, Green, and Longmans, 1854 [1]

వెలుపలి లింకులు

[మార్చు]