Jump to content

ఖమర్ ఉల్ ఇస్లాం

వికీపీడియా నుండి

ఖమర్ ఉల్ ఇస్లాం (27 జనవరి 1948 - 18 సెప్టెంబర్ 2017) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై గృహనిర్మాణ, కార్మిక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ & వక్ఫ్ మంత్రిగా పని చేశాడు.[1][2][3][4][5][6]

నిర్వహించిన పదవులు

[మార్చు]
క్రమ సంఖ్యా నుండి వరకు పదవి పార్టీ
1. 1978 1983 గుల్బర్గా నుండి శాసనసభ్యుడు (మొదటిసారి)
  • పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు (1979-1982)
స్వతంత్ర
2. 1989 1994 గుల్బర్గా నుండి శాసనసభ్యుడు (రెండవ పర్యాయం)
  • అంచనాల కమిటీ సభ్యుడు (1990-1992)
  • పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు (1992-1993)
  • పిటిషన్లపై కమిటీ సభ్యుడు (1993-1994)
ముస్లిం లీగ్
3. 1994 - గుల్బర్గా నుండి శాసనసభ్యుడు (3వ పర్యాయం)
  • గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు (1994-1996)
కాంగ్రెస్
4. 1996 1998 గుల్బర్గా నుండి 11వ లోక్‌సభలో ఎంపీ . జనతా దళ్
5. 1999 2004 గుల్బర్గా నుండి శాసనసభ్యుడు (4వ పర్యాయం) కాంగ్రెస్
6. 2008 2013 గుల్బర్గా నార్త్ నుండి శాసనసభ్యుడు (5వ పర్యాయం) కాంగ్రెస్
7. 2013 2017 గుల్బర్గా నార్త్ నుండి శాసనసభ్యుడు (6వ పర్యాయం) కాంగ్రెస్

మరణం

[మార్చు]

ఖమరుల్ ఇస్లాం స్వల్ప అనారోగ్యంతో బెంగళూరులోని ఒక ఆసుపత్రిలో చేరి 11 రోజుల అనంతరం కార్డియోజెనిక్ షాక్, బహుళ అవయవ వైఫల్యంతో 69 సంవత్సరాల వయస్సులో 2017 సెప్టెంబర్ 18న మరణించాడు.[7] ఆయనకు భార్య కనీజ్ ఫాతిమా, దత్తపుత్రుడు ఫరాజ్ ఉల్ ఇస్లాం ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "Karnataka Congress leader Qamar-ul-Islam passes away". Deccan Herald (in ఇంగ్లీష్). 2017-09-18. Retrieved 2021-12-28.
  2. reddy, k n (2018-04-06). "Congress to field Qamarul Islam's wife in Kalaburagi North?". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2021-12-28.
  3. "Karnataka: Qamarul Islam quelled, Ambareesh won't budge". Deccan Chronicle (in ఇంగ్లీష్). 2016-07-01. Retrieved 2021-12-28.
  4. "Winter Session begins at Belagavi". Star of Mysore (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-11-13. Retrieved 2021-12-28.
  5. "Minority girls to get Rs 50K marriage dole". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-10-17. Retrieved 2021-12-28.
  6. "Siddaramaiah Cabinet: List of portfolios". Deccan Herald (in ఇంగ్లీష్). 2013-05-19. Retrieved 2021-12-28.
  7. "Former Minister Qamarul Islam passes away" (in Indian English). The Hindu. 18 September 2017. Archived from the original on 20 April 2025. Retrieved 20 April 2025.