ఖమస్ రాగం
ఆరోహణ | స మ1 గ3 మ1 ప ద2 ని2 స' |
---|---|
అవరోహణ | స' ని2 ద2 ప మ1 గ3 రి2 స |
కర్ణాటక సంగీతం | |
---|---|
విషయాలు | |
కూర్పులు | |
వాయిద్యాలు | |
సంగీతకారులు | |
ఖమస్ లేదా కమాస్/ఖమాస్/ఖమాజ్/ఖమాచ్ దక్షిణ భారత శాస్త్రీయ సంగీతంలో ఒక రాగం. ఇది ఒక జన్య రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి నుండి ఈ రాగం జనితం. ఈ రాగం శృంగార రసాన్ని పుట్టిస్తుంది. ఈ రాగం జావళీలు పాడేందుకు అనువైన రాగం.[1][2]
రాగ స్వరూపం, లక్షణం
[మార్చు]ఖమస్ రాగం అసమమిత రాగం, ఆరోహణంలో రిషభం ఉండదు. ఇది ఒక వక్ర షడవ సంపూర్ణ రాగం, అనగా ఆరోహణలోని ఆరు స్వరాలను వంకర-టింకరగా పాడతారు.[2] ఈ రాగం ఆరోహణ, అవరోహణాలు :
ఈ ఆరోహణావరోహణాల్లో స్వరాలు : షడ్జమం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుఃశృతి దైవతం, కైశికి నిషాదం ఆరోహణలో, అవరోహణలో అదనంగా చతుఃశృతి రిషభంస్వరం ఉంటుంది.
రాగ వైవిధ్యత
[మార్చు]నిజానికి ఖమాస్ రాగం ఒక ఉపాంగ రాగం (జనక రాగంలోని స్వరాలనే వాడాలి). తరువాతి కాలంలో జావళీలకు అనువుగా ఖమాస్ భాషాంగ రాగం అయింది (జనక రాఅగంలో లేని స్వరాలు చేరతాయి). అన్య స్వరంగా కైకలి నిషాదాన్ని చేర్చారు.[1] ముద్దుస్వామి దీక్షితుల ప్రకారం ఖమాస్ ఒక సంపూర్ణ రాగం, ఇందులో స్వరాలలో వక్రత ఉండదు.[1][2] హిందుస్తానీ సంగీతంలోని ఖమాజ్ రాగానికి ఖమాస్ రాగం దగ్గరగా ఉంటుంది. హిందీ సినిమా అభిమాన్ లోని 'తేరే మేరే మిలన్ కీ' పాట ఖమాజ్ రాగంలో స్వర పరచబడింది.[3]
పేరు పొందిన పాటలు
[మార్చు]ఈ రాగంలో ఎన్నో రచనలు స్వరపరచబడ్డాయి. వీటిలో ముఖ్యమైనవి :
- సంతాన గోపాలకృష్ణం, షడాననే సకలం అర్పయామి, సరస దళ నయన - ముద్దుస్వామి దీక్షితయ్య రచనలు
- సుజన జీవన, సీతాపతే - త్యాగరాజు రచన
- ఏంతనిన్నే - సుబ్బరామ దీక్షితులు రచన
- బ్రోచేవారెవరురా, ఉపేంద్రం ఆశ్రయామి సంతతం, ఇంత పరాక్కేలనయ్యా - మైసూరు వాసుదేవాచార్య రచన
- ఇడదు పదం తొక్కి ఆడు - పాపనాశం శివన్ రచన
- తిల్లానా - పట్నం సుబ్రమణ్య అయ్యరు రచన
- డోలాయాం చల డోలాయాం, సాంబ శివాయనవే[4] - అన్నమయ్య కీర్తన
- మాతే మలయధ్వజ పాండ్య సంజాతే - ముత్తయ్య భాగవతార్ రచన
- శంభో మహాదేవ చండ్రచూడా - పరమేశ్వర భాగవతార్ రచన
- సరాస్వతీ సరస వాణీ సరసిజ భవునికి రాణి - వరదదాసయ్య రచన
- సరస-సమ-ముఖ,పాలాయ మామయి భో శ్రీకాంతేశా - స్వాతి తిరునాళ్ రచన
- జయతి జయతి భారత మాత - విశ్వనాథ శాస్త్రి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 రాగాస్ ఇన్ కార్నాటిక్ మ్యూజిక్ రచయిత : డా. ఎస్. భాగ్యలక్ష్మి, 1990, సిబిహెచ్ ప్రచురణలు
- ↑ 2.0 2.1 2.2 రాగనిధి(ఆంగ్ల పుస్తకం) రచయిత : పి. సుబ్బారావు, 1964 ప్రచురణ, మ్యూజిక్ అకాడెమీ ఆఫ్ మద్రాస్
- ↑ ఖమస్ రాగానికి హిందుస్తానీ సంగీతంలో ఉన్న సమానాంతర రాగాల గురించి హిందూ పత్రికలో కథనం
- ↑ యూట్యూబ్ లో ఈ రాగాన్ని ఆలపించిన మాళవిక