Jump to content

ఖమ్రుల్ హోడా

వికీపీడియా నుండి
ఖమ్రుల్ హోడా

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2025 నవంబర్ 14
ముందు ఇజహరుల్ హుస్సేన్
పదవీ కాలం
2019 – 2020
ముందు మహ్మద్ జావేద్
నియోజకవర్గం కిషన్‌గంజ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్
వృత్తి రాజకీయ నాయకుడు

ఖమ్రుల్ హోడా బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు కిషన్‌గంజ్ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ఖమ్రుల్ హోడా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో కిషన్‌గంజ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వీటీ సింగ్ పై 10,204 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2020 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి తన 41,904 ఓట్లతో మూడోస్థానంలో నిలిచాడు.

ఖమ్రుల్ హోడా 2023 ఏప్రిల్ 21న పూర్ణియాలో జరిగిన కార్యక్రమంలో తన మద్దతుదారులతో కలిసి అధికార రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరాడు.[4] ఆయన ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2025 శాసనసభ ఎన్నికలలో కిషన్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి స్వీటీ సింగ్ పై 12,794 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "Kishanganj Election Result 2025: Congress' Qamrul Hoda Defeats BJP's Sweety Singh" (in ఇంగ్లీష్). TimelineDaily. 14 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
  2. "Bihar's Kishanganj election result 2025: INC's Md. Qamrul Hoda declared winner". The Times of India. 14 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
  3. Zee News (25 October 2019). "By-election results 2019: List of winners in 51 Assembly and Satara, Samastipur" (in ఇంగ్లీష్). Archived from the original on 9 January 2024. Retrieved 9 January 2024.
  4. "AIMIM's first MLA in Bihar joins RJD" (in ఇంగ్లీష్). Hindustan Times. 22 April 2023. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
  5. "Bihar Assembly Election Results 2025: Constituency-wise winners and runners-up" (in ఇంగ్లీష్). The Indian Express. 15 November 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
  6. "2025 Bihar Legislative Assembly Election Results: Kishanganj" (in ఇంగ్లీష్). Election Commission of India. 14 November 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.
  7. "Kishanganj Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 December 2025. Archived from the original on 31 December 2025. Retrieved 31 December 2025.