ఖర్‌గొన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Khargone జిల్లా

खरगोन ज़िला
Madhya Pradesh లో Khargone జిల్లా స్థానము
Madhya Pradesh లో Khargone జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMadhya Pradesh
పరిపాలన విభాగముIndore
ముఖ్య పట్టణంKhargone
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుKhargone
విస్తీర్ణం
 • మొత్తం8,030 కి.మీ2 (3,100 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం18,72,413
 • సాంద్రత230/కి.మీ2 (600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత63.98 per cent
 • లింగ నిష్పత్తి963
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో ఖర్‌గొన్ జిల్లా (హిందీ:खरगोन ज़िला) ఒకటి (ఇది గతంలో పశ్చిమ నిమర్ (హిందీ : पश्चिम निमाड़ ज़िला) అని పిలువబడింది) . ఖర్‌గొన్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఖర్‌గొన్ జిల్లా ఇండోర్ డివిషన్‌లోని నిమర్ రీజియన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

జిల్లాకు దీర్ఘకాల చరిత్ర ఉంది. పురాతన కాలంలో మహిష్మతి (ప్రస్తుత మహేశ్వరి) సాంరాజ్యానికి చెందిన హైహయులు ఈ ప్రాంతాన్ని పాలించారు. మధ్యయుగ ఆరంభంలో ఈ ప్రాంతం పరమర వంశస్థుల ఆధీనంలో ఉంది. మద్యయుగ చివరి కాలంలో ఈ ప్రాంతం మండూకు చెందిన మాల్వా సుల్తానేట్‌లో భాగంగా ఉంది. 1531లో ఈ ప్రాంతం గుజరాత్ సుల్తాన్ బహదూర్ షాహ్ ఆధీనంలోకి చేరింది. 1562లో అక్బర్ మాల్వా సామ్రాజ్యంతో ఈ ప్రాంతం కూడా ముగల్ సామ్రాజ్యంలో విలీనం చేయబడింది. 1740లో పేష్వా నాయకత్వంలో ఈ ప్రాంతం మరాఠీల వశం అయింది. 1778లో పేష్వా ఈ ప్రాంతాన్ని ఇండోర్‌కు చెందిన హోల్కర్లకు మరియు గ్వాలియర్‌కు చెందిన పాంవార్లకు ఈ ప్రాంతం విభజించి ఇవ్వబడింది. స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాంతం స్వతంత్ర భారతంలో విలీనం చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత ఈ ప్రాంతం ముద్యభారత్ లోని పశ్చిమ నిమర్ జిల్లాలో భాగంగా ఉండేది. ఖర్‌గొన్ జిల్లా నెర్బుధా డివిషన్‌లోభాగంగా ఉండేది. [1] 1956 నవంబరు1 ఈ జిల్లా కొత్తగా రూపొందించిన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది. 1998 మే 25న పశ్చిమ నిమర్ జిల్లాను ఖర్‌గోన్ మరియు బర్వాని జిల్లాలుగా విభజించారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 8030 చ.కి.మీ. 21°22' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 22°35' డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఉత్తర సరిహద్దులలో మహారాష్ట్ర రాష్ట్రం లోని ధార్ జిల్లా, ఇండోర్ జిల్లా మరియు దేవాస్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో ఖంద్వా జిల్లా, తూర్పు సరిహద్దులలో బురహన్పూర్ జిల్లా మరియు పశ్చిమ సరిహద్దులలో బర్వాని జిల్లా ఉన్నాయి. ఈ నగరాన్ని రాకుమారి దీపాలి పాలించింది.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఖర్‌గొన్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర .. జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

విభాగాలు[మార్చు]

 • జిల్లాలో 5 బిభాగాలు ఉన్నాయి : బర్వాహ్, బికంగావ్, కస్రవద్, ఖర్‌గొన్,
 • బర్వాహ్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : సంవద్
 • బికంగావ్ ఉపవిభాగంలో 2 తాలూకాలు ఉన్నాయి : బికంగావ్ మరియ్ ఝిరన్య
 • కస్రవద్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : కస్రవద్.
 • ఖర్‌గొన్ ఉపవిభాగంలో 4 తాలూకా ఉంది : ఖర్‌గొన్, గొగవన్, భగవాన్‌పురా మరియు సెగావ్.
 • మండలేశ్వర్ ఉపవిభాగంలో 1 తాలూకా ఉంది : మహేశ్వర్
 • జిల్లాలో 9 తాలూకాలు ఉన్నాయి :
 • జిలాకేంద్రగా ఖర్‌గొన్ పట్టణం ఉంది.
 • జిల్లాలో ఇతర ప్రధాన పట్టణాలు : మహేశ్వర్, కస్రావాద్, సెగయొన్, భగ్వంపుర, ఝిరన్య, భికంగయొన్, గొగవన్ మరియు బర్వహ్.
 • పురాతన రాజాస్థానాలైన హైహయ మరియు హోల్కార్లకు మహేశ్వర్ రాజధానిగా ఉండేది.
 • జిల్లాలో 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :
 • ఖండ్వా పార్లమెంటరీ నియోజకవర్గంలో : భుకన్‌గావ్ మరియు బద్వాన్
 • ఖర్‌గొన్ పార్లమెంటరీ నియోజకవర్గంలో : మిగిలిన జిల్లాలోని భాగం.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,872,413,[3]
ఇది దాదాపు. కొసొవొ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వెస్ట్ వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 252వ స్థానంలో ఉంది..[3]
1చ.కి.మీ జనసాంద్రత. 233 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 22.81%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 963:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 63.98%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

బరేలి పాల్యా భాషను నిమడి ప్రాంతంలో మాట్లాడుతుంటారు. బరేలి మరియు భిల్ భాషలు జిల్లాలో 10,000 ప్రజలలో వాడుకలో ఉంది.[6] మరొక బిల్ భాష అయిన బరేలి రాత్వి భాష జిల్లాలో 64,000 మంది ప్రజలకు వాడుక భాషగా ఉంది. ఈ భాష వ్రాయడానికి దేవనాగరలిపిని వాడుతుంటారు.[7] మరొక భిల్లు భాష భిలై 1,50,000 మంది ప్రజలకు వాడుకలో ఉంది. [8]

మూలాలు[మార్చు]

 1. Hunter, William Wilson, Sir, et al. (1908). Imperial Gazetteer of India, Volume 6. 1908-1931; Clarendon Press, Oxford
 2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. మూలం (PDF) నుండి 2012-04-05 న ఆర్కైవు చేసారు. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kosovo 1,825,632 July 2011 est. line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. West Virginia 1,852,994 line feed character in |quote= at position 14 (help); Cite web requires |website= (help)
 6. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bareli, Palya: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
 7. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bareli, Rathwi: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
 8. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bhilali: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: extra text (link)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఖర్‌గొన్&oldid=2801190" నుండి వెలికితీశారు