ఖలీల్ అహ్మద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖలీల్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖలీల్ ఖుర్షీద్ అహ్మద్
పుట్టిన తేదీ (1997-12-05) 1997 డిసెంబరు 5 (వయసు 26)
టోంక్, రాజస్థాన్
ఎత్తు1.86 m (6 ft 1 in)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్
పాత్రబౌలింగ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 222)2018 సెప్టెంబరు 18 - హాంకాంగ్ తో
చివరి వన్‌డే2019 ఆగస్టు 14 - వెస్టిండీస్ తో
తొలి T20I (క్యాప్ 77)2018 నవంబరు 4 - వెస్టిండీస్ తో
చివరి T20I2019 నవంబరు 10 - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–ప్రస్తుతంరాజస్థాన్
2016–2017ఢిల్లీ డేర్‌డెవిల్స్
2018–2021సన్‌రైజర్స్ హైదరాబాద్
2022-2023ఢిల్లీ క్యాపిటల్స్
కెరీర్ గణాంకాలు
పోటీ వన్ డే టీ20 ఫస్ట్-క్లాస్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 11 14 6 43
చేసిన పరుగులు 9 1 41 37
బ్యాటింగు సగటు 4.50 - 13.66 4.62
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 5 1* 18* 15
వేసిన బంతులు 480 312 1061 2004
వికెట్లు 15 13 11 67
బౌలింగు సగటు 31.00 35.30 46.72 26.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 3/13 2/27 3/33 4/35
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 3/– 1/– 7/–
మూలం: Cricinfo, 10 ఏప్రిల్ 2022

ఖలీల్ అహ్మద్, రాజస్థాన్ కు చెందిన అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు. 2018 సెప్టెంబరులో భారత క్రికెట్ జట్టులోకి అరంగేట్రం చేసాడు.[1]

జననం[మార్చు]

ఖలీల్ 1997, డిసెంబరు 5న గుజరాత్ రాష్ట్రం టోంక్ లో జన్మించాడు. తండ్రి ఖుర్షీద్ అహ్మద్ సమీపంలోని ఒక గ్రామంలో నర్సుగా చేస్తున్నాడు.[2] అతని తల్లిదండ్రులు అతను డాక్టర్ కావాలని కోరుకున్నారు, క్రికెట్ అకాడమీలో చేరడానికి ఇష్టపడలేదు.[2]

దేశీయ క్రికెట్[మార్చు]

2017, ఫిబ్రవరి 5న 2016–17 ఇంటర్ స్టేట్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో రాజస్థాన్ తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[3] ట్వంటీ20 అరంగేట్రానికి ముందు 2016 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోకి వచ్చాడు.[4] 2017, అక్టోబరు 6న 2017–18 రంజీ ట్రోఫీలో రాజస్థాన్ తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[5]

2018, జనవరిలో 2018 ఐపిఎల్ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.[6]

2018, ఫిబ్రవరి 5న 2017–18 విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్ తరపున తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[7] 2022 ఫిబ్రవరిలో 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని కొనుగోలు చేసింది.[8]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

2018 సెప్టెంబరులో 2018 ఆసియా కప్ కోసం భారత వన్డే ఇంటర్నేషనల్ జట్టుకి ఎంపికయ్యాడు.[9] 2018 సెప్టెంబరు 18న హాంకాంగ్‌పై భారతదేశం తరపున తన వన్డే అరంగేట్రం చేసాడు.[10][11][12][13]

2018 అక్టోబరులో వెస్టిండీస్‌తో జరిగినసిరీస్ కోసం భారత ట్వంటీ 20 ఇంటర్నేషనల్ జట్టులోకి అతను ఎంపికయ్యాడు.[14] 2018 నవంబరు 4న వెస్టిండీస్‌పై భారతదేశం తరపున తన అరంగేట్రం చేసాడు.[15]

మూలాలు[మార్చు]

 1. "Khaleel Ahmed". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 2. 2.0 2.1 "I tried to tell him to give up cricket… but his passion for the game grew every passing day: India U-19 seamer Khaleel Ahmed's father". The Indian Express. 24 January 2016. Retrieved 2023-08-07.
 3. "Inter State Twenty-20 Tournament, Central Zone: Railways v Rajasthan at Jaipur, Feb 5, 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 4. "Ishan Kishan to lead India at U19 World Cup". ESPNCricinfo. Retrieved 2023-08-07.
 5. "Group B, Ranji Trophy at Jaipur, Oct 6-9 2017". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 6. "List of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 7. "Group C, Vijay Hazare Trophy at Chennai, Feb 5 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 8. "IPL 2022 auction: The list of sold and unsold players". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 9. "India rest Virat Kohli for Asia Cup, Rohit Sharma to lead; uncapped Khaleel Ahmed called up". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 10. "4th Match, Group A, Asia Cup at Dubai, Sep 18 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 11. "Asia Cup 2018: Inclusion of Left-arm pacer Khaleel Ahmed makes right impression for India". Retrieved 2023-08-07.
 12. "Asia Cup 2018 - India vs Pakistan: Khaleel Ahmed emulates idol Zaheer Khan on debut, Pakistan next on radar". 19 September 2018. Retrieved 2023-08-07.
 13. "Cricket scorecard - India vs Hong Kong, 4th Match, Group A, Asia Cup 2018". Cricbuzz. Retrieved 2023-08-07.
 14. "Dhoni not part of T20I squad to face West Indies and Australia". ESPN Cricinfo. Retrieved 2023-08-07.
 15. "1st T20I (N), West Indies tour of India at Kolkata, Nov 4 2018". ESPN Cricinfo. Retrieved 2023-08-07.

బయటి లింకులు[మార్చు]