ఖాగెన్ ముర్ము
| ఖాగెన్ ముర్ము | |||
| ప్రస్తుత పదవిలో | |||
| అధికార కాలం 2019 మే 23 | |||
| ముందు | మౌసమ్ నూర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | మల్దహా ఉత్తర | ||
| పదవీ కాలం 2006 – 2019 | |||
| ముందు | జాదు హెంబ్రోమ్ | ||
| తరువాత | జోయెల్ ముర్ము | ||
| నియోజకవర్గం | హబీబ్పూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1960 ఫిబ్రవరి 2 షేఖ్పారా, మాల్డా జిల్లా, పశ్చిమ బెంగాల్ , భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ (2019 - ప్రస్తుతం) | ||
| ఇతర రాజకీయ పార్టీలు | సిపిఐ (ఎం) (1986 - 2019) | ||
| జీవిత భాగస్వామి | మంజు కిస్కు | ||
| సంతానం | 4 | ||
| నివాసం | మోక్దుమ్ పూర్, మాల్దా, పశ్చిమ బెంగాల్ | ||
| పూర్వ విద్యార్థి | మగధ విశ్వవిద్యాలయం (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| సంతకం | |||
| మూలం | |||
ఖాగెన్ ముర్ము (జననం 2 ఫిబ్రవరి 1960) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మల్దహా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]ఖాగెన్ ముర్ము కమ్యూనిస్టు పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి బిద్యుత్ కర్మద్ఖాగా 2 సార్లు జిల్లా పరిషత్ సభ్యుడిగా, 1993 నుండి 2003 వరకు మాల్డా జిల్లా పరిషత్ నుండి సహకారి సభాపతిగా పని చేసి 2006, 2011 & 2016 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో హబీబ్పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
ఖాగెన్ ముర్ము 2019లో భారతీయ జనతా పార్టీలో చేరి[2] 2019లో జరిగిన లోక్సభ ఎన్నికలలో మల్దహా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి మౌసమ్ నూర్పై 84,288 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్లో విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖలకు శాశ్వత ప్రత్యేక ఆహ్వానితుడిగా, జల్ శక్తి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యుడిగా పని చేశాడు.[3]
ఖాగెన్ ముర్ము 2024 లోక్సభ ఎన్నికలలో మల్దహా ఉత్తర లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసూన్ బెనర్జీపై 77,708 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "Khagen Murmu" (in ఇంగ్లీష్). The Indian Express. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "6th MLA joins BJP along with party councillors in West Bengal" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 19 June 2019. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Santhali Leader Khagen Murmu Renominated From Maldaha Uttar" (in ఇంగ్లీష్). TimelineDaily. 22 March 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "2024 Loksabha Elections Results - Maldaha Uttar" (in ఇంగ్లీష్). Election Commission of India. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
- ↑ "Maldaha Uttar Constituency Lok Sabha Election Results 2014 - 2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.