ఖాట్మండు దర్బార్ స్క్వేర్
| ఖాట్మండు దర్బార్ స్క్వేర్ | |
|---|---|
![]() Interactive map of ఖాట్మండు దర్బార్ స్క్వేర్ | |
| 27°42′15″N 85°18′23″E / 27.70415°N 85.30647°E | |
| ప్రదేశం | కాట్మండు, నేపాల్ |
| చరిత్ర | |
| Built | 4వ నుండి 8వ శతాబ్దం వరకు |
| Site notes | |
| విస్తీర్ణం | 167.37 ha |
Architectural style | నెవార్ వాస్తుశైలి |
| రకం | సాంస్కృతిక |
| క్రైటేరియా | iii, iv, vi |
| గుర్తించిన తేదీ | 1979 |
| దీనిలో భాగం | కాఠ్మండు లోయ |
| రిఫరెన్సు సంఖ్య. | 121 |
ఖాట్మండు దర్బార్ స్క్వేర్ (ఆంగ్లం: Kathmandu Durbar Square), నేపాల్ లోని ఖాట్మండులో చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా ముఖ్యమైన ప్రదేశం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించిన నేపాల్లోని ఖాట్మండు లోయలో ఉన్న మూడు దర్బార్లలో ఇది ఒకటి.
ఈ కూడలి నిర్మాణం 3వ శతాబ్దంలో ప్రారంభమైనప్పటికీ, దానిలోని ప్రధాన నిర్మాణాలు తరువాతి కాలంలో పూర్తిచేయబడ్డాయి. బయటి ప్రాంగణంలో మల్ల రాజుల పాలనలో నిర్మించిన 16వ శతాబ్దపు అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ భవనాలు నెవార్ వాస్తుశిల్పం లక్షణమైన ఖచ్చితమైన చెక్కిన ముఖభాగాలతో అలంకరించబడ్డాయి. సెంట్రల్ స్క్వేర్ చుట్టూ మల్ల, షా కాలంలో నిర్మించిన రాజభవన సముదాయాలు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది నౌటల్లే దర్బార్, ఇది నేపాల్ ఏకీకరణ జ్ఞాపకార్థం పృథ్వీ నారాయణ్ షా నిర్మించిన తొమ్మిది అంతస్తుల రాజభవనం.
ముఖ్యమైన భవనాలు
[మార్చు]- హనుమాన్ ధోక ప్యాలెస్ కాంప్లెక్స్
నాసల్ చౌక్, ముల్ చౌక్ వంటి బహుళ ప్రాంగణాలతో రాజ నివాసం.
- కుమారి బహల్ / ఘర్
దర్బార్ స్క్వేర్ దక్షిణ భాగాన కుమారి చౌక్ / కుమారి బహల్ అనే మూడు అంతస్తుల ఆలయం ఉంది. ఈ మల్ల యుగం ఆలయాన్ని హిందూ దేవత దుర్గమ్మ సజీవ అవతారంగా పూజించే కుమారి నెలకొని ఉంది.[1]
- తలేజు ఆలయం
- జగన్నాథ ఆలయం
- కాష్టమండప్
- కల్ భైరవ్ విగ్రహం
భూకంపం వల్ల నష్టం
[మార్చు]2015 ఏప్రిల్ 25న, 7.9 తీవ్రతతో సంభవించిన భూకంపం ఈ ప్రాంతాన్ని తాకి, స్క్వేర్ను తీవ్రంగా దెబ్బతీసింది, అనేక భవనాలను శిథిలాలుగా మార్చింది, వీటిలో అత్యంత ప్రముఖమైనది శతాబ్దాల నాటి చెక్క నిర్మాణం, కాష్టమండప్.[2][3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Kathmandu Durbar Square". Atlas Obscura. 2019-03-11. Retrieved 2023-06-25.
- ↑ "Nepal landmarks flattened by the quake". BBC News. Retrieved April 25, 2015.
- ↑ Setopati, सुजिता कार्की. "हनुमानढोका दरबार क्षेत्रका अधिकांश सम्पदा पुनर्निर्माण भएनन्". Setopati. Archived from the original on 2 డిసెంబర్ 2021. Retrieved 20 May 2019.
{{cite web}}: Check date values in:|archive-date=(help)
