ఖాదీ అర్థశాస్త్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఖాదీ అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని మహాత్మా గాంధీ రచించగా కొడాలి ఆంజనేయులు అనువదించారు.[1].

రచనా నేపథ్యం[మార్చు]

ఖద్దరు భారత జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్వదేశీ వస్తువులే ఉపయోగించమని, అందులో ముఖ్యమైన భాగంగా ఖద్దరునే మిల్లుబట్టలకు ప్రత్యామ్నాయంగా ధరించమని మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు భారతీయులను కదిలించింది.[2] వారు ఖాదీ ధరించడమే కాక స్వయంగా నూలు వడికేవారు. ఈ ప్రయత్నంతో ఆయన భారతదేశంలో జరుగుతున్న మిల్లు దుస్తుల దోపిడీ, తద్వారా బ్రిటీష్ ప్రభుత్వానికి ఆదాయాలకు అడ్డుకట్ట వేశారు. పైగా ఖద్దరు కట్టుకోవడం ద్వారా భారతీయ జాతీయోద్యమానికి తేలికగా మద్దతునివ్వవచ్చన్న భావన వ్యాపింపజేశారు. ఈ ఖాదీని ఆయన తన జాతీయోద్యమానికి సంబంధించిన నిర్మాణాత్మక పనుల్లో భాగంగా పలువురు కార్యకర్తల చేత తమ తమ స్వగ్రామాల్లో అమలుచేయించేవారు. దేశవ్యాప్తంగా ఎందరో జాతీయోద్యమకారులు ఖాదీ, జాతీయవిద్య వంటి కార్యక్రమాలను చేపట్టి మౌలికంగా ఉద్యమాన్ని బలోపేతం చేసే ప్రయత్నాలు చేసేవారు.
ఈ నేపథ్యంలో మహాత్మాగాంధీ ఖద్దరు ద్వారా ఆర్థికంగా జరిగిన మార్పులను. ఖద్దరు మౌలికంగా భారతదేశ వ్యవస్థలో తీసుకువచ్చే తేడాలను వివరిస్తూ ఈ గ్రంథానికి మూలమైన పుస్తకాన్ని రచించారు. 1958లో కొడాలి ఆంజనేయులు ఆ గ్రంథాన్ని ఈ రూపంలో తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదానికి మహాత్మా గాంధీ రచనల హక్కులు కలిగివున్న నవజీవన్ ట్రస్ట్, అహ్మదాబాద్ వారి అనుమతి స్వీకరించి, మద్రాసు ప్రభుత్వ ముద్రణాలయ సూపరింటెండ్‌చే ప్రచురణ పొందింది.[1]

విషయాలు[మార్చు]

భారతదేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం పేరుతో ప్రారంభమైన చరఖా, ఖద్దరు వాడకం ఉద్యమం యొక్క జయాపజయాలు, ఖద్దరు పరిశ్రమలో దేశవ్యాప్తంగా చవిచూసిన లాభనష్టాలు వంటివి ఇందులో వివరించారు. స్వదేశీ అన్న అధ్యాయంతో ఖద్దరు వాడకం వెనుకనున్న మౌలిక తత్త్వం మొదలుకొని 204 అధ్యాయాలలో చరఖా, ఖాదీల గురించిన అనేక ఆర్థిక, రాజకీయపరమైన అంశాలు విశదీకరించారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 ఖాదీ అర్థశాస్త్రం:మూ.మహాత్మాగాంధీ, అ.కొడాలి ఆంజనేయులు:1958
  2. సెలిన్, హెలైన్ (1997). ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిస్టరీ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ, అండ్ మెడిసిన్స్ ఇన్ నాన్-వెస్టర్న్ కల్చర్స్. నెదర్లాండ్: క్లువెర్ అకడమిక్ పబ్లిషర్స్. p. 961. ISBN 0792340663.