Jump to content

ఖార్దుంగ్ లా కనుమ

అక్షాంశ రేఖాంశాలు: 34°16′42″N 77°36′15″E / 34.27833°N 77.60417°E / 34.27833; 77.60417
వికీపీడియా నుండి
ఖార్దుంగ్ లా
ఖార్దుంగ్ లా
ప్రదేశంలడఖ్, భారత్
శ్రేణిహిమాలయాలు, లడఖ్ శ్రేణి
Coordinates34°16′42″N 77°36′15″E / 34.27833°N 77.60417°E / 34.27833; 77.60417
ఖార్దుంగ్ లా is located in Ladakh
ఖార్దుంగ్ లా
ఖార్దుంగ్ లా స్థానం
ఖార్దుంగ్ లా is located in India
ఖార్దుంగ్ లా
ఖార్దుంగ్ లా (India)

ఖార్దుంగ్ లా (ఖార్దుంగ్ కనుమ, లా అంటే టిబెట్ భాషలో కనుమ) అనేది లడఖ్ కేంద్రపాలిత ప్రాంతపు లేహ్ జిల్లాలోని ఒక కనుమ. స్థానిక ఉచ్చారణలో "ఖార్దోంగ్ లా" అనీ, "ఖార్ద్‌జోంగ్ లా" అనీ అంటారు.

లడఖ్ శ్రేణిలో ఉన్న ఈ కనుమ లేహ్‌కు ఉత్తరాన ఉంది. ఇది ష్యోక్, నుబ్రా లోయలకు ముఖద్వారం. సియాచిన్ హిమానీనదం. 1976 లో నిర్మించిన ఈ కనుమ దారిని 1988 లో పబ్లిక్ మోటారు వాహనాలు వెళ్ళేందుకు తెరిచారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్న ఈ కనుమ భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. సియాచిన్ హిమానీనదానికి సామాగ్రిని ఈ కనుమ గుండానే తీసుకు వెళ్తారు.

ఖార్దుంగ్ లా ఎత్తు 5,359 మీ. (17,582 అ.) . [1] స్థానిక రోడ్డు సూచికలు, లేలో చొక్కాలు విక్రయించే డజన్ల కొద్దీ దుకాణాలూ దాని ఎత్తు 5,602 మీ. (18,379 అ.) అనీ, ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాహనయోగ్య కనుమ అనీ తప్పుగా పేర్కొంటాయి.

చరిత్ర

[మార్చు]

ఖార్డాంగ్ లా చారిత్రికంగా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది లేహ్ నుండి మధ్య ఆసియాలోని కష్గర్ వరకు ఉన్న ప్రధానమైన వర్తక బిడారు మార్గంలో ఉంది. ఏటా సుమారు 10,000 గుర్రాలు, ఒంటెలు ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తాయి. కొద్దిపాటి సంఖ్యలో బాక్టీరియన్ ఒంటెలను ఇప్పటికీ ఈ కనుమకు ఉత్తరాన ఉన్న హండర్ వద్ద చూడవచ్చు. 1950 ల ప్రారంభంలో, విలియం ఓ. డగ్లస్ ఇలా రాసాడు "సింధును దాటిన తరువాత, ఈ దారి రెండుగా విడిపోతుంది. ఒక దారి నది అంచున స్పిటోక్, ఖలాట్సే, ఖార్గిల్ వైపుకు వెళుతుంది. మరొకటి ఉత్తరాన లేహ్, ఖార్దుంగ్ లా (... ), యార్కండ్, పురాతన వాణిజ్య కేంద్రమైన సింకియాంగ్ వైపుగా వెళ్తుంది." [2] అతను ఇంకా ఇలా అన్నాడు, "లేహ్ చారిత్రిక బిడారు మార్గంలో ఉంది. ఇది సింకియాంగ్‌లోని యార్కండ్‌కు మాత్రమే కాకుండా టిబెట్‌లోని లాసాకు కూడా దారితీస్తుంది. (...) ఉన్ని, వెండి, ఫెల్ట్స్, టీ, మిఠాయి, తోళ్ళు, వెల్వెట్లు, పట్టు, బంగారం, తివాచీలు, కస్తూరి, పగడాలు, బోరాక్స్, జేడ్ కప్పులు, ఉప్పు మొదలైనవి ఉత్తరం నుండి వస్తాయి. నూలు వస్తువులు, శాలువాలు, బ్రోకేడ్లు, నల్లమందు, నీలం, బూట్లు, ముత్యాలు, అల్లం, లవంగాలు, మిరియాలు, తేనె, పొగాకు, చెరకు, బార్లీ బియ్యం, గోధుమ, మొక్కజొన్న దక్షిణం నుండి వస్తాయి." [3] రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఈ మార్గం ద్వారా చైనాకు యుద్ధ సామగ్రిని పంపే ప్రయత్నం జరిగింది.

స్థానం

[మార్చు]
ఖార్దుంగ్ లా వద్ద ఒక స్మారక చిహ్నం
ఖార్దుంగ్ లా కార్యాలయం, దుకాణం

ఖార్దుంగ్ లా, లేహ్ నుండి రహదారి ద్వారా 39 కి.మీ. దూరంలో ఉంది. గతంలో, దక్షిణ పుల్లు చెక్ పాయింట్ వరకు ఉన్న మొదటి 24 కి.మీ. పక్కా రోడ్డు ఉండేది. అక్కడి నుంచి ఉత్తర పుల్లు చెక్‌పాయింట్‌ (కనుమకు అవతలి వైపు) వరకు ఉన్న 15 కి.మీ. రహదారి ప్రధానంగా వదులుగా ఉన్న రాళ్ళూ మట్టితో అప్పుడప్పుడు కరిగిన మంచుతో కూడుకుని ఉండేది. ఇప్పుడు, ఈ దారి అంతా పక్కా రోడ్డు వేసారు. నుబ్రా లోయకు వెళ్ళే రహదారి చాలా చక్కగా ఉంటుంది. అద్దె వాహనాలు (రెండు, నాలుగు-చక్రాల వాహనాలు), భారీ ట్రక్కులు, మోటారు సైకిళ్ళు నుబ్రా లోయలోకి వెళ్తూంటాయి. ప్రయాణికుల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

5,359 మీటర్ల కొలత వందలాది GPS సర్వేల ద్వారా వచ్చింది. SRTM డేటా, ASTER GDEM డేటా, రష్యన్ టోపోగ్రాఫిక్ మ్యాపింగ్‌ లతో ఇది సరిపోతుంది. ఇది అనేక GPS రిపోర్టులతో సరిపోతుంది.

చేరుకునే మార్గాలు

[మార్చు]

సమీపం లోని చెప్పుకోదగ్గ పట్టణం లేహ్. మనాలి, శ్రీనగర్ నుండి లేహ్‌కు రోడ్డు సౌకర్యం ఉంది. ఢిల్లీ నుండి రోజువారీ విమానాలు నడుస్తాయి. లేహ్ నుండి ఖార్దుంగ్ లా మీదుగా నుబ్రా వ్యాలీకి రోజువారీ బస్సులు నడుస్తాయి.మోటారు సైకిల్ ద్వారా, కారు ద్వారా కూడా చేరుకోవచ్చు. ఖార్దుంగ్ లాకు ఇరువైపులా ఉన్న రెండు స్థావరాలు ఉత్తర పుల్లు, దక్షిణ పుల్లు.

లేహ్‌లోని జిల్లా కమిషనర్ కార్యాలయంలో ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్‌పి) ను తీసుకోవచ్చు. ఇది పర్యాటకులకు అవసరం, లడఖ్ పౌరులకు అవసరం లేదు. దారిలోని తనిఖీ కేంద్రాల వద్ద ఈ అనుమతి ఫోటోకాపీలను సమర్పించాల్సి ఉంటుంది.

ఎత్తైన ప్రదేశాలు అలవాటు లేని వారికి, ఎత్తుల అనారోగ్యం అనేది తీవ్రమైన ఆరోగ్య సమస్య. కొంతమందికి ఎసిటజోలమైడ్ వంటి నిరోధక మందులు వెంట తీసుకువెళ్ళడం అవసరం కావచ్చు. ఎందుకంటే ఈ మార్గం వెంట చికిత్స చేయడానికి అత్యవసర వైద్య సదుపాయాలు లేవు.

మంచు కారణంగా రహదారిని సుమారు అక్టోబరు నుండి మే వరకు మూసివేస్తారు. ఇరుకైన సింగిల్ రోడ్డు విభాగాలు, వాషౌట్‌లు, కొండచరియలు, రహదారి ప్రమాదాలు, ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణాలు ఆలస్యం అవుతాయి.

వాతావరణం

[మార్చు]

ఖార్దుంగ్ లా లో ఆర్కిటిక్ టండ్రా శీతోష్ణస్థితి ఉంటుంది. స్వల్ప కాలం పాటు చల్లని వేసవి కాలం, సుదీర్ఘ కాలం పాటు బాగా చల్లటి శీతాకాలం ఇక్కడ సాధారణం.

శీతోష్ణస్థితి డేటా - Khardung La
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
సగటు అధిక °C (°F) −19
(−2)
−18
(0)
−14
(7)
−11
(12)
−5
(23)
1
(34)
7
(45)
7
(45)
1
(34)
−8
(18)
−14
(7)
−18
(0)
−8
(19)
సగటు అల్ప °C (°F) −36
(−33)
−34
(−29)
−31
(−24)
−25
(−13)
−15
(5)
−9
(16)
−6
(21)
−6
(21)
−10
(14)
−18
(0)
−25
(−13)
−31
(−24)
−20
(−5)
సగటు అవపాతం mm (inches) 29
(1.1)
41
(1.6)
53
(2.1)
38
(1.5)
28
(1.1)
9
(0.4)
9
(0.4)
8
(0.3)
8
(0.3)
8
(0.3)
13
(0.5)
22
(0.9)
266
(10.5)
Source: [4]

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. DGPS Document supplied by the Cartographic Institute of Catalonia
  2. Douglas, William O. (William Orville) (1953). Beyond the High Himalayas. [An account of a journey to Afghanistan and Ladakh.] London. OCLC 559521308. the trail, after crossing the Indus, divides, one fork going south along the river's edge to Spitok, Khalatse and Khargil, the other turning north to Leh, the Khardong Pass (18, 380 feet), and Yarkand, an ancient trading center of Sinkiang.
  3. Douglas, William O. (William Orville) (1953). Beyond the High Himalayas. [An account of a journey to Afghanistan and Ladakh.] London. OCLC 559521308. Leh is on a historic caravan route that leads not only to Yarkand in Sinkiang but to Lhasa in Tibet. (...) the stream of trade. Wool, silver, felts, tea, candy, skins, velvets, silk, gold, carpets, musk, coral, borax, jade cups, salt came down from the north. Cotton goods, shawls, brocades, opium, indigo, plumes, shoes, pearls, ginger, cloves, pepper, honey, tobacco, suger cane, barley rice, wheat, corn came up from the south.
  4. https://www.meteoblue.com/en/weather/forecast/modelclimate/khardūng-la_india_1266938