ఖుర్షీద్ జా దేవిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుర్షీద్ జా దేవిడి
సాధారణ సమాచారం
రకంరాజభవనం
ప్రదేశంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

ఖుర్షీద్ జా దేవిడి, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న ప్యాలెస్. యూరోపియన్ శైలి నిర్మించిన ఈ భవనం. పైగాహ్ వంశస్థులు ఖుర్షీద్ జా బహదూర్ పూర్వీకులు నిర్మించారు.[1] చారిత్రాత్మక చార్మినార్ నుండి కిలోమీటర్ దూరంలో ఉన్న హుస్సేనీ ఆలమ్ వద్ద ఈ భవనం ఉంది. 19వ శతాబ్దం చివరలో ఇదే కాంపౌండ్‌లో హుస్సేనీ ఆలం ప్రభుత్వ బాలికల కళాశాల ఏర్పాటుచేశారు.

చరిత్ర[మార్చు]

నవాబ్ ఖుర్షీద్ జా బహదూర్ తాత, షమ్స్-ఉల్-ఉమారా అమీ-ఇ-కబీర్ చేత రూపొందించబడిన ఈ భవనం, ఖుర్షీద్ తండ్రి రషీదుద్దీన్ ఖాన్ పూర్తి చేశాడు. ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి యూరోపియన్ దేశాల నుండి చేతివృత్తుల వారిని తీసుకువచ్చారు. ఒకప్పుడు పైగా రాయల్స్ కుటుంబికులు నివసించే పాత నగరంలో ఉన్న రెండు అంతస్థుల నిర్మాణం ఇది. పల్లాడియన్ ఆర్కిటెక్చర్ లో నిర్మించిన ఉత్తమ నిర్మాణాలలో ఇదీ ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ భవనం లోపల పెద్ద స్తంభాలు, యూరోపియన్ డిజైన్ అంతస్తులు ఉన్నాయి. ఒకప్పుడు ఖరీదైన తివాచీలు, ప్రత్యేకమైన షాన్డిలియర్‌లతో అలంకరించేవారు. ఆ కాలంతో భవనం ముందుభాగంలో తారా హౌజ్‌తో తోట, పువ్వులు, నక్షత్రం ఆకారంలోని ఫౌంటైన్లతో నిండివుండేవి.

నిర్మాణం[మార్చు]

బరదరి (పన్నెండు తలుపులు) అనే పేరును సూచిస్తున్నప్పటికీ ఈ భవనంలో కేవలం ఐదు తలుపులు మాత్రమే ఉన్నాయి. ఈ భవనాన్ని 'దేవిడి' లేదా 'లార్డ్స్ హౌస్' అని కూడా పిలుస్తారు. ప్రవేశద్వారంలో సుమారు 40 అడుగుల ఎత్తులో ఎనిమిది కొరింథియన్ స్తంభాలు ఉన్నాయి. భవనం లోపల ఎలిప్టికల్ వంపులు, కొన్ని ప్రాంతాల్లో చెక్కతో చేసిన ఫ్లోరింగ్ ఉన్నాయి. వరండాలో వివిధ రంగుల్లో ఉన్న అందమైన టైల్స్ ఉన్నాయి. అదే కాంపౌండ్‌లో ఇష్రత్ మహల్ (కోర్టు గది) ఉండేది. మీర్ ఆలం ట్యాంక్ నుండి ఒక ప్రత్యేక లైన్ ద్వారా ఈ భవనానికి నీరు సరఫరా చేయబడేది.

ప్రస్తుతం[మార్చు]

హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ ఈ భవనాన్ని గ్రేడ్ -3 వారసత్వ కట్టడంగా పరిగణించింది. వారసత్వ పునరుద్ధరణ కోసం అనేక డిమాండ్లు ఉన్నప్పటికీ, ఒకప్పుడు పైగా ప్రభువుల నివాసంగా ఉన్న ఖుర్షీద్ జా దేవిడి ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.[2][3]

ఈ భవన ముందుభాగంలో క్రీడాకారులు మైదానంగా ఉపయోగిస్తున్నారు. దీనిని సినిమా షూటింగులకు తరచుగా ఉపయోగిస్తుంటారు. షూటింగ్ చేసేటపుడు తమ వీలుకోసం తలుపులు తొలగించడం, గోడలపై పెయింటింగ్‌ వేయడం వంటివి చేస్తున్నారు. దానివల్ల ఈ భవనానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది.[4][5] దీని కింది అంతస్తులో 60 ఏళ్ళనుండి ఒక కుటుంబం నివసిస్తూ, భవన సంరక్షకులుగా ఉంటున్నారు.

మూలాలు[మార్చు]

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  1. Andhra Pradesh (2014-07-16). "Khursheed Jah Devdi cries for attention". The Hindu. Retrieved 2021-08-20.
  2. "Devdi Khurshid Jah in a state of dilapidation". Siasat.com. 2013-01-12. Retrieved 2021-08-20.
  3. "150 year old palace in ruins, but authorities continue to neglect Khursheed Jah Devdi". The News Minute. 2017-01-16. Retrieved 2021-08-20.
  4. Jan 11, TNN /; 2017; Ist, 08:13. "Khursheed Jah Devdi: Locals see red over film shoots in Paigah ruins | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. Jan 8, Omar bin Taher / TNN /; 2018; Ist, 09:12. "Khursheed Jah Devdi: Khursheed Jah Devdi in dire need of renovation | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)