ఖేడా సత్యాగ్రహం (1918)
ఖేడా సత్యాగ్రహం 1918 సంవత్సరం భారతదేశంలోని గుజరాత్ లోని ఖేడా జిల్లాలో బ్రిటీషు రాజ్ కాలంలో మహాత్మా గాంధీచే ప్రేరణ పొందిన మూడవ సత్యాగ్రహ ఉద్యమంగానూ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రధాన తిరుగుబాటుగానూ ప్రత్యేకత సంతరించుకుంది. చంపారన్ సత్యాగ్రహం, అహ్మదాబాద్ మిల్లు సమ్మెకు ముందు ఇది రెండవ సత్యాగ్రహ ఉద్యమంగా మరొక ప్రత్యేకత కలిగి ఉంది. ఖేడా జిల్లాలోని రైతులకు మద్దతుగా గాంధీజీ ఈ ఉద్యమాన్ని నిర్వహించాడు. పంటల వైఫల్యం, ప్లేగు, అంటువ్యాధుల కారణంగా బ్రిటీషు వారు విధించిన పన్నులను ఖేడా ప్రజలు చెల్లించలేకపోయారు.[1][2][3]
నేపథ్యం
[మార్చు]1917 నవంబరు 15న చుట్టుపక్కల అనేక గ్రామాల నుంచి 18 వేలమంది వ్యవసాయదారుల సంతకాలు సేకరించి "అతివృష్టి వల్ల పంటలు నాశనం కావడంతో మొత్తం దిగుబడి 25 శాతం కన్నా తక్కువ ఉందనీ, ప్రభుత్వం రివాజు ప్రకారం ఈ ఏడాది పన్నువసూళ్ళను వాయిదా వేయాలనీ" కోరుతూ మోహన్‌లాల్ పాండ్యా, శంకరలాల్ పారీఖ్ల నాయకత్వంలో కతాలాల్ వ్యవసాయదారులు ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ దరఖాస్తును సమర్థిస్తూ 22 వేలమంది రైతులు దస్ఖతు వేశారు. కలెక్టరుకు నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారం ఉందనీ, అన్నీ ఆలోచించే అతను ఈ నిర్ణయానికి వచ్చాడంటూ బొంబాయి ప్రభుత్వం దరఖాస్తును తోసిపుచ్చింది.[4] ఈ అంశంపై ఏ అభ్యర్థన అయినా కలెక్టరే పరిశీలించగలడంటూ బాంబే ప్రభుత్వం తెలియపరిచింది.[5]
నిజానికి, ఏడాదిపాటు పన్ను వసూలును వాయిదా వేయడం వల్ల ప్రభుత్వానికి వడ్డీ నష్టం తప్ప పెద్ద ఇబ్బందిలేకపోయినా ఈ డిమాండుకు ఒప్పుకుంటే రైతుల దృష్టిలో జాతీయోద్యమ నాయకులకు ఘనత లభిస్తుందన్న ఆలోచనతో అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. నవంబరులో గాంధీ సూచనల మేరకు గ్రామగ్రామానా పన్నుల వసూలు సబబు కాదన్న అంశాన్ని చర్చిస్తూ సమావేశాలు ఏర్పాటయ్యాయి. ఒకానొక సమావేశంలో తీర్మానించినదాని ప్రకారం గుజరాత్ నుంచి ఎన్నికైన ప్రతినిధులు గోకుల్దాస్ పారేఖ్, విఠల్‌భాయ్ పటేల్ డిసెంబరులో నడియాడ్ వచ్చి అనేక గ్రామాల్లో పర్యటించారు. పరిస్థితులు అవగాహన చేసుకుని, రైతుల నుంచి 409 వాంగ్మూలాలు సేకరించి వాదనపై సంతృప్తి కలిగాకానే రైతు ప్రతినిధులతో పాటుగా కలెక్టరును కలిశారు. నిరుపేదలూ, వెనుకబడిన వర్గాలవారూ అయిన రైతుల పన్నులు మాఫీ చేసి, మిగిలినవారి పన్నులు ఏడాదిపాటు వాయిదావేయమని వారు కోరారు.[4][6]
డిసెంబరు 22న 104 గ్రామాల్లో వసూలు కావాల్సిన 23 లక్షల రూపాయల పన్నులో కేవలం 7.4 శాతమైన 1.75 లక్షల రూపాయలు మాత్రమే తర్వాతి వాయిదా వేస్తూ కలెక్టరు నిర్ణయం ప్రకటించాడు. మిగిలిన పన్ను వసూళ్ళు యథాతథంగా కొనసాగేట్టు నిర్ణయించాడు. ఈ నిర్ణయం తర్వాత ప్రభుత్వ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో ప్రజలను పన్ను వసూళ్ళ కోసం తీవ్రంగా పీడిస్తూ, దారుణమైన భాష వాడుతూ అవమానించసాగారు. అక్రమంగా నిర్బంధించడం, శారీరకంగా హింసించడం వంటి చర్యలకు సైతం పాల్పడుతూ పన్ను వసూళ్ళకు దిగారు. ఎలాగైనా పన్నులు వసూలు చేయాలనీ, పన్నుల వసూళ్ళను వ్యతిరేకిస్తున్న సంస్థల సభ్యుల వివరాలు చెప్పాలనీ ఉద్యోగులపై ఒత్తిడితెస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశాడు.[4] మొత్తానికి కలెక్టర్ కన్నా ప్రభుత్వానికి ఎక్కువ విధేయులమని మామ్లాత్దారులు, మామ్లాత్దారుల కన్నా ఎక్కువ విధేయులమని తలాతీలు చూపించుకోవాలని ప్రయత్నిస్తూ అందరూ పేద రైతులను పీడించసాగారు.[6]
ఉద్యమం
[మార్చు]ఒకవైపు మిగిలిన గ్రామాల్లో మామ్లాత్దారూ, తలాతీలు సాగిస్తున్న ఆగడాలు కతాలాల్ గ్రామంలో మాత్రం వీలుకాలేదు. రైతు ఉద్యమానికి నాయకుడైన పాండ్యా స్వగ్రామం అది. అక్కడ మాత్రం రైతులెవరూ శిస్తు చెల్లించలేదు. కనీసం సగమైనా చెల్లించమని అధికారులు రాజీకి వచ్చినా రైతులు అది కూడా చెల్లించలేదు.[7]
గుజరాత్ సభ కార్యదర్శులు, ఇతర సభ్యులు గ్రామాల్లో పర్యటించి రూపొందించిన నివేదిక ఆధారంగా పన్నుల వసూలును, కొన్ని కేసుల్లో పన్ను మాఫీని కోరుతూ బొంబాయి ప్రభుత్వాన్ని సభ కోరుతూ లేఖ రాసింది. 1918 జనవరి 1న అహ్మదాబాద్‌కు తిరిగివచ్చిన గాంధీ రైతు నాయకులూ, రైతులూ చెప్పినదంతా విని బాంబే ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చేవరకూ రైతులను శిస్తు చెల్లించవద్దనీ, తమ ఈ వైఖరి గురించి గుజరాత్ సభ వారు ప్రాట్‌కు తెలియపరచమనీ సూచించాడు.[7]
బాంబే ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే తర్వాత పన్నుల చెల్లింపు మానేసి సత్యాగ్రహ ఉద్యమం చేయాలా వద్దా, చేస్తే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఉండొచ్చు అన్న అంశంపై వల్లభ్‌భాయ్ పటేల్ ఇంట్లో గుజరాత్ సభ కార్యవర్గ సమావేశం ఎనిమిది రోజుల పాటు జరిగింది. దానిలో గాంధీ పాల్గొనలేదు కానీ చర్చల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ రెండు సూచనలు చేశాడు. ఒకటి - మొత్తం కార్యవర్గం ఏకగ్రీవంగా నిర్ణయిస్తే తప్ప శాసనోల్లంఘన చేయమని రైతులను కోరవద్దనీ, రెండు - గుజరాత్ సభ సభ్యుల్లో కనీసం ఒకరైనా ఈ కార్యక్రమం కోసం పూర్తి సమయాన్ని కేటాయించడానికి సిద్ధపడాలనీ. ఈ రెండు షరతులూ సాధ్యమైతేనే తాను నాయకత్వం వహించగలనని గాంధీ సూచించాడు.[7][8]
నాయకులు
[మార్చు]గుజరాతులో మహాత్మా గాంధీ ఆ పోరాటానికి ఆధ్యాత్మికంగా ఆధిపత్యం వహించాడు. ఆయన కుడిభుజం వంటి కార్యకర్త సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీయ భావంతో అంకితం భావంతో పనిచేసే ఇంద్రుల్ యాగ్నిక్, శంకర్ లాల్ బ్యాంకర్, మహదేవ్ దేశాయ్, నరహరి పారిఖ్, మోహన్ లాల్ పాండ్య, రవిశంకర్ వ్యాస్ గ్రామకార్యకర్తలు కలిసి ఈ సత్యాగ్రహం నిర్వహించారు. వారికి రాజకీయ నాయకత్వం, మార్గదర్శక అధికారం ఇచ్చారు.[3] అహ్మదాబాదు వదోదర నగరాల నుండి అనేక మంది గుజరాతీయులు తిరుగుబాటు నిర్వాహకులలో చేరారు. గాంధీ, పటేల్ పూర్తిగా గుజరాతీయుల పోరాటంలో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాలకు చెందిన భారతీయుల పాత్రను నిరాకరించారు.
ఘర్షణ
[మార్చు]పటేల్, అతని సహచరులు బృహత్తరమైనపన్ను తిరుగుబాటును నిర్వహించారు. ఖేడాలోని వివిధ జాతి, కుల వర్గాలు తిరుగుబాటు పట్ల ఆసక్తులయ్యారు. ఖేడా రైతులు ఈ సంవత్సరం సంభవించిన కరువును కారణంగా చూపుతూ పన్ను రద్దు చేయాలని పిటిషన్ సమర్పించాలని పిలుపునిచ్చారు. బొంబాయి ప్రభుత్వం చార్టర్‌ను తిరస్కరించింది. రైతులు పన్ను చెల్లించకపోతే భూములు ఆస్తులు జప్తు చేయబడతాయని, చాలామంది ఖైదు చేయబడతారని, ఒకసారి జప్తు చేయబడి ఆస్తులు వారు చాలా కట్టుబడి ఉన్నా వారికి తిరిగి ఇవ్వబడదు అని హెచ్చరించారు.
ఆస్తులు, పశువులను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం అధికారులు, ఇన్స్పెక్టర్లను పంపాబడ్డారు. పోలీసులు భూములు, వ్యవసాయ భూములు, ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. రైతులు ఖైదును అడ్డుకోలేదు. హింసతో పనిచేసే అధికారులను అహింసతో ఎదుర్కొన్నారు. బదులుగా వారు గుజరాత్ సభకు విరాళంగా తమ నగదు, విలువైన వస్తువులను అందించారు. నిరసన అధికారికంగా నిర్వహించబడింది.[విడమరచి రాయాలి].
తిరుగుబాటు క్రమశిక్షణ, ఐక్యత ప్రభుత్వవర్గాలలో భీతిని కలుగజేసింది. వారి వ్యక్తిగత ఆస్తి, భూమి, జీవనోపాధిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, పటేలుకు మద్దతుగా ఖేడా రైతులలో అత్యధికులు బలంగా ఐక్యమయ్యారు. ఇతర ప్రాంతాలలో తిరుగుబాటుకు గురైన గుజరాతీలు ప్రభుత్వ యంత్రాన్ని ప్రతిఘటించారు. నిరసనకారుల బంధువులు నిరసనకారులకు ఆశ్రయం ఇచ్చి ఆస్తులను బధ్రపరచడానికి సహాయపడ్డారు. తిరుగుబాటుల దారుల నుండి స్వాధీనం చేసుకున్న భూములను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన వారిని భారతీయులు సమాజం నుండి వెలివేసారు. ఇతర ప్రాంతాలలోని సానుభూతి పరులకు సార్డుల్ సింగ్ కేవలెలాంటి జాతీయవాదులు పిలుపునిచ్చినప్పటికీ గాంధీ, పటేల్ ఈ ఆలోచనలను గట్టిగా తిరస్కరించారు.
ఫలితం
[మార్చు]రెండు పార్టీలకు ఒప్పందం. సంవత్సరానికి పన్ను, తదుపరి పన్ను తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. జప్తు చేయబడిన ఆస్తి తిరిగి ఇవ్వబడుతుందని, అధికరించిన పన్ను శాతం తగ్గించబడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న భూములను వారి నిజమైన యజమానులకు తిరిగి ఇవ్వటానికి ప్రజలు కూడా సహకారంతో పనిచేశారు. స్వాధీనం చేసుకున్న భూములను స్వాధీనం చేసుకున్నవారు బ్రిటిషు అధికారికంగా అది కొనుగోలుదారులకు చెందుతాయని చెప్పినప్పటికీ కొనుగోలుదారులు వాటిని తిరిగి మునుపటి యజమానులకు తిరిగి స్వాధీనం చేసారు.[1]
మూలాలు
[మార్చు]- 1 2 Basu, Vipu; Singh, Jasmine Dhillon, Gita Shanmugavel, Sucharita. History And Civics (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 9788131763186.
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ Rai, Ajay Shanker (2000). Gandhian Satyagraha : An Analytical And Critical Approach (in ఇంగ్లీష్). Concept Publishing Company. ISBN 9788170227991.
- 1 2 Sarkar, Sumit. Modern India 1886-1947 (in ఇంగ్లీష్). Pearson Education India. ISBN 9789332540859.
- 1 2 3 వల్లభ్‌భాయ్ పటేల్ - 1, నరహరి పారిఖ్ 1950, pp. 48–69చాప్టర్ IX
- ↑ వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 60
- 1 2 వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 61
- 1 2 3 వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 62
- ↑ వల్లభ్‌భాయ్ పటేల్, రాజ్ మోహన్ గాంధీ 2015, p. 63
ఆధార గ్రంథాలు
[మార్చు]పారిఖ్, నరహరి (1950). సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ (in ఇంగ్లీష్). Vol. 1. ISBN 978-8172291563. {{cite book}}: ISBN / Date incompatibility (help)
గాంధీ, రాజ్‌మోహన్ (2015). వల్లభ్‌భాయ్ పటేల్ జీవితకథ. Translated by టంకశాల, అశోక్. ISBN 978-93-83652-75-4.