గంగమాంబాపురం (రామచంద్రాపురం)
గంగమాంబాపురం, చిత్తూరు జిల్లా, రామచంద్రాపురం మండలానికి చెందిన గ్రామం.[1] .
గంగమాంబాపురం | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | చిత్తూరు |
మండలం | రామచంద్రాపురం |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 517561 |
ఎస్.టి.డి కోడ్ |
గంగమాంబాపురం గ్రామం (సంతబైలు), తిరుపతి నుంచి 10 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామం వ్యవసాయాధారితమై ఉంది (ఈ మధ్య కాలంలో ఈ ఊళ్ళో పిల్లలు ఉన్నత విద్యలు అభ్యసించి బెంగళూరు, తిరుపతి లాంటి నగరాలలో ఉద్యోగం చేస్తున్నారు).ఊరికి ఇరువైపుల ఎతైన కొండలు, పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది.ఈ ఊరికి ఉన్న ఏకైక గుడి రాములవారి గుడి.
ప్రధాన పంటలు[మార్చు]
ముఖ్యమైన పంటలు: వేరుశెనగ, వరి, కూరగాయలు, ఆకుకూరలు.
గ్రామంలో సౌకర్యాలు[మార్చు]
- తిరుపతి నుంచి ప్రతి 30 నిమిషాలకు ఈ గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది.
ఇతర విశేషాలు[మార్చు]
- ఊరికి 1 కి.మీ దూరంలో రాయల చెరువు ఉంది. ఈ చెరువు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో కట్టబడింది. ఇది చిత్తూరు జిల్లా లోనే అతి పెద్ద చెరువు అని ప్రతీతి. ఈ చెరువు రెండు కొండల మధ్యన అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కట్టబడింది.ఇది చూడదగ్గ ప్రదేశము. ఈ చెరువు దగ్గర్లో శ్రీ ఆంజనేయస్వామి గుడి ఉంది. ఇది చాలా పురాతనమైనది. ప్రస్తుతం ఇక్కడ తి.తి.దే. ఆధ్వర్యంలో ఒక శతస్తంభ కళ్యాణమండపం కట్టబడింది.
భౌగోళికం, జనాభా[మార్చు]
గంగమాంబాపురం అన్నది చిత్తూరు జిల్లాకు చెందిన Vijayapuram తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 236 ఇళ్లతో మొత్తం 1017 జనాభాతో 310 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన Nagari 20 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 498, ఆడవారి సంఖ్య 519గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 203 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 91. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 596365[1].
అక్షరాస్యత[మార్చు]
మొత్తం అక్షరాస్య జనాభా: 602 (59.19%) అక్షరాస్యులైన మగవారి జనాభా: 340 (68.27%) అక్షరాస్యులైన స్త్రీల జనాభా: 262 (50.48%)
మూలాలు[మార్చు]
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.