గంగాధర్ చిత్రకారుడు
| గంగాధర్ చిత్రకారుడు | |
|---|---|
| జననం | 1930 పోడూరు, పశ్చిమ గోదావరి జిల్లా |
| ప్రసిద్ధి | సినీ పోస్టర్ డిజైనర్ |
| పిల్లలు | నలుగురు కుమారులు |
| తండ్రి | బుల్లికోటయ్య |
| తల్లి | సుబ్బమ్మ |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఖాసాకోటి గంగాధర్ చిత్రకారుడు, సినీ పోస్టర్ డిజైనర్, దర్శకుడు. ఐదు దశాబ్దాల పాటు సినీ రంగంలో కృషిచేశాడు.
జననం
[మార్చు]ఇతను 1930, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు గ్రామంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.
చిత్రకళా ప్రస్థానం
[మార్చు]చిన్నప్పటి నుండి బొమ్మలంటే ఇష్టపడే గంగాధర్ స్థానిక కార్పెంటరీ పనిలో నిష్ణాతుడైన సన్యాసిలింగం దగ్గర ఆయన చెక్కే బొమ్మలు చూసి, ఇంటికొచ్చి ఆ బొమ్మలు గీసేవాడు. సన్యాసిలింగం గంగాధర్ బొమ్మల్ని చూసి మెచ్చుకునేవాడు. తర్వాత మద్రాసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, సినీ పోస్టర్ డిజైనర్ కేతా సాంబమూర్తి వద్ద శిష్యునిగా కొన్ని సంవత్సరాల పాటు కళాలో మెళకువలు నేర్చుకున్నాడు. తొలిసారిగా బి. విఠలాచార్య చిత్రం గురువుని మించిన శిష్యుడు చిత్రానికి పబ్లిసిటీ ఆర్టిస్ట్ గా అవకాశం వచ్చింది.
పబ్లిసిటీ డిజైన్స్ చేసిన చిత్రాలు
[మార్చు]తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా భాషలలో సుమారు 900 సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్ గా పనిచేశారు.
ముఖ్యమైనవి కొన్ని చిత్రాలు
[మార్చు]- నిప్పులాంటి మనిషి
- గూడుపుఠాణి
- కన్నెమనసులు
- పెద్దలు మారాలి
- నిజం నిరూపిస్తా
- అబ్బాయిగారు - అమ్మాయిగారు
- మా నాన్న నిర్థోషి
- సంసారం
- మూగమనసులు
- రక్తసంబంధం
- మూడుపువ్వులు ఆరుకాయలు
- మంచి మిత్రులు
- మాయదారి మరిది
- సీతాకోక చిలుక
- ముగ్గురూ ముగ్గురే
- నాపేరే భగవాన్
- నకిలి మనిషి
- నీతి నిజాయితీ
- నేనంటే నేనే
- పాడిపంటలు
- రౌడిరాణి
- అమెరికా అమ్మాయి
- సావాసగాళ్ళు
- రామరాజ్యంలో భీమరాజు
- రౌడిరాముడు-కొంటెకృష్ణుడు
- గడసరిఅత్త-సొగసరికోడలు
- అమరదీపం
- యుగంధర్
- దాన వీర శూర కర్ణ
- పల్నాటి సింహం
- గుప్పెడు మనసు
- మొగుడు కావాలి!
- వేములవాడ భీమకవి
- తాతమ్మకల
- సాగరసంగమం
- అన్నదమ్ముల అనుబంధం
- కిరాయికోటిగాడు
- చాణక్య చంద్రగుప్త
- ఎర్రమల్లెలు
- డ్రైవర్ రాముడు
- భక్తకన్నప్ప
- తాలిబొట్టు
- బంగారుపంజరం
- నేటిభారతం
ఇలస్ట్రేటర్ గా
[మార్చు]అనేక వార, మాస పత్రికలకు ముఖచిత్రాలను, కథలకు బొమ్మలు వేలాదిగా చిత్రించారు.
దర్శకునిగా
[మార్చు]స్వీయ దర్శకత్వంలో 'శాంతి కిరణం' అనే టెలీ ఫిలిం ను నిర్మించాడు. మైసూరు దత్త పీఠంలో ఆస్థాన చిత్రకారునిగా నియమింపబడి అక్కడ స్వామీజీ నిర్మించిన నారద మండపంలో 72 తైలవర్ణ చిత్రాలను చిత్రించారు. 2004 సంవత్సరంలో బెంగళూరులో కన్నుమూశారు.