గంగానగర్ జిల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో గంగానగర్ జిల్లా (హిందీ మరియు రాజస్థాన్: ज़िला श्रीगंगानगर ; పంజాబీ : ਜਿਲ੍ਹਾ ਸ਼੍ਰੀ ਗੰਗਾਨਗਰ) ఒకటి.ఇది రాజస్థాన్ ధాన్యాగారంగా కీర్తించబడుతుంది.

చరిత్ర[మార్చు]

ఈ ప్రాంతానికి బికనీర్ మహారాజా గంగా సింగ్ పేరు పెట్టబడింది. శ్రీగంగానగర్ జిల్లా బికనీర్ రాజాస్థానంలో భాగంగా ఉంది. జిల్లా అధికభూభాగం జనావాస రహితంగా ఉంది. 1899-1900 లలో కరువు సంభవించినప్పుడు కరువు నివారణ కొరకు మహారాజా బృహత్తర ప్రణాళిక ద్వారా భవిష్యత్తు సమృద్ధిని ఊహించి గంగాకాలువ త్రవ్వకానికి రూపకల్పన చేసాడు. 1927 నాటికి 89 మైళ్ళ పొడవైన కాలువను నిర్మించి సటైజ్ నదీ జలాలను ఈ ప్రాంతంలో ప్రవహింపజేసి ఈ ప్రాంతాన్ని సశ్యశ్యామలం చేసాడు.[1] ఈ ప్రాంతం ఒకప్పుడు బహవాల్పూర్ రాజాస్థానం ఆధీనంలో ఉండేది. నిర్జనమైన బహిరంగ ప్రదేశానికి తగిన రక్షణ లేకుండా ఉండేది. గంగామహారాజు మిత్రులలో ఒకడైన హిందూ మల్ దీనిని అనుకూలంగా చేసుకుని దక్షిణంలోని సూరత్‌గర్ నుండి ఉత్తరంలో ఉన్న హిందూమల్‌కోట వరకు ఈ ప్రాంతపు సరిహద్దులలో ఉన్న స్తంభాలను మార్చి భూభాగ విస్తరణ చేసాడు. తరువాత హిందూమల్ గంగామహారాజుకు తన విజయం గురించిన వర్తమానం అందించాడు. తరువాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన గంగా మహారాజు ఈ ప్రాంతానికి హిందూమల్‌కోట అని నామకరణం చేసాడు.

భౌగోళికం[మార్చు]

Ghaggar river, near Anoopgarh, in the month of September.

ప్రాంత వివరణ[మార్చు]

శ్రీ గంగానగర్ జిల్లా 28.4 నుండి 30.6 డిగ్రీల అక్షాంశం మరియు 72.2 నుండి 75.3 డిగ్రీల రేఖాంశంలో ఉంది.[2] జిల్లా వైశాల్యం 11,154.66 చ.హెక్టార్లు. జిల్లా తూర్పు సరిహద్దులలో హనుమాన్‌గర్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో బికనీర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులలో పాకిస్థాన్ దేశంలోని భావనగర్ జిల్లా మరియు ఉత్తర సరిహద్దులలో పంజాబు జిల్లా ఉన్నాయి.

నైసర్గికం[మార్చు]

Irrigation has made Ganganagar greener but sandy dunes can still be seen. A photo taken in Gharsana tehsil.
The Anupgarh branch of the IGNP canal is the main source of irrigation in southern tehsils; photo taken in Gharsana Tehsil.

గంగానగర్ జిల్లా థార్ ఎడారిలో ఉన్నప్పటికీ జిల్లాలో గంగాకాలువ మరియు ఐ.జి.పి కాలువ ద్వారా వ్యవసాయ భూములకు సాగునీరు అందుతుంది. ఈ కాలువలు జిల్లా వృక్షజాలం మరియు జంతుజాలంలో మార్పు తీసుకువస్తున్నాయి.

 • ఈ ప్రాంతం గాంగాకాలువ మరియు భక్రాకాలువల ద్వారా జిల్లాలోని 75% వ్యవసాయ భూములకు అవసరమైన జలాలను అందుకుంటూ పంజాబు సారవంతమైన పంట భూములను తలపింపజేస్తుంది. రైసింగ్‌నగర్ మరియు విజయనగర్ తాలూకాలలో మాత్రం ఏడారి వాతావరణం నెలకొని ఉంది.
 • ఈ ప్రాంతంలో ఐ.జి.ఎన్.పి కాలువకు చెందిన సూరత్గర్ శాఖ నుండి జలాలను అందుకుంటుంది.
 • ఈ ప్రాంతంలో ఐ.జి.ఎన్.పి కాలువకు చెందిన అనూప్‌గర్ శాఖ : అనూప్‌గర్ మరియు ఘర్సన తాలూకాలకు నీరు అందుతుంది. జిల్లా దక్షిణ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం కాలువ ద్వారా సారవంతం అయినప్పటికీ ఇసుక తిన్నెలు మాత్రం అలానే ఉన్నాయి.
 • నాలి బెల్ట్ : ఇది సన్నని ఘగ్గర్ నదీ మైదానం. జిల్లాలో ప్రవహిస్తున్న ఏకైక నది ఇదే. ఈ నది వర్షాధారంగా ప్రవహిస్తుంది. ఇది సూరత్‌ఘర్ వద్ద జిల్లాలో ప్రవేశిస్తుంది.

తరువాత జైత్సర్, విజయనగర్, అనూప్గర్ ద్వారా ఇండో పాకిస్థాన్ సరిహద్దును చేరుకుంటుంది.

 • ఊంచా తిబ్బ :- సూరత్‌గర్ తాలూకా ప్రాంతంలో ఎత్తైన ఇసుక తిన్నెలు ఉన్నాయి. ఇక్కడ నీరు లభించడం అరుదు. ఈ ప్రాంతం నిజమైన ఎడారిగా ఉంటుంది. ఈ ప్రాంతపు ప్రజలు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంటారు.

తాలూకాలు మరియు పట్టణాలు[మార్చు]

గంగానగర్ తాలుకాలు[మార్చు]

గంగానగర్ జిల్లాలో తొమ్మిది తాలుకాలు ఉన్నాయి.

 • శ్రీ గంగానగర్ తాలూకా
 • శ్రీ కరంపుర్ తాలూకా
 • సాదుల్షహర్ తాలూకా
 • పదంపుర్ తాలూకా
 • రైసింగ్ నగర్ తాలూకా
 • సురత్గర్హ్ తాలూకా
 • ఆనూప్గర్ తాలూకా
 • విజయనగర తాలూకా
 • గరసన తాలూకా

ఇతర పట్టణాలు మరియు గ్రామాలు[మార్చు]

కెసరిసింగ్పుర్, గజ్సింగ్పుర్, రైసింగ్ నగర్, జైత్సర్, రవ్ల మండి మొదలైన ప్రధాన పట్టణలు, వ్హెరేస్ లల్గర్హ్ జతన్, రిద్మల్సర్, రజీసర్, పత్రొద, సమెజ కొథి, చునవధ్, గనెష్గర్హ్]],లధువల, హిందుమల్కొత్, బజువల, అంద్ బిర్మన విల్లగె బెల్వన, అరె స్మల్ల్ తౌన్స్ మరియు ఇతర గ్రామాలు. శ్రీ గంగనగర్‌ల్‌లో పలు పట్టణాలు బికనీర్ రాజవంశ కుంటుంబీకుల మరణం తరువాత వారి ఙాపకార్ధం నామకరణం చేయబడ్డాయి.

ఆర్ధికం[మార్చు]

Mustard fields in a Village of Gharsana tehsil.
A Super Thermal Plant station near Suratgarh city.
దస్త్రం:Paddy fields in the Ghaggar river.jpg
Paddy (Dhaan/Jhona) fields in the Ghaggar river belt and brick industries near Suratgarh.
దస్త్రం:Ganganagar Gypsum rock.jpg
A view of Gypsum rock. Gypsum is the only mineral, which is mined on a large scale here.

శ్రీగంగానగర్ జిల్లా ఆర్ధికంగా వ్యవసాయ ఆధారిత నగరంగా ఉంది. జిల్లాలో ప్రధానంగా గోధుమ, పత్తి, ఆవాలు, గౌర్, పప్పుధాన్యాలు మరియు చెరకు పండించబడుతుంది. వ్యవసాయ దారుల మధ్య హార్టీకల్చర్ కూడా ఆసక్తికరంగా మారింది. హార్టీకల్చర్ ఉత్పత్తులలో పంటల్లో కిన్నో పండ్లు కూడా ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. పుల్లని పడ్లరకాలకు చెందిన ఇతర పండ్లుకూడా పండించబడుతున్నాయి. గంగానగర్ పరిశ్రమలు కూడా వ్యవసాయ ఆధారితమైనవే. జిల్లాలో కాటన్ జిన్నింగ్ మరియు ప్రెసింగ్, ఆవనూనె మిల్లులు, పిండిమరలు, షుగర్ మిల్లులు మరియు టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలు అధికంగా ఉన్నాయి. ఫ్యాక్టరీలు అధికంగా గంగానగర్ నగరం లోపల మరియు వెలుపల ఉన్నాయి. బి.డి. అగర్వాల్ శ్రీగంగానగర్‌లో మెడికల్ కాలేజ్ నిర్మించడానికి 50 కోట్లు చందాగా ఇచ్చాడు. దాతృత్వంలో ఇది అత్యధిక మొత్తం అని గుర్తించబడుతుంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,969,520,[3]
ఇది దాదాపు. స్లొవేనియా దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 235 వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 179 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 10.06%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 887:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.25%.[3]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు[మార్చు]

రాజస్థానీ భాషాకుటుంబానికి చెందిన బగ్రి భాష జిల్లాలో అత్యధికంగా వాడుకలో ఉంది.[5] బగ్రి భాష గంగానగర్ మరియు హనుమాన్‌గర్ జిల్లాలు మరియు పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలలోని కొన్ని తాలూకాలలో మాత్రమే వాడుకలో ఉంది. జిల్లాలోని హింది, సరైకి ప్రజలు, సింధి, పంజాబీ ప్రజలలో కూడా బగ్రి భాష వాడుకలో ఉంది. జిల్లాలో హిందీ మరియు ఆంగ్లభాషలు అధికారభాషలుగా ఉన్నాయి. జిల్లాలోని పాఠశాలలు, కాలేజీలలో పంజాబీ భాష ఆప్షనల్ సబ్జెక్టుగా బోధించబడుతుంది. జిల్లాలో గంగానగర్ జిల్లాలో పంజాబీ సంగీతం అత్యధిక ప్రజాభిమానాన్ని కలిగి ఉంది. బగ్రి మరియు పంజాబీ భాషలు రెండింటిలో సాధారణమైన పదాలు అనేకం ఉన్నాయి. సరైకి భాష అరోయా, రైసిఖ్స్ మరియు సరైకి ప్రజలలో వాడుకలో ఉంది. ప్రస్తుతం జిల్లాలోని ఉత్తర భూభాగంలో సరైకి భాష మరుగున పడుతుంది. సింధీ ప్రజలు సింధీభాషను మాట్లాడుతుంటారు. సింధీలు అధికంగా విజయనగర్, కేద్రిసింఘ్‌నగర్ అనుప్‌గర్‌లో వాడుకలో ఉంది.

సస్కృతి[మార్చు]

దస్త్రం:Rural kutcha village.jpg
Rural kutcha homes with folk art can be seen in some remote villages, but this art is losing ground.
Such scenes are common in some southern villages.

ఒధిని ఎంబ్రాయిడరీ (అధికంగా ఎర్రని రంగులో ఉంటుంది) బగ్రీ స్త్రీలకు చిహ్నంగా ఉంది. పొడవైన షర్టు మరియు ఘాఘ్రో (పొడవైన గౌను వంటిది) మరియు బ్రోలో (శిరోభూషణం) బంగ్రీ స్త్రీల సంప్రదాయ దుస్తులుగా ఉన్నాయి. పంజాబీ స్త్రీలు సూట్, సల్వార్ మరియు చున్నీ దుస్తులను ధరిస్తుంటారు. ఇతర సమూహాలకు చెందిన స్త్రీలలో కూడా ఈ దుస్తులు ఆదరణ కలిగి ఉన్నాయి. హిందూ మరియు ముస్లిం సరైకి స్త్రీలు కొందరు గాగ్రా (పొడవైన గౌను) ధరిస్తుంటారు. బగ్రీ స్త్రీలలో పరదా వాడుకలో ఉంది. పురుషులు సాధారణంగా ప్యాంటు, షర్టు, కుర్తా - పైజమా, ధోవతి (పంజాబీలు దీనీని చద్రా - కుర్తా అంటారు ) ధరిస్తుంటారు. సంప్రదాయ సిక్కు మరియు రాజస్థాని భక్తి సంగీతం ప్రజాదరణ కలిగి ఉంది. ఇతర ఉత్తరభారతంలో ఉన్నట్లే హిందీ సినిమా పాటలు కూడా ప్రజాభిమానాన్ని చూరగొంటున్నాయి. పంజాబీ మరియు బగ్రీ సంప్రదాయాలు జిల్లాలో ఆధిక్యత కలిగి ఉన్నాయి.

మతం[మార్చు]

ప్రజలలో అధికంగా హిందువులు మరియు సిక్కులు ఉన్నారు. ప్రజలు గ్రామదేవతలైన రాందేవ్‌జి మరియు గోగజిలను ఆరాధిస్తుంటారు. ప్రజలు అధికంగా పీర్లు మరియు సన్యాసులపట్ల విశ్వాసం కలిగి ఉండి వారి ఖంఘాలకు (మందిరం) పోతుంటారు. కొంతమంది ఇస్లాం మతాన్ని అనుసరిస్తుంటారు. కొంతమంది సచ్చా - సౌదా, రాధా - సొయామి మరియు నిరంకారి డెరా ప్రజలు డెరా - సంప్రదాయాన్ని అనుసరిస్తుంటరు.

మాధ్యమం[మార్చు]

జిల్లాలో జైపూర్ నుండి రాష్ట్రస్థాయి వార్తాపత్రికలను గంగానగర్‌లో మరియు రైసింగ్‌నగర్‌లలో పునఃప్రచురణ చేయబడుతున్నాయి. గంగానగర్‌లో " సీమా సందేశ్ " అనే హిందీ పత్రిక ముద్రించబడుతుంది.[6]

ఆకాశవాణి[మార్చు]

జిల్లాలో " ఎయిర్ సురత్గర్ " అనే రేడియో స్టేషను ఉంది. ఇది హిందిక్, రాజస్థానీ మరియు పంజాబీ భాషలలో ప్రసారాలు అందిస్తుంది. 1981లో స్థాపించబడ్జింది. ఫ్రీక్వెంసీ 918. [7]

పర్యాటక ఆకర్షణలు[మార్చు]

దస్త్రం:Anupgarh fort.jpg
Anupgarh fort is located in Anupgarh city.
 • చారిత్రాత్మక గురుద్వారా బుద్ధ జొహద్ : ఇది గంగానగర్‌కు ఆగ్నేయంలో 85 కి.మీ దూరంలో ఉంది.
 • Historical Gurudwara Buddha Johad. An large gurudwara, which is 85 km from Ganganagar in the south-west. This is a place where Bhai Sukha Singh and Mehtab Singh brought the head of Massa Rangarh (guilty of sacrilege of the Amritsar Golden Temple) and hung it on a tree on August 11, 1740.
 • Baror an archeological site. The ruins of the Indus valley civilisation are found here. The antiquities found here are terracotta cakes,

sling balls, beads and spacer, terracotta, faience and shell bangles etc. It is located on Anoopgarh-Ramsinghpur road.

 • Dada Pamparam's Dera is at Vijayanagar town, and is the samadhi[clarification needed] (tomb) of Baba Pamparam.
 • Laila-Manjnu ki Mazar (tomb), Binjaur village. Laila Majnu Ki Mazar is 11 km (6.6 mi) far from Anoopgarh on the western side. Here is the so-called mazar of Laila-Majnu, actually this was built in remembrance of mutual devotion and love between a teacher and a student. A fair is held in June.
 • Chanana-Dham (Chanana shrine). A great temple of Lord Hanumanji is here, built in 1971. It is located 4 km from village 17 BB on the Ganganagar-Padampur road.
 • Suratgarh Thermal power plant.
 • Shri Jagadamba Andh-vidhyalaya. One of the largest institutes of India for the education of visually, hearing and speech impaired people. It is situated within Ganganagar city.
 • Anoopgarh Fort is a ruin in the city of Anoopgarh. It was built by Anoop Singh Rathore.
 • Suratgarh-Jaitsar state agriculture farm.

వృక్షజాలం మరియు జంతుజాలం[మార్చు]

దస్త్రం:Rojh neelgaye rajasthan rawla sivender.jpeg
A Rojh (Neelgai) near Rawla Mandi.by Shivender

జిల్లాలో నిర్మించబడిన కాలువలు జిల్లాలో వృక్షజాలం మరియు జంతుజాలంలో తగినంత మార్పును తీసుకు వచ్చింది. జిల్లాలో పెంపుడు జతువులు మరియు సాధారణ జంతువులలో ఆటవిక జంతువులు ఉన్నాయి. రోజ్, నీల్‌గాయ్ (బొసెలాఫస్ ట్రాగోకెమేల్స్) సాధారణ క్షీరదాలను ఫాంలలో మరియు ఇసుక తిన్నెలలో కనిపిస్తుంటాయి. రైతులు వారి పొలాలను ఈ జంతువుల నుండి రక్షింకోవలసిన అవసరం ఉంది. కొన్ని సార్లు నీల్గాయ్ రహదారి మీద సంచరిస్తూ ప్రమాదాలకు కారణం ఔతున్నాయి. పాములు, గోహ్, సంహా (సద్న), అడవి ఎలుకలు వంటి అడవి జంతువులు కనిపిస్తుంటాయి.

మూలాలు[మార్చు]

 1. Garg, Balwant (July 27, 2003). "Suicide woes fill the 'food basket'". The Times Of India. 
 2. http://ganganagar.nic.in/
 3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
 4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179 
 5. M. Paul Lewis, ed. (2009). "Bagri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 
 6. "Seema Sandesh". 
 7. "Air Suratgarh". All India Radio. 

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]