గంగూబాయి కతియావాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగూబాయి కతియావాడి
సినిమా పోస్టర్
దర్శకత్వంసంజయ్ లీలా భన్సాలీ
కథహుస్సేన్ జైదీ
నిర్మాతజ‌యంతిలాల్‌ గ‌డ
సంజయ్ లీలా భన్సాలీ
తారాగణంఆలియా భట్
ఛాయాగ్రహణంసుదీప్ ఛటర్జీ
సంగీతంబ్యాక్‌గ్రౌండ్ స్కోర్:
సంచిత్ బాళ్హరా
అంకిత్ బాళ్హరా
పాటలు:
సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాణ
సంస్థలు
భన్సాలీ ప్రొడక్షన్స్
పెన్ ఇండియా లిమిటెడ్
పంపిణీదార్లుపెన్ ఇండియా లిమిటెడ్
విడుదల తేదీ
25 ఫిబ్రవరి 2022 (2022-02-25)
దేశం భారతదేశం
భాషహిందీ

గంగూబాయి కతియావాడి రచయిత, జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ నవలను ఆధారంగా చేసుకుని నిర్మించిన హిందీ సినిమా. భన్సాలీ ప్రొడక్షన్స్, పెన్ ఇండియా లిమిటెడ్ బ్యానర్‌లపై సంజయ్ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌ గ‌డ నిర్మించిన ఈ సినిమాకు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించాడు. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన నటించిన ఈ సినిమా 2022 ఫిబ్రవరి 25న విడుదలయింది.[1]

69వ జాతీయ చలనచిత్ర అవార్డులలో, గంగూబాయి కతియావాడి ఉత్తమ నటి (భట్), ఉత్తమ స్క్రీన్ ప్లేతో సహా 5 అవార్డులను గెలుచుకుంది.[2] 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో, ఈ చిత్రం ఉత్తమ సహాయ నటుడు (రాజ్), ఉత్తమ నూతన నటుడు (మహేశ్వరి)తో సహా ప్రముఖ 15 నామినేషన్లను అందుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి (భట్) సహా ప్రముఖ 10 అవార్డులను గెలుచుకుంది.[3][4]

గంగూబాయి యుక్త వయసులో ఓ వ్యక్తిని ఇష్టపడి అతడిని గుడ్డిగా నమ్మి ఇంట్లో నుండి పారిపోయి అతడితో కలిసి ముంబై వస్తుంది. ఆమె అయామకత్వాన్ని అలుసుగా తీసుకున్న ఆమె ప్రియుడు, గంగూబాయిని ట్రాప్ చేసి ముంబైలోని కామతిపురలోని ఓ వేశ్యా గృహంలో అమ్మేస్తాడు. అనుకోకుండా ఆ వలలో చిక్కుకున్న గంగూబాయి మెల్లగా ఆ వృత్తిపై పట్టు సాధించి, ముంబై అండర్‌వరల్డ్‌ సహాయంతో సొంతంగా తనే వేశ్యాగృహాలు నడుపుతూ ‘మేడమ్ ఆఫ్ కామతిపుర’ గా ఎదిగింది. ఆ తర్వాత కామతిపురలో జీవన పరిస్థితులను మెరుగుపర్చడానికి గంగూబాయి చేసిన ప్రయత్నాల ఏమిటి? తరువాత ఏమి జరిగింది అనేదే మిగతా సినిమా కథ.[5]

నటీనటులు

[మార్చు]

అతిధి పాత్రల్లో

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

వివాదం

[మార్చు]

గంగూబాయి కుటుంబం, ఆమె దత్తపుత్రుడు బాబు రావుజీ షా, ఆమె మనవరాలు భారతి ఈ చిత్రంపై ఆందోళనకు దిగారు. ఇప్పటికే బాబూ రావుజీ షా పిటిషన్ దాఖలు చేయడంతో ముంబయి కోర్టు సంజయ్ లీలా భన్సాలీ, అలియా భట్‌లకు సమన్లు ​జారీ చేసింది. కేసు పెండింగ్‌లో ఉంది. తన అమ్మ జీవితాంతం సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేస్తే సామాజిక కార్యకర్త అవుతుందా.. వేశ్యనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. NTV (28 January 2022). "'గంగూబాయి కతియావాడి' రాకకు అంతా సిద్ధం". Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
  2. "69th National Film Awards 2023 complete winners list: Rocketry, Alia Bhatt, Kriti Sanon, Allu Arjun win big". The Indian Express (in ఇంగ్లీష్). 2023-08-24. Retrieved 2023-08-24.
  3. "ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ని దక్కించుకున్న 'గంగూబాయి కఠియావాడి, 'బాదాయ్ దో'". 28 April 2023. Archived from the original on 28 April 2023. Retrieved 28 April 2023.
  4. "Winners of the 68th Hyundai Filmfare Awards 2023". Filmfare. 28 April 2023. Archived from the original on 27 April 2023. Retrieved 28 April 2023.
  5. Sakshi (25 February 2021). "గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో." Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
  6. Sakshi (10 April 2021). "ఆలియా @ ప్రెసిడెంట్‌ ఆఫ్‌ కామాటిపురా". Archived from the original on 29 January 2022. Retrieved 29 January 2022.
  7. "Gangubai Kathiawadi: సినిమా కోసం మా అమ్మని వేశ్యగా చూపిస్తారా..?గంగూబాయ్‌ తనయుడి ఫైర్‌". EENADU. Retrieved 2022-02-17.