Jump to content

గంగోత్రి ఆలయం

వికీపీడియా నుండి
గంగోత్రి ఆలయం, ఉత్తరాఖండ్

గంగోత్రి ఆలయం, హిమాలయాల లోతట్టు ప్రాంతాలలో ఉన్న సుందరమైన దేవాలయం. ఇది ఉత్తరాఖండ్‌ లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి పట్టణంలో ఉంది, జీవన స్రవంతి అయిన గంగ మొదటిసారిగా భూమిని తాకిన అత్యంత పవిత్రమైన ప్రదేశం.[1] హిందూ పురాణాల ప్రకారం, అనేక శతాబ్దాల తీవ్రమైన తపస్సు చేసిన భగీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగా దేవి నది రూపాన్ని తీసుకుంది. భూమిమీదకు జాలువారే అపారమైన ప్రవాహ ప్రభావాన్ని తగ్గించడానికి శివుడు తన తన శిరస్సును మూలంగా అడ్డుపెట్టాడు. ఆమె పురాణ మూలం వద్ద ఆమె భాగీరథి అని పిలువబడింది. ఈ ప్రదేశం గంగోత్రిగా పిలువబడుతుంది.గంగాదేవికి అంకితం చేయబడిన ఎత్తైన దేవాలయం,

భగీరథ రాజు శివుడిని ఆరాధించిన పవిత్ర రాయి సమీపంలో గంగా మాతకు అంకితం చేయబడిన ఆలయం ఉంది. హిందూ సంస్కృతి ప్రకారం, అనేక శతాబ్దాల తీవ్రమైన తపస్సును అనుసరించి, భగీరథ రాజు పూర్వీకుల పాపాలను పోగొట్టడానికి గంగా దేవి నది రూపాన్ని తీసుకుంది. భగీరథ శిల అనేది భగీరథ రాజు ధ్యానం చేసిన పవిత్ర రాతి ప్రదేశం. ఈ ప్రదేశంలో గంగ భూమిని తాకిందని నమ్ముతారు. మరొక పురాణం ప్రకారం, మహాభారత పురాణ యుద్ధంలో తమ బంధువుల మరణాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాండవులు ఇక్కడ గొప్ప 'దేవ యజ్ఞం' నిర్వహించారని కధనం. భాగీరథి ఒడ్డున పూర్వీకుల ఆచారాలను నిర్వహించడం వల్ల పూర్వీకుల ఆత్మ పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందుతుందని, దాని నీటిలో పవిత్ర స్నానం చేయడం వల్ల ప్రస్తుత జన్మలలో చేసిన పాపాలు శుద్ధి అవుతాయని హిందువులు నమ్ముతారు.[2]

గంగోత్రి ఆలయం మే నెలలో వచ్చే అక్షయ తృతీయ పవిత్రమైన రోజున తెరుస్తారు. నవంబరు నెలలో వచ్చే యమ ద్వితీయ లేదా భాయ్ దూజ్ నాడు మూసివేయబడుతుంది. గంగోత్రి ఆలయం మిగిలిన ఆరు నెలల పాటు మూసి ఉంచబడుతుంది. చలికాలంలో దేవత ముఖ్బా గ్రామానికి మారుతుంది. మే నెలలో గంగానది పుట్టిన రోజుగా గంగా దసరాను ఘనంగా జరుపుకుంటారు.[3]

ఆలయ నిర్మాణం చరిత్ర

[మార్చు]

గంగోత్రి ఆలయాన్ని 18వ శతాబ్దంలో నేపాల్ జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించాడు.[4] పాలరాతి రాయితో నిర్మించిన ఈ ఆలయం లోపలి ఒక గర్భ గృహం, బయటి ఒక గర్భ గృహం రెండు గర్భ గృహాలను కలిగి ఉంది. లోపలి గర్భ గృహంలో ప్రధాన విగ్రహం (గంగా దేవత) ఉంటుంది. యమునా దేవి, అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మి, భగీరథుడు, ఆదిశంకర మహర్షి వంటి మరికొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి. బయటి గర్భ గృహంలో పూజలు చేసేందుకు భక్తులను అనుమతించారు.గంగోత్రి ఆలయానికి సమీపంలో ఉన్న ప్రజలకు కనిపించే సహజ శిలలతో కూడిన శివలింగం, శివలింగం నీటిలో కలిసిపోయింది. ఇది తక్కువ నీటి మట్టం ఉన్న సమయంలో అంటే చలికాలంలో కనిపిస్తుంది. భూమిని రక్షించడం కోసం శివుడు గంగాదేవిని ఏడు ముక్కలుగా విభజించాడని నమ్ముతారు. [4]

విశేషాలు

[మార్చు]

ఈ ఆలయం సముద్రమట్టానికి 3,100 మీటర్ల ఎత్తులో ఉంది. ఉత్తరాఖండ్‌లోని నాలుగు చోటా చార్ ధామ్ యాత్రా స్థలాలలో ఒకటి. గంగా మాత పూజ్యమైన గంగా నది ప్రతిరూపం. ప్రశాంతమైన తెల్లని దేవాలయం చుట్టూ దేవదార్ వృక్షసంపద, హిమాలయాల పర్వత శ్రేణులు ఉన్నాయి. గంగ రెండు ప్రధాన ప్రవాహాలలో ఒకటైన పవిత్ర నది భాగీరథి గంగోత్రి ఆలయం పక్కన ప్రవహిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. Chardham (2018-01-29). "Gangotri History and Legends". Retrieved 2023-04-12.
  2. "Gangotri Dham – The Origin of River Ganges | RitiRiwaz". 2019-12-04. Retrieved 2022-05-14.
  3. Nanda (2018-10-09). "Gangotri Temple 2022 Opening Closing Dates – Gangotri Dham Important Dates". euttaranchal.com. Retrieved 2022-06-19.
  4. 4.0 4.1 "History Of Gangotri Temple". TempleDairy. 2020-10-30. Retrieved 2023-04-12.

వెలుపలి లంకెలు

[మార్చు]