గంటల పంచాంగం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయికే పంచాంగం ("పంచ"-"అంగం"). పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగంలు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది). అందులో తెలుగువారికి చాలా పాచీన్యంలో ఉన్న పంచాంగాలలో పిడపర్తి వంశం వారు వ్రాసిన గంటల పంచాంగం ముఖ్యమైనది, ప్రామాణికమైనది.

పిడపర్తి వారి వైశిష్ఠ్యం[మార్చు]

పూర్వము విజయనగరమును పాలించిన శ్రీ పూసపాటి నారాయణరాజు గారు సంవత్సరాంతమున లెక్కలు సరిచేయుటకు జమలు బందు చెయ్య వలసినిదిగా ఆజ్ఞఇచ్చి కోటిపల్లి ఠాణాకు జమా బందీకి ప్రయాణం సాగించారు రాజుగారు.

అదేమి చిత్రమో కాని ఎప్పుడు పల్లకీ ఎక్కినా రాజుగారు తల్లిడిల్లి పోయి చిన్న పిల్లవానివలె అల్లరిచేస్తూ ఉండేవారట. పల్లకీ ఎక్కడం మానుట రాజ లాంచనానికి విరుద్ధం. అందుచేత తాత్కాలిక ఉపశమనం కోశం వైద్యులు, భూతవైద్యులు అనుపానాలిస్తూ మంత్రాక్షతలు జల్లుతూ అనుసరిస్తూ ఉండేవారు. వీరిని పల్లకీపౌజా అనేవారట.

జమాబందీ జరుగుతోంది. హైరాణా తీర్చుకోవడానికి పైకివచ్చి తిరిగి వెళ్ళుచుండగా ఒక ఆహితాగ్ని ఎదురై " ప్రభూ! నేను జ్యోతి శాస్త్రమును క్షుణ్ణముగా చదువుకున్నాను. ప్రశ్నాభాగం అమోఘంగా చెప్తాను" అని విన్న వించగా వినోదంగా కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో "ఇక్కడున్న వారంతా ఆశ్చర్యపడేటట్టు యేదైనా చెప్పండి" అని ఆనతియ్యగా వెంటనే ఆ వచ్చిన బ్రాహ్మణుడు తన ఇష్ట దైవమును ప్రార్థించి అంతర్ముఖుడై అంతా స్తంభించేటట్లు " పల్లకీ బొంగులో వుల్లిపాము ఉన్నది" అని నోటివెంట మాట సూటిగా అనేసరికి అంతా నిర్ఘాంత పోయారు.

ప్రభ్వుకు పట్టరాని కోపం వచ్చింది. కాని ముందుగా మాట ఇచ్చినందున జబదాటుట మర్యాదకాదని వజ్ర వైఢూర్య స్థగిత మైన సదరు పల్లకీ నుంచి బొంగు విడదీసి పగుల గొట్టించగా పాము పైకి వచ్చింది. ఎక్కడివారు అక్కడ కొయ్యలవలె అయిపోయారు.

తమకు ఇన్నాళ్ళు గ్రహమై వక్రించిన పామును నిగ్రహించి నందులకు అనుగ్రహించిన వారై గ్రామమొకటి దానపట్టావ్రాసి ఇచ్చిరి. ఇదే నేటి బూరాడ పేట అగ్రహారం. ఆ కుటుంబీకులే నేడు ప్రసిద్ధిలో నున్న పిడపర్తివారు. వీరి పంచాంగములు ప్రామాణికములు.