గంటి ప్రసాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంటి ప్రసాదరావు / గంటి ప్రసాదం
జననంగంటి ప్రసాదరావు
(1947-04-28)1947 ఏప్రిల్ 28
Indiaబొబ్బిలి , విజయనగరం జిల్లా , ఆంధ్రప్రదేశ్
నివాస ప్రాంతంబొబ్బిలి ,ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇతర పేర్లుగంటి ప్రసాదం
వృత్తినక్సలైట్
మతంహిందూ

గంటి ప్రసాదం గా పిలువబడే గంటి ప్రసాదరావు నక్సలైటు నాయకుడుగా మరిన కవి. 1947, ఏప్రిల్ 28న విజయనగరం జిల్లా, బొబ్బిలిలో జన్మించాడు. 2011 సంవత్సరంలో మావోయిస్టులు ఒడిషా రాష్ట్రం లోని మల్కాన్‌గిరి జిల్లా కలెక్టరును బంధించినపుడు ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీలలో గంటి ప్రసాదం ఒకరు.

మరణం

[మార్చు]

జూలై 4, 2013 న, నెల్లూరులో 65 సంవత్సరాల వయస్సులో ఇతను హత్యకు గురయ్యాడు.[1] దుండగులు అతి పాశవికంగా ఇతడిని కాల్చి ఆపైన కత్తితో మెడపై నరకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

అమరవీరుల స్మారక దినం సందర్భంగా నెల్లూరు నగరంలోని టౌన్‌హాల్లో జూలై 4, 2013 న గురువారం సంస్మరణ సభను బంధుమిత్రుల కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు.ఈ సభకు గంటి ప్రసాద్‌తోపాటు ఆ కమిటీ అధ్యక్షురాలు బి.అంజనమ్మ, కమిటీ సభ్యులు నరసన్న తదితరులు హాజరయ్యారు. అయితే ఆరవింద్ నగర్ లోని ఆసుప్రతిలో చికిత్స పొందుతోన్న దివంగత మావోయిస్ట్ నేత సోదరిని పరామర్శించారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో ఆయన్ని నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ చికిత్స పొందుతూ జూలై 5 అర్థరాత్రి 1:30 నిమిషాలకు మృతి చెందాడు.

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. గంటి ప్రసాదంపై దాడి: ది హిందూ[permanent dead link]