గంతవారిపాలెం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గంతవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

'గంటా వారి పాలెం , గుంటూరు జిల్లా, శావల్యాపురం మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము వినుకొండ మరియు నరసరావు పేట అను పట్టణములకు మధ్య గలదు.ఈ గ్రామము గుంటూరు జిల్లాలోని వినుకొండ నియొజక వర్గంలో శావల్యాపురం మండలములో గలదు. ఈ గ్రామములో అనేక రకాల కులాల వారు అనేక రకాల మతాల వారు కలసి మెలసి జీవిస్తున్నారు.శాసన సభ్యులు పేరు శ్రీ జి.వి. ఆంజనేయులు.ఈ గ్రామములో అనేక రకాల పంటలు వేస్తారు.ముఖ్య పంట వరి, ఇంకా ప్రత్తి, మిరప (మిర్చి), వంగ, కాకర, బీర, మొక్కజొన్న, మినుములు, జొన్నలు, పెసర మొదలగు పంటలను పండిస్తారు.ఇక్కడ పశు సంపదకు లోటు లేదు.ఈ గ్రామములో రోజు అనేక వేల లీటర్ల పాలను విక్రయిస్తారు. ఈ గ్రామములో రెండు రాముల వారి స్వామి గుడులు ఉన్నాయి. ఒక వినాయక స్వామి గుడి ఉంది.ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది.ఆ గుడిలో ప్రతి సవత్సరం వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి తిరునాళ్ళ జరుగును. ఇంకా ఇక్కడ ఒక అంకమ్మ తల్లి గుడి ఉంది.ఇంకా ఒక అద్దంకమ్మ గుడి ఉంది. మరియు ఒక గంగమ్మ తల్లి గుడి ఉంది. ఇంకా ఒక శివాలయం నిర్మాణంలో ఉంది. వీటితో పాటు రెండు చర్చిలు ఈ గ్రామములో కొలువై ఉన్నాయి.ఈ గ్రామము అనేక కళలలు ప్రసిద్ధి.ఇక్కడ ఒక ఎమ్.పి.యు.పి పాఠ శాల గలదు.ఇక్కడ ఇంకా రెండు అంగనవాడి కేంద్రాలు గలవు. ఈ గ్రామములో సుమారు 1800 మంది జనాభా ఇంకా 600 గడపలు గలదు.ఇక్కడ అక్షరాస్యతా శాతం సుమారు 70 %.ఈ గ్రామములో పెద్ద కాలువ ప్రవహించుచున్నది. ఆ కాలువ నుండి సమృద్ధిగా నీరు లభించుచున్నది. ఆ నీటిని పంట పొలాలకు వాడుతున్నారు. ఈ గ్రామములో ఒక కరెంటాఫీసు గలదు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]