గగన్‌విహారి లల్లూభాయ్ మెహతా
గగన్‌విహారి లల్లూభాయ్ మెహతా | |
|---|---|
![]() | |
| భారత రాయబారి, అమెరికా సంయుక్త రాష్ట్రాలు | |
| In office 1952–1958 | |
| అంతకు ముందు వారు | బినయ్ రంజన్ సేన్ |
| తరువాత వారు | ఎం.సి. చాగ్లా |
| వ్యక్తిగత వివరాలు | |
| జననం | 1900 ఏప్రిల్ 15 అహ్మదాబాద్, గుజరాత్, భారతదేశం |
| మరణం | 1974 April 28 (వయసు: 74) ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| జీవిత భాగస్వామి | సౌదామిని |
| సంతానం | అపర్ణ బసు |
| తల్లిదండ్రులు | లల్లుభాయ్ సమాల్దాస్ సత్యవతి |
| వృత్తి | సివిల్ సర్వెంట్ |
గగన్‌విహారి లల్లూభాయ్ మెహతా (15 ఏప్రిల్ 1900 - 28 ఏప్రిల్ 1974) 1952 నుండి 1958 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు భారత రాయబారిగా ఉన్నాడు.
జీవితచరిత్ర
[మార్చు]మెహతా లల్లుభాయ్ సమాల్దాస్ సత్యవతి దంపతులకు 1900 ఏప్రిల్ 15న భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో జన్మించాడి. ఇతని తండ్రి సంపన్న కులీనుడు. అతడు భావ్నగర్ రెవెన్యూ కమిషనర్‌గా పనిచేశాడు. మెహతా 1971లో ముంబైలోని న్యూ ఇంగ్లీష్ స్కూల్లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీలో చరిత్ర, ఆర్థిక శాస్త్రాలలో బి. ఎ. పట్టా సాధించి[1], తరువాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరాడు.[2] అనారోగ్యం కారణంగా, ఇతడు లండన్లో తన చదువును అసంపూర్ణంగా వదిలి ముంబైకి తిరిగి వచ్చాడు.[2] ఇక్కడ 1928లో, అతను బెర్ట్రాండ్ రస్సెల్ యొక్క సామాజిక దృక్పథంపై ఒక వ్యాసం రాయడం ద్వారా బొంబాయి విశ్వవిద్యాలయం నుండి ఎం. ఎ. డిగ్రీని పొందాడు.[2]సింధియా స్టీమ్ నావిగేషన్ కంపెనీలో పనిచేయడానికి ముందు 1923 నుండి 1925 వరకు బాంబే క్రానికల్ పత్రికలో సహాయ సంపాదకునిగా పనిచేశాడు.[1] 1937లో, ఇతడు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అదే సంవత్సరం ఇండియన్ మిల్లు యజమానుల ప్రతినిధి బృందంలో సభ్యుడిగా అంతర్జాతీయ వాణిజ్య సమావేశంలో పాల్గొన్నాడు.[2] 1939-40 లో, అతను కలకత్తాలోని ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. 1942-43 లో, మెహతా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.[2] 1944లో ఇతడు భారత ప్రతినిధి బృందానికి ఉప నాయకుడిగా అంతర్జాతీయ వాణిజ్య సమావేశానికి హాజరయ్యాడు. 1947లో జెనీవా నిర్వహించిన అంతర్జాతీయ వాణిజ్య ఉపాధి సదస్సులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు, మాంట్రియేల్‌లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నాడు.[2] 1947-50 మధ్య కాలంలో, ఇతడు ఇండియన్ కస్టమ్స్ బోర్డు డైరెక్టర్ పదవిని చేపట్టాడు. ఇతడు రాజ్యాంగ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశాడు.[2] 1950-52 లో, అతను ప్రణాళికా సంఘం సభ్యుడిగా నియమించబడ్డాడు. 1958లో ఆయన హిందుస్తాన్ షిప్‌యార్డ్ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు.[2] సమయంలో, అతను నేషనల్ షిప్పింగ్ బోర్డు ఛైర్మన్‌గా, 1965 లో ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా పనిచేశాడు.[2] బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, ఇతడు 1952 నుండి 1958 వరకు అమెరికాలో భారత రాయబారి కావడానికి ముందు టారిఫ్ బోర్డు అధ్యక్షుడయ్యాడు.[3] ఇతడు శ్వేతజాతీయుడు కానందున హ్యూస్టన్ విమానాశ్రయ రెస్టారెంట్లో ఇతడికి సేవను తిరస్కరించారు, ఇది అమెరికా దేశపు విదేశీ సంబంధాలను దెబ్బతీస్తుందని జాన్ ఫోస్టర్ డల్లెస్ నిర్ధారించడానికి దారితీసింది. మెహతాకు 1959లో పద్మవిభూషణ్ లభించింది.[2]
రచనలు
[మార్చు]మెహతా వ్రాసిన ముఖ్యమైన పుస్తకాలలో ఆకాశ్ న పుష్ప, అవాలి గంగా అనే గుజరాతీ గ్రంథాలున్నాయి. 'ది కాన్షియస్ ఆఫ్ ఎ నేషన్', 'స్టడీస్ ఇన్ గాంధీజం', 'ఫ్రమ్ రాగ్ అగల్స్', 'పర్వర్సిటీస్', 'అండర్‌స్టాండింగ్ ఇండియా' అనేవి ఇతని ఆంగ్ల రచనలు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Howson, S. (2011). Lionel Robbins. United States: Cambridge University Press. p87-88
- ↑ 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 2.10 "મહેતા, ગગનવિહારી લલ્લુભાઈ" [Mehta, Gaganvihari Lallubhai]. gujarativishwakosh.org. Gujarati Vishwakosh. Retrieved 17 July 2024. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>ట్యాగు; "Guj Vishwakosh" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Chandrika Srivastava, Nikhil Basu Trivedi". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-01-13. ISSN 0362-4331. Retrieved 2022-06-10.
