గజానన్ జగన్నాథ్ మానే
గజానన్ జగన్నాథ్ మానె | |
|---|---|
| 1949 మే 14 | |
| ఇతర పేర్లు | డోంబివిలికర్ కాకా |
| వృత్తి | సామాజిక కార్యకర్త
|
| క్రియాశీలక సంవత్సరాలు | 1991–ప్రస్తుతం |
| ప్రసిద్ధి | కుష్టు వ్యాధిగ్రస్తుల పునరావాసం |
| పురస్కారాలు | పద్మశ్రీ (2013)
|
గజానన్ జగన్నాథ్ మానె (జననం 14 మే 1949[1]) భారతీయ సామాజిక కార్యకర్త. ఈయన్ను డోంబివిలికర్ కాకా అని కూడా పిలుస్తారు.[2] భారత నౌకాదళంలో పనిచేసి పదవీ విరమణ పొందిన వీరు, గత 40 ఏళ్లుగా మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా కుష్టు వ్యాధి బాధితుల పునరావాసం కోసం ఎంతో కృషి చేస్తున్నారు.[3] సామాజిక సేవా రంగంలో మానె చేసిన సేవలకు గుర్తింపుగా, భారత ప్రభుత్వం 2013లో దేశ నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో గౌరవించింది.[1] 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం సమయంలో ఈయన కనబరిచిన ధైర్య సాహసాలకు గాను యుద్ధ పతకమైన సంగ్రామ్ మెడల్ లభించింది.[1][2]
బాల్యం
[మార్చు]మానె 1949 మే 14న మహారాష్ట్ర లోని డోంబివిలిలో జన్మించారు.[1][2] ప్రాథమిక విద్యను రత్నగిరి జిల్లాలోని సొంత ఊరైన అంబవ్ దేవ్‌రుఖ్ లో పూర్తి చేశారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ ఓటమి పాలవ్వడం మానె మనసును కలిచివేసింది. ఆ సంఘటనే ఈయనను భారత సైన్యంలో చేరేలా ప్రేరేపించింది.[2]
సేవా కార్యక్రమాలు
[మార్చు]ఈయన 1965లో భారత నౌకాదళంలో చేరారు. నౌకాదళంలో 12 ఏళ్ల పాటు సేవలందించిన మానె, 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో పాలుపంచుకున్నారు. 1976లో నౌకాదళం నుండి పదవీ విరమణ పొందిన తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు.[2]
కుష్టు వ్యాధి బాధితుల పునరావాసమే లక్ష్యంగా మానె తన సేవా ప్రస్థానాన్ని 1991లో ప్రారంభించారు.[1] కల్యాణ్ ప్రాంతంలో బాధితులకు ఆశ్రయం, ఉపాధి కల్పించేందుకు ఒక కాలనీని ఏర్పాటు చేశారు. ఈయన చొరవతోనే కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో బాధితుల కోసం ప్రత్యేక ఆసుపత్రి నిర్మాణం జరిగింది.[2]
హనుమాన్ నగర్ కుష్టు వ్యాధి నివారణ కాలనీలో నివసించే వారి జీవనోపాధి సమస్యలను పరిష్కరించడానికి అనేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రేషన్ షాపు ఏర్పాటు, మున్సిపల్ ఆసుపత్రి సౌకర్యం, పిల్లల చదువుల కోసం పాఠశాల వంటి సౌకర్యాలు కల్పించారు. కల్యాణ్ డోంబివిలి మున్సిపాలిటీ పరిధిలో సుమారు 40 మంది యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇప్పించారు. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి, వారికి కుట్టు పనిలో శిక్షణ ఇప్పించారు. బాధితులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా కొవ్వొత్తులు, అగరుబత్తులు, చాక్ పీసుల తయారీతో పాటు డెయిరీ ఫామ్ వంటి కుటీర పరిశ్రమలను కూడా ప్రారంభించారు.[4]
2011లో ఈ పునరావాస కేంద్రం నిర్వహిస్తున్న డెయిరీ ఫామ్ ప్రాజెక్టుకు జపాన్ లోని ససకావా లెప్రసీ ఫౌండేషన్ నుండి ప్రథమ బహుమతి లభించింది.[1]
అవార్డులు - గుర్తింపులు
[మార్చు]సామాజిక సేవా రంగంలో గజానన్ జగన్నాథ్ మానె చేసిన కృషికి గాను 2023లో న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.[2] అంతకుముందు 2015, 2017 సంవత్సరాల్లో కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఈయన పేరును పద్మశ్రీ కోసం ప్రతిపాదించింది.[2]
జనవరి 2023లో థానే జిల్లాలోని కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ ఈయనను ఘనంగా సన్మానించింది.[5] 1971 భారత్-పాకిస్థాన్ యుద్ధంలో చేసిన సేవలకు గుర్తింపుగా సంగ్రామ్ మెడల్ పొందారు.[1]
ఈయనకు 1993లో మహారాష్ట్ర ప్రభుత్వం నుండి 'గుణవంత్ కామ్‌గార్ పురస్కారం', థానే జిల్లా మాజీ సైనికుల బోర్డు నుండి 'కుష్ఠు రోగ సేవా కార్య పురస్కారం', కల్యాణ్-డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్ నుండి 'కుష్ఠు రోగ సేవా పురస్కారం' లభించాయి. అలాగే 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం 'సమాజ్ ఉత్తాన్ పురస్కారం'తో ఈయన్ను గౌరవించింది.[1]
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 "Gajanan Jagannath Mane has been conferred Padma Shri in field of Social Work". Press Information Bureau. 5 ఏప్రిల్ 2023.
- 1 2 3 4 5 6 7 8 Nambiar, Sajana (28 జనవరి 2023). "Padma Shri: Such a long journey for Dombivlikar Kaka". Hindustan Times.
- ↑ "डोंबिवलीतील कुष्ठ रुग्ण सेवक गजानन माने यांना 'पद्మశ్రీ'" (in మరాఠీ). Loksatta. 27 జనవరి 2023.
- ↑ Zavar, Jitendra (27 జనవరి 2023). "డोंబवलीतील 'बाबा आमटेंना' पद्मश्री, काय आहे गजानन माने यांचे कार्य" (in మరాఠీ). TV 9 Marathi.
- ↑ "Maha: Padma Shri who works for leprosy patients felicitated". The Print. 27 జనవరి 2023.
- Short description matches Wikidata
- September 2024 నుండి dmy మూస వాడుచున్న పేజీలు
- September 2024 from Use Indian English
- All Wikipedia articles written in Indian English
- CS1 మరాఠీ-language sources (mr)
- భారతీయ సామాజిక కార్యకర్తలు
- భారతీయ ఉద్యమకారులు
- 1949 జననాలు
- సామాజిక సేవా రంగంలో పద్మశ్రీ గ్రహీతలు
- జీవిస్తున్న ప్రజలు
- భారత నౌకాదళ సిబ్బంది
- భారత నౌకాదళ అధికారులు
- మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్తలు
- మహారాష్ట్ర వ్యక్తులు