గజేంద్రుడు
గజేంద్రుడు | |
---|---|
దర్శకత్వం | ఎన్. రాఘవన్ |
రచన | రాఘవన్ |
నిర్మాత | ఉదయ్ హర్ష వడ్డెల్ల |
తారాగణం | ఆర్య, కేథరిన్ థ్రెసా |
ఛాయాగ్రహణం | ఎస్.ఆర్. సతీష్ కుమార్ |
కూర్పు | దేవా |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ |
విడుదల తేదీ | 21 జూన్ 2019 |
సినిమా నిడివి | 139 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గజేంద్రుడు 2019లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో 2017లో ‘కదంబన్’ పేరుతో విడుదలైన ఈ సినిమాను భారతి వరప్రసాద్ వడ్డెల్ల సమర్పణలో లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యానర్ పై ఉదయ్ హర్ష వడ్డెల్ల ‘గజేంద్రుడు’ పేరుతో తెలుగులో విడుదల చేశాడు.[1] ఆర్య, కేథరిన్ థ్రెసా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జూన్ 21న విడుదలైంది.[2]
కథ
[మార్చు]అడవిలో ఒక తెగ వారు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. అలంటి వారి జీవితాల్లోకి ఒక వ్యాపారవేత్త మహేంద్ర (దీప రాజ్) అరణ్యంలోని విలువైన సంపదపై కన్నేసి వారిని అక్కడి నుండి వెళ్లగొట్టి సహజ సంపదను తన సొంతం చేసుకోవాలని చూస్తాడు. దీనిని వ్యతిరేకించిన గజేంద్ర (ఆర్యా) తన తెగ ప్రజల సహాయంతో మహేంద్రను ఎదిరించడానికి సిద్ధమౌతాడు. ఈపోరాటంలో గజేంద్ర మహేంద్రను ఎదిరించి, తన తెగ ప్రజలను , అడవిని కాపాడుకోగలిగాడా ఎలా కాపాడుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- ఆర్య
- కేథరిన్ థ్రెసా
- దీప్ రాజ్ రాణా
- సూపర్ సుబ్బరామన్
- మధుసూదన్ రావు
- అమృత్ కలం
- ఆడుకాళం మురుగ దోస్
- వై.జి.మహేంద్రన్
- మధువంటి అరుణ్
- ఉష ఎలిజబెత్
- డి.ఎం.జె రాజసింహన్
- ఎతిరాజ్
- కాదల్ శరవణన్
- డా. సాబు ఇస్సాక్
- మదురై సరోజ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్
- నిర్మాత: ఉదయ్ హర్ష వడ్డెల్ల
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: రాఘవ
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్. సతీష్ కుమార్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (14 June 2019). "కొండల్లో థ్రిల్". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ The Times of India (21 June 2020). "Gajendrudu Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.
- ↑ Sakshi (13 April 2017). "అడవిలో గజేంద్రుడు". Archived from the original on 17 సెప్టెంబరు 2021. Retrieved 17 September 2021.