గజేంద్ర సింగ్ షెకావత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గజేంద్ర సింగ్ షెకావత్
గజేంద్ర సింగ్ షెకావత్


కేంద్ర జల శక్తి శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 మే 30
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
డిప్యూటీ రతన్ లాల్ కటారియా

వ్యక్తిగత వివరాలు

జననం (1967-10-03) 1967 అక్టోబరు 3 (వయసు 56)[1]
మెహరోలీ , శ్రీ మధోపూర్ జిల్లా , రాజస్థాన్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
నొనంద్ కన్వార్
(m. invalid year)
సంతానం 3
వృత్తి రాజకీయ నాయకుడు

గజేంద్ర సింగ్ షెకావత్ (జననం 1967 అక్టోబర్ 3) భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు ప్రస్తుతం కేంద్ర జల శక్తి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను రాజస్థాన్ లోని జోధ్‌పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ లోక్ సభ సభ్యుడిగా ఉన్నాడు.[2]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

రాజస్థాన్ కి చెందిన సికార్ జిల్లా లోని మెహారోలి గ్రామంలో జన్మించాడు. ఇతని తండ్రి శంకర్ సింగ్ షెకావత్, రాజస్థాన్ రాష్ట్రంలోని వైద్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశాడు. ఇతని తండ్రి ఉద్యోగ నిమిత్తం తరచూ స్థలాలు మారుతూ ఉండడం వల్ల వివిధ పాఠశాలల్లో గజేంద్ర తన విద్యాభ్యాసాన్ని కొనసాగిచవలసి వచ్చింది. ఇతను జోధ్పూర్లోని జై నారాయణ్ వ్యాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇంకా ఫిలాసఫీ విద్యనభ్యసించాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

1992లో జెఎన్‌వియు విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా షెకావత్ విద్యార్థి దశలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ రైతు విభాగమైన బిజెపి కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా షేఖావత్ నియమించబడ్డాడు. భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా పనిచేశాడు.

కేంద్ర మంత్రిగా

[మార్చు]

2017 సెప్టెంబర్ 3న షెకావత్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు. 2019 భారత సార్వత్రిక ఎన్నికలలో జోధ్పూర్ నుండి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ను 2.74 లక్షల ఓట్ల తేడాతో ఓడించాడు. 2019 మే 31న కేంద్ర జల్ శక్తి శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Lok Sabha Secretariat. Retrieved 20 August 2020.
  2. "Constituencywise-All Candidates". Eciresults.nic.in. Archived from the original on 16 February 2014. Retrieved 17 May 2014.
  3. "Cabinet reshuffle: Dedicated party veterans, ex-bureaucrats in Modi's chosen nine - Times of India". The Times of India. 4 September 2017. Retrieved 27 March 2018.