Jump to content

గజ్జల వెంకట లక్ష్మి

వికీపీడియా నుండి
గజ్జల వెంకట లక్ష్మి

పదవీ కాలం
2024 మార్చి 15 – 2024 సెప్టెంబర్ 24
ముందు వాసిరెడ్డి పద్మ
తరువాత రాయపాటి శైలజ

పదవీ కాలం
2021 – 2024 మార్చి 15

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
వృత్తి రాజకీయ నాయకురాలు

గజ్జల వెంకట లక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024 మార్చి 15న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమితురాలైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

గజ్జల వెంకట లక్ష్మి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2021లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా నియమితురాలైంది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా పని చేసిన వాసిరెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేయడంతో 2024 మార్చి 15న గజ్జల వెంకట లక్ష్మిని మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.[3]

గజ్జల వెంకటలక్ష్మిని మహిళా కమిషన్​ చైర్​పర్సన్​ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్వాసన పలుకుతూ 2024 సెప్టెంబర్ 24న మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మెమో జారీ చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Gajjala Venkata Lakshmi appointed AP Mahila Commission Chairperson" (in Indian English). The Hindu. 16 March 2024. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  2. "గజ్జల వెంకటలక్ష్మికి సీఎం జగన్ కీలక పదవి | CM Jagan Appoints Gajjala Venkatalakshmi as Chairperson of Women's Commission". TV5. 16 March 2024. Retrieved 27 May 2025.
  3. "ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మి -". Suryaa. 15 March 2024. Archived from the original on 27 May 2025. Retrieved 27 May 2025.
  4. "మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మికి ఉద్వాసన". Eenadu. 24 September 2024. Archived from the original on 27 May 2025. Retrieved 24 September 2024.