Jump to content

గజ్వేల్ రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
గజ్వేల్ రెవెన్యూ డివిజను
పటం
Interactive map of గజ్వేల్ రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసిద్ధిపేట

గజ్వేల్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సిద్ధిపేట జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం గజ్వేల్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని గజ్వేల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన

[మార్చు]

గజ్వేల్ డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం గజ్వేల్ రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 గజ్వేల్ మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
2 జగ్దేవ్‌పూర్ మండలం 23 రెవెన్యూ గ్రామాలు
3 కొండపాక మండలం 21 రెవెన్యూ గ్రామాలు
4 ములుగు మండలం 24 రెవెన్యూ గ్రామాలు
5 మర్కూక్ మండలం 9 రెవెన్యూ గ్రామాలు
6 వర్గల్ మండలం 22 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
7 రాయపోల్ మండలం 13 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-08.
  3. "Subdivision & Blocks | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India". siddipet.telangana.gov.in. the original నుండి 2021-02-26 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-08.
  4. Vemula, Prakash (2022-03-15). "List of Revenue Divisions, Mandals in Siddipet District". TeachersBadi. the original నుండి 2020-09-25 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-08.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. ఒరిజినల్ నుండి 2021-12-24 న ఆర్కైవు చెయ్యబడింది (PDF) చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-08-08.