Jump to content

గడియారం

వికీపీడియా నుండి
(గడియారము నుండి దారిమార్పు చెందింది)
21 వ శతాబ్దపు గడియారం.

గడియారం (ఆంగ్లం: Watch) మనకు సమయం తెలుసుకోవడానికి ఉపయోగపడే యంత్రము, నిత్యావసర వస్తువు.

ఇవి చిన్నవిగా సులువుగా మనతో ఉండేటట్లుగా తయారుచేస్తారు. కొన్ని గడియారాలలో సమయంతో సహా రోజు, తేదీ, నెల, సంవత్సరము వంటి వివరాలు కూడా తెలియజేస్తాయి. ఆధునిక కాలంలో ఎక్కువమంది గడియారాన్ని చేతికి పెట్టుకొనడం మూలంగా వీటిని చేతివాచీ అంటారు. కొన్ని గోడ గడియారాలు ప్రతి గంటకి శబ్దం చేస్తాయి.

పాతకాలంలోని యాంత్రికమైన గడియారాలు స్ప్రింగ్ తో తిరిగేవి. వీటికి రోజూ లేదా రెండురోజుల కొకసారి 'కీ' ఇవ్వాల్సి వచ్చేది. కొన్ని రకాలలో ధరించిన వాని చేతి కదలికల నుండి తయారైన యాంత్రిక శక్తిని ఉపయోగించి పనిచేస్తాయి. ఆధునిక కాలంలో ఇవి ఎక్కువగా బాటరీలతో నడుస్తున్నాయి.

కొన్ని గడియారములలో మనము ఎప్పుడు అవసరము అనుకుంటే అప్పుడు గంట మోగే సదుపాయం కూడా ఉంటుంది. ఉదాహరణకు మనము నిద్ర లేవడానికి అలారం పెట్టడం.

పూర్వము ఎండ-నీడల సహాయముతో కాలమును గణించేవారు. అంతే కాక ఇసుక గడియారాలు కూడా వాడుకలో ఉండేవి. ఈ ఇసుక గడియారాల్లో రెండు బాగాలుగా ఉంటాయి. ఒక భాగంలో ఇసుక నింపబడి ఉంటుంది. మొత్తం ఇసుక ఒక భాగం నుంచి మరొక భాగానికి రాలడానికి ఒక నిర్దిష్టమైన సమయం పడుతుంది.

ప్రస్తుత కాలంలో ముల్లులు లేకుండా అంకెల గడియారములు (డిజిటల్ గడియారాలు) కూడా ఉన్నాయి. వీటిలో అంకెలను డిస్‌ప్లే చేయడానికి ఎలక్ట్రానిక్ లెడ్ లను ఉపయోగిస్తారు. వీటికి చాలా తక్కువ విద్యుత్తు ఖర్చవుతుంది. అలాగే సమయాన్ని మాటలలో కూడా చెప్పే సౌకర్యం కూడా ఉంటుంది. ఇటువంటివి అంధులకు చాలా ఉపయోగకరము.

గడియారంలో భాగాలు

[మార్చు]

మువ్‌మెంట్ (కదలికలు)

[మార్చు]

మూవ్‌మెంట్ అనేది కాలగమనాన్ని కొలిచి ప్రస్తుత సమయాన్ని చూపే గడియారంలోని భాగం. కదలికలు గడియారంలో యాంత్రికమైనవి కావచ్చు, వైద్యుత మైనవి కావచ్చు, కొన్ని సార్లు రెండు కలిసి కూడా మూవ్‌మెంట్ ఉండవచ్చు. ప్రస్తుతం చాలా గడియారాలు వైద్యుత కదలిక ద్వారా దర్శని (డిస్ప్లే) లో ముళ్ళను తిప్పుతూ ఉంటాయి.

యాంత్రిక కదలికలు

[మార్చు]

వైద్యుత కదలికలు

[మార్చు]

పవర్ సప్లై

[మార్చు]

డిస్ప్లే

[మార్చు]

వినియోగాలు

[మార్చు]

గడియారాలలో రకాలు

[మార్చు]
Timex Datalink USB Dress edition from 2003 with a dot matrix display; the Invasion video game is on the screen.

చరిత్ర

[మార్చు]

1500 : జర్మనీ : పీటర్ హెన్లెన్ మొదటి జేబు గడియారము తయారు చేసెను.

1485 : లియమనార్డొ డా విన్సి ఫుజీ (fusee) ని గీసెను .

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గడియారం&oldid=3894245" నుండి వెలికితీశారు