గడ్డం ప్రసాద్ కుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి. ప్రసాద్‌ కుమార్‌

మాజీ మంత్రి
నియోజకవర్గం వికారాబాదు నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1964
మర్పల్లి గ్రామం, వికారాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నివాసం వికారాబాదు

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ మంత్రి. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

జి. ప్రసాద్‌ కుమార్‌ 1964లో తెలంగాణ రాష్ట్రం , వికారాబాదు జిల్లా , మర్పల్లి గ్రామం లో జన్మించాడు. ఆయన తాండూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు

రాజకీయ జీవితం[మార్చు]

జి. ప్రసాద్‌ కుమార్‌ తెలంగాణ ఉద్యమ సమయంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి. సంజీవరావు పై గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి ఎ.చంద్రశేఖర్‌ పై 4,859 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1] ఆయన 2014 & 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయన తరువాత కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[2] గడ్డం ప్రసాద్‌కుమార్‌ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలయ్యాడు .[3]

మూలాలు[మార్చు]

  1. Greatandhraupdates. (7 February 2012). "CM Kiran Kumar Reddy added three more ministers in his cabinet" (in ఇంగ్లీష్). Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  2. Sakshi (20 September 2018). "టీపీసీసీలో మనోళ్లకు ప్రాధాన్యం". Archived from the original on 31 జూలై 2021. Retrieved 31 July 2021.
  3. Andhra Jyothy (11 December 2022). "టీపీసీసీ కార్యవర్గం నుంచి.. కోమటిరెడ్డి ఔట్‌". Archived from the original on 11 December 2022. Retrieved 11 December 2022.