గఢ్వా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గఢ్వా
పట్టణం
గఢ్వా is located in Jharkhand
గఢ్వా
గఢ్వా
జార్ఖండ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 24°07′N 83°49′E / 24.11°N 83.81°E / 24.11; 83.81Coordinates: 24°07′N 83°49′E / 24.11°N 83.81°E / 24.11; 83.81
దేశం India
రాష్ట్రంజార్ఖండ్
జిల్లాగఢ్వా
సముద్రమట్టం నుండి ఎత్తు
203 మీ (666 అ.)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం46,059
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
వాహన నమోదు కోడ్JH-14

గఢ్వా జార్ఖండ్ రాష్ట్రం, గఢ్వా జిల్లాలోని పట్టణం. ఆ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపోఅలనను పురపాలక సంఘం చూస్తుంది. గఢ్వా రోడ్ (రెహ్లా) ఒక ప్రధాన రైల్వే జంక్షను. ఇక్కడ ఢిల్లీ, కోల్‌కతా వెళ్ళేందుకు ఇక్కడీ నుండి రైళ్ళున్నాయి. రాంచీ, అంబికాపూర్, గయ మొదలైన ప్రదేశాలకు ఇక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది.

భౌగోళికం[మార్చు]

గఢ్వా 24°11′N 83°49′E / 24.18°N 83.82°E / 24.18; 83.82 వద్ద, [1] సముద్రమట్టం నుండి సగటున 197 మీ. (646 అ.) ఎత్తున ఉంది.

రవాణా[మార్చు]

గఢ్వా పట్టణంలో గఢ్వా టౌన్ రైల్వే స్టేషను ఉంది. దీని కోడ్ GHQ. [2] సమీపంలోని మరొక రైల్వే స్టేషన్ (సుమారు 10 కి.మీ దూరంలో) గఢ్వా రోడ్డు. దీని రైల్వే కోడ్ GHD. [3]

గఢ్వా న్యూ ఢిల్లీకి ఆగ్నేయంగా 1036 కి.మీ. దూరంలో ఉంది. లక్నో, పాట్నా, రాంచీ, కోట, భోపాల్ జంక్షన్, ఢిల్లీ, జబల్‌పూర్, కోల్‌కతా, వారణాసి, గయ నుండి గఢ్వా రోడ్డు జంక్షన్‌కు రైలులో చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం 165 కిలోమీటర్లు (103 మై.) దూరాన, రాంచీలో ఉంది.

గఢ్వా నుండి పాట్నా, రాంచి, రాయ్పూర్, కోలకతా, వారణాసి, అంబికాపూర్, దుర్గాపూర్, జంషెడ్పూర్, ధన్బాద్, ఢిల్లీ, లక్నో, అలహాబాద్, కోటా, కాన్పూర్ లకు చక్కటి రోడ్డు సౌకర్యం ఉంది.

జనాభా[మార్చు]

2001 జనగణన ప్రకారం,[4] గఢ్వా జనాభా 46,059. ఇందులో పురుషులు 54%, మహిళలు 46% ఉన్నారు. గఢ్వా సగటు అక్షరాస్యత 61%. ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 69%, స్త్రీల అక్షరాస్యత 51%. గఢ్వా జనాభాలో 17% మంది 6 సంవత్సరాల లోపు పిల్లలు.

మూలాలు[మార్చు]

 


  1. Falling Rain Genomics, Inc - Garhwa
  2. http://indiarailinfo.com/station/map/1118 Garhwa Town Railway Station
  3. http://indiarailinfo.com/station/map/1117 Garwa Road Railway Station
  4. "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=గఢ్వా&oldid=3395945" నుండి వెలికితీశారు