Jump to content

గఢ్వా జిల్లా

వికీపీడియా నుండి
గఢ్వా జిల్లా
गढवा जिला
జార్ఖండ్ పటంలో గఢ్వా జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో గఢ్వా జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుపాలము
ముఖ్య పట్టణంగఢ్వా
Government
 • లోకసభ నియోజకవర్గాలుపాలము
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తం4,044 కి.మీ2 (1,561 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం13,22,387
 • జనసాంద్రత330/కి.మీ2 (850/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత62.18 %
 • లింగ నిష్పత్తి933
ప్రధాన రహదార్లుNH 75
Websiteఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో (హిందీ: गढवा जिला) గర్వా జిల్లా ఒకటి. జిల్లా కేంద్రంగా గర్వా పట్టణం ఉంది. గర్వా జిల్లా గతంలో పాలమూ జిల్లాలో ఉండేది.

చారిత్రికము

[మార్చు]

1991 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఆ నాటి పాలము జిల్లాలో నుండి గర్హ్వ డివిజన్ ను విడదీసి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడమైనది. ప్రస్తుతం ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం.

[1]

బౌగోళికము

[మార్చు]

ఈ జిల్లా భౌగోళికముగా 23 - 60 డిగ్రీలు, 24 - 39 డిగ్రీలు ఉత్తరం అక్షాంశం, 83 - 00 తూర్పు రేఖాంశం, సోణే నదికి ఉత్తర భాగాన, జార్ఖండ్ లోని పాలమౌ జిల్లాకు తూర్పు వైపున సుర్గుజా (ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ) దక్షిణాన, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం జిల్లా అయిన సొనెభాద్రకు పడమర వైపున వున్నది

ఆర్ధికం

[మార్చు]

2011 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గర్వా జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి...[2]

ఉపవిభాగాలు

[మార్చు]

గర్వా జిల్లా 2 ఉపవిభాగాలుగా విభజించబడింది: గర్వా, నాగర్-ఉంతరి. ఇవి అదనంగా 14 బ్లాకులుగా విభజించబడ్డాయి.

  • జిల్లా రూపొందిచిన సమయంలో జిల్లాలో 8 బ్లాకులు మాత్రమే ఉండేవి: భందరియా, భవనాథ్‌పూర్, దురాకి, గర్వా, మఝియోన్, మెరల్, నగర్-ఉంత్రి, రంక.
  • తరువాత 6 బ్లాకులు చేర్చబడ్డాయి: చినియా, దండియా, కండి, ఖరౌండి, రాంఖండ, రమున.
  • జిల్లాలో 156 గ్రామ పంచాయితీలు, 916 గ్రామాలూ ఉన్నాయి.
  • జిల్లాలో 2 పోలీస్ ఉపవిభాగాలు : గర్హ్వ, నగర్-ఉంత్రి, 8 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి : భవంథ్పురా, ధుక్రి, గర్హ్వ, మఝియాన్, మెరల్, నగర్-ఉంత్రి, రంకా.
  • జిల్లాలో అధికంగా అరణ్యలు, ఒకేఒక పట్టణం ఉన్నాయి: గర్వా (జిల్లాకేంద్రం)
  • జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

పర్యాటకం

[మార్చు]

గర్హ్వ - రైలు, రోడ్డు మార్గాలతో ఇతర ప్రదేశాలతో కలపబడి యున్నది. ఈ పట్టటణం నుండి ప్రతి రోజు ఇతర జిల్లాలైన జార్ఖండ్, బీహార్, చత్తీస్ ఘర్ కు బస్సులు ప్రయాణిస్తుంటాయి. గర్హ్వ జిల్లాతో మధ్యప్రదేశ్ లోని రీవా జార్ఖండ్ లోని రాంచీ జాతీయ రహదారి సంఖ్య 75 తో కలపబడి యున్నది. ఇందులో 210 కిలో మీటర్లు రాష్ట్ర రహదారి, 55 కిలో మీటర్లు (నె. 55) జాతీయ రహ దారి, 96.95 కిలోమీటర్ల దూర జిల్లా రహదారులున్నాయి. ఇతర రోడ్లు 190 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. బీహారుతో పోల్చి చూస్తే జార్ఖండ్ రోడ్డు రవాణా వ్వస్థ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాల అభివృద్ధి చెందింది. గర్హ్వ - నగర్ - ఉతారి రహదారి చాల బాగా అభివృద్ధి చెందింది. కాని నగర్ - ఉతారి, భావంత్ పూర్ రోడ్డు అంత బాగా లేదు. ఈ రహదారి గనుల మద్యగా వున్న 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంటల సమయం పడుతుంది.

దీనికి సమీప విమానాశ్త్రయం వారణాసి (140 కి.మీ.)గర్హ్వ రైల్వే స్టేషను తూర్పు రైల్వే విభాగంలో ప్రధానమైనది.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,322,387,[3]
ఇది దాదాపు. మొరీషియస్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హాంప్‌షైర్ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 368వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 327 [3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 27.71%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 933:1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.18%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Mauritius 1,303,717 July 2011 est.
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470

వెలుపలి లింకులు

[మార్చు]