Jump to content

గణేష్ ఘోష్

వికీపీడియా నుండి
గణేష్ ఘోష్
గణేష్ ఘోష్


పదవీ కాలం
1967-1971
ముందు ఇంద్రజిత్ గుప్తా
తరువాత ప్రియారంజన్ దాస్ మున్షీ
నియోజకవర్గం కోల్‌కతా దక్షిణ

పదవీ కాలం
1951 – 1967
ముందు కొత్త సీటు
తరువాత లక్ష్మీ చరణ్ సేన్
నియోజకవర్గం బెల్గాచియా పశ్చిమ

వ్యక్తిగత వివరాలు

జననం (1900-06-22)1900 జూన్ 22
చట్టోగ్రామ్, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు చిట్టగాంగ్, బంగ్లాదేశ్)
మరణం 1994 అక్టోబరు 16(1994-10-16) (వయసు: 94)
కలకత్తా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్)
భారత కమ్యూనిస్ట్ పార్టీ

గణేష్ ఘోష్ (22 జూన్ 1900 - 16 అక్టోబర్ 1994) భారత స్వాతంత్ర్య కార్యకర్త, విప్లవకారుడు & రాజకీయ నాయకుడు.[1] ఆయన 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోల్‌కతా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా, మూడుసార్లు పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[2]

జీవిత చరిత్ర

[మార్చు]

గణేష్ ఘోష్ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న చిట్టగాంగ్‌లో బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. ఆయన 1922లో కలకత్తాలోని బెంగాల్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి ఆ తరువాత చిట్టగాంగ్ జుగంతర్ పార్టీలో సభ్యుడయ్యాడు. గణేష్ ఘోష్  సూర్య సేన్, ఇతర విప్లవకారులతో కలిసి 1930 ఏప్రిల్ 18న చిట్టగాంగ్ ఆయుధశాల దాడిలో పాల్గొని ఆ తరువాత చిట్టగాంగ్ నుండి పారిపోయి హూగ్లీలోని చందన్‌నగర్‌లో ఆశ్రయం పొందాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసు కమిషనర్ చార్లెస్ టెగార్ట్ చందన్‌నగర్‌లోని వారి తలదాచుకున్న నివాసంపై దాడి చేసి అతన్ని అరెస్టు చేశాడు. అరెస్టు ఆపరేషన్ సమయంలో ఒక యువ విప్లవకారుడు జిబాన్ ఘోషల్ అలియాస్ మఖాన్‌ను పోలీసులు చంపారు.

గణేష్ ఘోష్‌ను విచారణ తర్వాత 1932లో పోర్ట్ బ్లెయిర్‌లోని సెల్యులార్ జైలుకు తరలించారు. 1946లో జైలు నుండి విడుదలైన తర్వాత కమ్యూనిస్ట్ రాజకీయాల్లో చేరి భారత కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడయ్యాడు.  ఆయన 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ చీలిక తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) వైపు నిలిచి బెల్గాచియా పశ్చిమ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా 1952, 1957 & 1962లో పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికయ్యాడు. [3][4][5]

గణేష్ ఘోష్‌ 1967లో కలకత్తా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభ్యర్థిగా 4వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన 1971 లోక్‌సభలో  కలకత్తా దక్షిణ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్ట్) అభ్యర్థిగా పోటీ చేయగా 26 ఏళ్ల ప్రియరంజన్ దాష్ మున్షీ ఓడించాడు.

మూలాలు

[మార్చు]
  1. ↑ Sangshad Bangali Charitabhidhan, Editor: Anjali Basu, 2nd part, 4th Edition, Sahitya Sangshad, 2019, Kolkata
  2. ↑ Chandra, Bipan; Mukherjee, Mridula; Mukherjee, Aditya; Mahajan, Sucheta; Panikkar, K.N. (2016) [First published 1987]. India's Struggle for Independence (Revised and updated ed.). Penguin Books. p. 252. ISBN 978-0-14-010781-4.
  3. ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1951". Retrieved 11 July 2024.
  4. ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1957". Retrieved 11 July 2024.
  5. ↑ Election Commision of India (11 July 2024). "West Bengal General Legislative Election 1962". Retrieved 11 July 2024.