గణేశ్ పాత్రో

వికీపీడియా నుండి
(గణేష్ పాత్రో నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గణేశ్ పాత్రో
గణేశ్ పాత్రో
జననంగణేశ్ పాత్రో
జూన్ 22, 1945
పార్వతీపురం
మరణం2015 జనవరి 5(2015-01-05) (వయసు 69)
చెన్నై
మరణ కారణంక్యాన్సర్
నివాస ప్రాంతంచెన్నై
ప్రసిద్ధిసాహితీకారుడు, సినిమా రచయిత
మతంహిందూ
భార్య / భర్తలక్ష్మి కుమారి

గణేశ్ పాత్రో (జూన్ 22, 1945జనవరి 5, 2015) నాటక రచయిత, సినీ రచయిత.

జననం

[మార్చు]

ఈయన జూన్ 22, 1945లో జన్మించారు. ఈయన స్వస్థలం విజయనగరం జిల్లా, మార్కొండపుట్టి.

విద్యార్థిజీవితం

[మార్చు]

గణేశ్ పాత్రో తండ్రి, పార్వతీపురం దగ్గర మార్కొండపుట్టి అనే ఒక చిన్న గ్రామానికి కరణంగా పనిచేసేవాడు. గణేశ్ ప్రాథమిక విద్య అక్కడే సాగింది. ఆ గ్రామంలో ఉన్నత పాఠశాల లేనందున, పార్వతీపురంలో ఒక ఇల్లు కొని అందులో బామ్మతో పాటు గణేశ్ ను ఉంచి చదివించాడు. తనపై పెద్ద నిఘా లేని సమయాన్ని ఆసరాగా తీసుకొని నాటకాలలో నటించడం ప్రారంభించాడు, పాఠశాల పుస్తకాలతో పాటు సాహిత్యాన్ని కూడా చదవటం ప్రారంభించాడు. ఆ తరువాత వెనువెంటనే కుటుంబం మొత్తం పార్వతీపురానికి మారింది. ఆ కాలంలోని రావిశాస్త్రి స్ఫూర్తితో స్థానిక విశాఖ మాండలికంలో ఛందోబద్ధ కవిత్వం వ్రాయటానికి ప్రయత్నించాడు కానీ అది సఫలం కాలేదు. పీ.యూ.సి పూర్తయిన తర్వాత పై చదువులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడునుప్పడే విశ్వవిద్యాలయ సాంస్కృతిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా నాటకాలు వ్రాయటం, వాటిని రంగస్థలంపై ప్రదర్శించడం ప్రారంభించాడు.[1]

నాటక, సినీరంగ జీవితం

[మార్చు]

కొడుకు పుట్టాల నాటికతో యావద్భారతదేశంలో కీర్తి లభించింది. ఆ నాటిక అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమై, ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రసారమైంది. 1970 ప్రాంతంలో రచన ప్రారంభించిన గణేశ్ పాత్రో అయిదేళ్ళ కాలంలో ప్రథమ శ్రేణి నాటకకర్తగా పేరు తెచ్చుకున్నాడు. రచనలు చాలా తక్కువే అయినా, వ్రాసిన ప్రతి నాటికా, నాటకము రంగస్థలం మీద రక్తి కట్టి రసజ్ఞుల మెప్పుపొందింది. కథా వస్తువును పరిగ్రహించడంలో, కథనంలో, పాత్రచిత్రణలో, సన్నివేశాల మేళవింపులో, మాటల కూర్పులో నిత్య నూతన పరిమళాన్ని వెదజల్లిన ప్రతిభాశాలి గణేశ్ పాత్రో. సంఘటనల ద్వారా సమస్యను శక్తివంతంగా ఆవిష్కరించటం ఈయన రచనా విధానంలో ప్రత్యేకత. మృత్యుంజయుడు, తెరచిరాజు, తరంగాలు, అసురసంధ్య నాటకాలూ, కొడుకు పుట్టాల, పావలా, లాభం, త్రివేణి, ఆగండి! కొంచెం ఆలోచించండి మొదలైన నాటికలు ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని దోచుకున్న ఉత్తమ రచనలు.[2]

1970 నుండి 1990ల వరకు అనేక సినిమాలకు సంభాషణలు, కథను అందించాడు. పదిహేనేళ్ళ తర్వాత తిరిగి సినీరంగానికొచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణలు సమకూర్చాడు.[3] "హలో గురూ ప్రేమకోసమేరా ఈ జీవితం" నిర్ణయం సినిమాలో పాట రాశాడు.

ఈయన సినీ సంభాషణలు సమకూర్చిన చిత్రాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నిర్ణయం, సీతారామయ్య గారి మనవరాలు, రుద్రవీణ, తలంబ్రాలు, ప్రేమించు పెళ్ళాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మాపల్లెలో గోపాలుడు ఇలా పలు హిట్ చిత్రాలు ఉన్నాయి.[4]

రచయితగా పనిచేసినిన సినిమాల పాక్షిక జాబితా

[మార్చు]

మరణం

[మార్చు]

కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన గణేశ్ పాత్రో 69 ఏళ్ళ వయసులో 2015, జనవరి 5 సోమవారం ఉదయం కన్నుమూశాడు.[5]

ఇతర వివరాలు

[మార్చు]

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని బైపాస్‌ రోడ్డుకు గణేశ్ పాత్రో రోడ్డుగా నామకరణం చేయబడింది.[6]

మూలాలు

[మార్చు]
  1. "Interview: Ganesh Patro - By Sri Oct 4, 2006". Archived from the original on 2011-12-10. Retrieved 2013-05-28.
  2. ఆంధ్రభూమి, సాహితి (3 October 2016). "అటకెక్కుతున్న నాటక రచన". andhrabhoomi.net. బి.నర్సన్. Archived from the original on 27 మార్చి 2020. Retrieved 27 March 2020.
  3. Keeping to the old ways - The Hindu January 19, 2013
  4. ఆంధ్రజ్యోతి, ముఖ్యాంశాలు (6 January 2015). "ప్రముఖ సినీ రచయిత గణేష్‌ పాత్రో కన్నుమూత". Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.
  5. వి6 (5 January 2015). "సినీ రచయిత గణేష్ పాత్రో కన్నుమూత". Archived from the original on 24 ఏప్రిల్ 2019. Retrieved 24 April 2019.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. ప్రజాశక్తి, విజయనగరం (13 March 2016). "గణేష్‌ పాత్రో సేవలు చిరస్మరణీయం". Archived from the original on 24 April 2019. Retrieved 24 April 2019.

ఇతర లంకెలు

[మార్చు]