గణేష్ (1998 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
‌గణేష్
దర్శకత్వంతిరుపతి స్వామి
నిర్మాతదగ్గుబాటి సురేష్ బాబు
రచనపరుచూరి బ్రదర్స్ (మాటలు), తిరుపతి స్వామి (కథ, స్క్రీన్ ప్లే)
నటులువెంకటేష్,
రంభ,
మధుబాల
సంగీతంమణిశర్మ
ఛాయాగ్రహణంకె. రవీంద్రబాబు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణ సంస్థ
విడుదల
జూన్ 19, 1998 (1998-06-19)
నిడివి
166 నిమిషాలు
భాషతెలుగు

గణేష్ 1998 లో తిరుపతి స్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమా. వెంకటేష్, రంభ, మధుబాల ఇందులో ప్రధాన పాత్రధారులు. తన వృత్తిలో నీతి నిజాయితీగా ఉండే ఒక విలేకరి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చెప్పే కథ యిది. ఈ సినిమాకు వెంకటేష్ కు నంది అవార్డు లభించింది.[1] ఈ చిత్రంతో సహా తెలుగులో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన తిరుపతి స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

కథ[మార్చు]

తారాగణం[మార్చు]

నిర్మాణం[మార్చు]

1997 విజయదశమి రోజు ఈ చిత్ర నిర్మాణం ప్రారంభమైంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఒకే సారి రెండు చిత్ర నిర్మాణాలు జరుగుతుండేవి. ఒకటి రామానాయుడు ఆధ్వర్యంలో జరిగితే మరొకటి ఆయన పెద్దకొడుకు సురేష్ బాబు ఆధ్వర్యంలో జరుగుతుండేది. ఈ సినిమా నిర్మాణం సురేష్ బాబు నేతృత్వంలో జరిగింది. ఇదే సమయంలో రామానాయుడు శివయ్య చిత్ర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నాడు.[1] దర్శకుడు సురేష్ కృష్ణ శిష్యుడైన తిరుపతి స్వామి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

అభివృద్ధి[మార్చు]

తిరుపతి స్వామి స్వయంగా విలేకరి, అభ్యుదయ వాది. తన వృత్తిలో ఎదురైన కొన్ని విస్మయకర సంఘటనల ఆధారంగా కథ తయారు చేసుకున్నాడు. నిర్మాత సురేష్ బాబు దగ్గరకు వెళ్ళి ఆయనను ఒప్పించేదాకా కథలు చెబుతుంటాననీ, ప్రతి దానినీ తన దగ్గర స్క్రీన్ ప్లే ఉందని చెప్పాడు. కానీ తిరుపతి స్వామి చెప్పిన మొదటి కథే సురేష్ బాబుకు ఆకట్టుకుంది.[1]


పాటలు[మార్చు]

  • ఆదా బర్సే అందరికి ఆదాబర్సే (గానం: మనో)
  • అయ్యో రామా అయ్యో రామా (గానం: ఉదిత్ నారాయణ్)
  • సిరి సిరి మువ్వలు (గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం)
  • హిందీలోనా చుమ్మా (గానం: మనో)
  • రాజహంసవో (గానం: హరిహరన్)

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 యు., వినాయకరావు (2014). మూవీ మొఘల్. హైదరాబాదు: జయశ్రీ పబ్లికేషన్స్. p. 237.[permanent dead link]