గతితార్కిక భౌతికవాదం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Karl Marx and Friedrich Engels
కార్ల్ మార్క్స్ ఇంకా ఫ్రెడ్రిక్ ఏంజిల్స్

గతితర్కం అంటే ప్రతి వస్తువు\విషయం యొక్క synthesis (నిర్మాణ ప్రక్రియ లేదా పరిణామ ప్రక్రియ), antithesis (విఛ్ఛిన్న ప్రక్రియ) ని అర్థం చేసుకోవడం. గ్రీక్ భాషలో డయలెగో అంటే వాదన-ప్రతివాదన అని అర్థం. దాన్ని ఆంగ్లంలో dialectic అని, తెలుగులో గతితర్కం అని అనువదించడం జరిగింది. భౌతికవాదం అంటే భౌతికంగా ఉనికిలో ఉన్న వాటి గురించే అలోచించడం. చెట్లు, కొండలు, కోనలు, మనిషి, సమాజం ఇవన్నీ భౌతికంగా ఉనికిలో ఉన్నవే. వీటికి అతీతంగా ఊహాజనిత వస్తువులని (దేవుడు, ఆత్మ లాంటివి) నమ్మడం భావవాదం కిందకి వస్తుంది. గతితార్కిక భౌతికవాదం అంటే భౌతికవాదాన్ని గతితార్కిక పద్ధతిలో అర్థం చేసుకోవడం. ప్రతి పదార్థానికి చలనం (motion) ఉంటుందన్న హెగెల్ సూత్రాన్ని కూడా మార్క్స్ తన గతితార్కిక ఆలోచన విధానంలో చేర్చాడు. అంతే కాకుండా హెగెల్ తత్వశాస్త్రంలోని భావవాద కోణాన్ని, జడతత్వ సూత్రాల్ని విమర్శించాడు.

చారిత్రక భౌతికవాదం

[మార్చు]

చారిత్రక భౌతికవాదం అంటే చరిత్రలోని దశలని గతితార్కిక దృష్ఠితో అర్థం చేసుకోవడం. మానవుడు కోతి నుంచి వచ్చాడన్న డార్విన్ జీవపరిణామ సిధ్ధాంతంతో చారిత్రక భౌతికవాదం మొదలవుతుంది. ఆదిమ గణ సమాజం బానిస-యజమాని సమాజంగా ఎలా మారింది, బానిస-యజమాని సమాజం భూస్వామ్య సమాజంగా ఎలా మారింది, భూస్వామ్య సమాజం పెట్టుబడి దారి సమాజంగా ఎలా మారింది వంటి అంశాలను గతితార్కిక పద్ధతిలో వివరిస్తుంది. ప్రైవేట్ పెట్టుబడుల రద్దు, పరిశ్రమలు జాతీయీకరణ, వ్యవసాయభూముల సమిష్ఠీకరణ, డబ్బు లేని ఆర్థిక వ్యవస్థ స్థాపన వంటి వాటి గురించి మార్క్సిస్ట్లు ఆర్థిక శాస్త్రంలో వివరించడం జరిగింది. తత్వశాస్త్రంలో మార్క్సిస్ట్లు గతితార్కిక-చారిత్రక భౌతికవాదాన్ని పునాదిగా తీసుకుంటారు.భౌతిక పదార్థలైన గాలి నీరు నేల నుండి ఈ విశ్వం ఉద్భవించింది.

జడతత్వ శాస్త్రంతో విభేదాలు

[మార్చు]

జడతత్వ శాస్త్రం (metaphysics) వస్తువుని లేదా విషయాన్ని దాని పరిసరాలతో వేరు చేసినట్టు చూస్తుంది. ఉదాహరణకు జడతత్వవాదుల దృష్ఠిలో మనిషి వేరు సమాజం వేరు. లుడ్విగ్ ఫోయెర్బాఖ్ కూడా గొప్ప నాస్తికుడే. మనిషిని దేవుడు సృష్ఠించలేదు, మనిషి ప్రాకృతిక జీవపరిణామం వల్ల అవతరించాడు అని ఫోయెర్బాఖ్ కూడా అంగీకరించాడు కానీ మనిషికి సమాజానికి ఉన్న సంబంధం గురించి మాత్రం అంగీకరించ లేదు. మనిషి సామాజిక జీవి, మనిషి సమాజం నుంచి వేరు పడలేడని కారల్ మార్క్స్ వాదించాడు. భూమి సూర్యుని గ్రావిటేషన్ శక్తి వల్ల సూర్యుని చుట్టు తిరుగుతోంది. భూమి స్వతంత్రంగా సూర్యుని చుట్టు తిరుగుతోంది అన్నట్టు ఉంటాయి జడతత్వవేత్తల అలోచనలు.

మూలాలు

[మార్చు]