గదర్‌ కుట్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గదర్‌ కుట్ర (హిందుస్తానీ: ग़दर साज़िश, غدر سازِش దర్‌ సాజిష్ ‌) బ్రిటిష్‌ భారత సైన్యంలో దేశవ్యాప్త తిరుగుబాటు లేవనెత్తేందుకు 1915 ఫిబ్రవరిలో గదర్‌ పార్టీ రూపకల్పన చేసిన కుట్ర. మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా 1914 నుంచి 1917 మధ్యలో బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా తిరుగుబాట్లు లేవనెత్తేందుకు రూపొందిన భారీ స్థాయి లెక్కలేనన్ని ఇండో-జర్మన్‌ కుట్రల్లో ఇది చాలా ప్రముఖమైనది. భారత్‌, జర్మనీ, అమెరికాల్లోని భారత జాతీయవాదులు ఈ కుట్ర వెనక ఉన్న కుట్రదారులు. ఐరిష్‌ వాసులు, జర్మనీ విదేశాంగ శాఖ సాయంతో వారు ఇందుకు ప్రయత్నించారు.[1][2][3] ప్రపంచ యుద్ధం మొదలవగానే ఈ కుట్ర ప్రాణం పోసుకుంది. అమెరికాలోని గదర్‌ పార్టీ, జర్మనీలోని బెర్లిన్‌ కమిటీ, భారత్‌లో ప్రవాసంలో ఉన్న భారత జాతీయ విప్లవవాదులు, సిన్‌ ఫెన్‌, శాన్‌ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ ద్వారా జర్మనీ విదేశాంగ కార్యాలయం ఇందులో భాగం పంచుకున్నాయి. కానీ బ్రిటిష్‌ నిఘా వర్గాలు గదర్‌ ఉద్యమంలోకి చొరబడి, పార్టీలోని కీలక సభ్యులను అరెస్టు చేశారు. దాంతో ఫిబ్రవరిలో తలపెట్టిన ఈ తిరుగుబాటు భంగమైంది. భారత్‌లో చిన్న చిన్న సైనిక స్థావరాల్లో మొదలైన తిరుగుబాట్లను ఎక్కడికక్కడ అణచేశారు. ఈ తిరుగుబాటులో అమెరికాలోని గదర్‌ పార్టీ సభ్యులు ప్రముఖ పాత్ర పోషించడంతో ఈ కుట్రకు ఆ పార్టీ పేరు మీదుగా గదర్‌ కుట్రగా ప్రాచుర్యం, ప్రాముఖ్యం లభించాయి.

నేపథ్యం[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా తొలుత ప్రధాన స్రవంతికి చెందిన భారత నేతాగణం నుంచి ఇంగ్లండ్‌కు అనూహ్య మద్దతు, నైతిక నిబద్ధత వంటివి లభించాయి. యుద్ధాన్ని అవకాశంగా తీసుకుని భారత్‌ తిరగబడుతుందని తొలుత బ్రిటన్‌ పడ్డ భయానికి విరుద్ధంగా జరిగింది. సైనికులు, సిబ్బందితో పాటు వనరులను కూడా భారీగా సమకూర్చడం ద్వారా ఇంగ్లండ్‌ మొదటి ప్రపంచ యుద్ధ సన్నాహాలకు భారత్‌ ఎంతగానో దోహదపడింది. ఐరోపా‌, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లో ఏకంగా 13 లక్షల మంది భారతీయులు సైనికులుగా, కార్మికులుగా సేవలందించారు. దాంతోపాటు భారత ప్రభుత్వం, సంస్థానాలు ఆహారం, ధనం, సాయుధ సామగ్రి వంటివాటిని వారికి సరఫరా చేశాయి. కానీ బెంగాల్‌, పంజాబ్‌ మాత్రం వలసవాద వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా విలసిల్లుతూనే వచ్చాయి. బెంగాల్‌లోని ఉగ్రవాదం పంజాబ్‌లోని కల్లోల, అస్థిర పరిస్థితులతో అతి సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వచ్చింది. తద్వారా ఆ ప్రాంతంలో పాలనను దాదాపుగా స్తంభింపజేసింది.[4][5] పైగా యుద్ధం మొదలైనప్పటి నుంచీ భారత ప్రజలు, ముఖ్యంగా అమెరికా, కేనడా, జర్మనీల్లో నివసిస్తున్న వారు బెర్లిన్‌ కమిటీ, గదర్‌ పార్టీల నేతృత్వంలో భారత్‌లో 1857 సిపాయిల తిరుగుబాటు మాదిరి విప్లవాన్ని లేవదీసేందుకు ప్రయత్నించాయి. ఐరిష్‌ రిపబ్లికన్‌, జర్మన్‌, టర్కీ సాయాలతో ఇందుకోసం భారీ కుట్రలకు రూపకల్పన చేసింది. దీన్నే అప్పటి నుంచీ హిందూ జర్మన్‌ కుట్రగా పేర్కొంటూ వచ్చారు. అఫ్గానిస్థాన్‌లో కూడా బ్రిటిషిండియాకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ తీసేందుకు ఈ కుట్రదారులు ప్రయత్నించారు.[2][3][6][7] దాంతోపాటు ఎన్నో విఫల కుట్ర యత్నాలు కూడా చేశారు. వాటిలో సింగపూర్‌లో ఫిబ్రవరిలో జరిగిన తిరుగుబాటు ప్రయత్నం చెప్పుకోదగినది. దాదాపుగా పదేళ్ల పాటు కొనసాగిన ఈ ఉద్యమాన్ని కూడా విపరీతమైన అంతర్జాతీయ కౌంటర్‌ ఇంటలిజెన్స్‌ కార్యకలాపాలు, క్రూరమైన రాజకీయ చర్యలు (భారత రక్షణ చట్టం, 1915 వంటివి) వంటివాటి సాయంతో అణచేశారు.[8][9]

అమెరికాలో భారత జాతీయవాదం[మార్చు]

అమెరికాలో భారత జాతీయవాదానికి సంబంధించిన తొలి ప్రయత్నాలు 20వ శతాబ్ది తొలి దశాబ్దిలోనే మొదలయ్యాయి. అప్పట్లో లండన్‌ ఇండియా హౌస్‌ను ఆదర్శంగా తీసుకుని అలాంటివే పలు సంస్థలను రఅమెరికా, జపాన్‌లలో అక్కడి అధిక సంఖ్యలోని భారత విద్యార్థులు మొదలు పెట్టారు.[10] ఇండియా హౌస్‌ వ్యవస్థాపకుడైన శ్యామ్‌జీ కృష్ణవర్మ ఐరిష్‌ రిపబ్లికన్‌ ఉద్యమంతో అతి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండేవాడు. ఇలా మొదలైన జాతీయవాద సంస్థల్లో పాన్‌ ఆర్యన్‌ అసోసియేషన్‌ మొదటిది. కృష్ణవర్మ ఇండియన్‌ హోమ్‌రూల్‌ సొసైటీ అడుగుజాడల్లో ఇది పుట్టుకొచ్చింది. హోమ్‌రూల్‌ సొసైటీ మహ్మద్‌ బర్కతుల్లా, ఎస్‌ఎల్‌ జోషీ, జార్డ్‌ ఫ్రీమన్‌ల ఇండో-ఐరిష్‌ ప్రయత్నాల ఫలస్వరూపంగా 1906లో ఏర్పడింది.[11] బర్కతుల్లా తొలుత లండన్‌లో ఉన్న కాలంలో కృష్ణవర్మతో సన్నిహిత సంబంధాలు నెరిపాడు. తర్వాత జపాన్‌లో ఉన్న కాలంలో అక్కడి భారత రాజకీయ కార్యకలాపాల్లో తలమునకలయ్యాడు.[11]

సంస్థ అమెరికా శాఖను మేడమ్‌ కామా మొదలు పెట్టారు. ఆమె ఆ సమయంలో కృష్ణవర్మ కార్యకలాపాలకు సన్నిహితంగా మెలిగారు. అమెరికాలో ఆమె పలు ప్రసంగాలిచ్చారు. 1908 జనవరిలో న్యూయార్క్‌లోని మన్‌హాటన్‌లో ఐర్లండ్‌ జాతికి చెందిన సంపన్నుడైన న్యాయవాది మైరన్‌ ఫెల్ఫ్స్‌గా చేసిన ఆర్థిక సాయంతో ఇండియా హౌజ్‌ను స్థాపించారు. స్వామి వివేకానంద అంటే మైరన్‌కు చాలా అభిమానం. న్యూయార్క్‌లో ఆ సమయంలో వివేకానంద స్థాపించిన వేదాంత సొసైటీ స్వామి అభేదానంద ఆధ్వర్యంలో నడిచేది. ఆయనను బ్రిటిషర్లు రెచ్చగొట్టే వ్యక్తిగా చూసేవారు.[10] అమెరికాలోని స్వేచ్ఛాయుతమైన పత్రికా చట్టాలను ఆధారం చేసుకుని, ద ఇండియన్‌ సోషియాలజిస్ట్‌, ఇంకా పలు ఇతర జాతీయవాద సాహిత్యాన్ని న్యూయార్క్‌లోని భారత విద్యార్థులు, లండన్‌ ఇండియా హౌస్‌ మాజీ నివాసులు పంపిణీ చేసేవారు.[10] ఇలా ప్రపంచవ్యాప్త భారత ఉద్యమానికి న్యూయార్క్‌ కేంద్రంగా మారసాగింది. ఫ్రీ హిందూస్థాన్‌ అనే రాజకీయ విప్లవాత్మక జర్నల్‌ను తారక్‌నాథ్‌ దాస్‌ ప్రచురించారు. ఇది ద ఇండియన్‌ సోషియాలజిస్ట్‌ మాదిరిగానే ఉండేది. దీన్ని వాంకోవర్‌, సియాటిల్‌ల నుంచి న్యూయార్క్‌కు 1908లో తరలించారు. జార్డ్‌ ఫ్రీమన్‌ సాయంతో గైలిక్‌ అమెరికన్‌తో కూడా దాస్‌ విస్తృత భాగస్వామ్యాన్ని నెలకొల్పుకున్నారు. చివరికి 1910లో బ్రిటిష్‌ దౌత్య ఒత్తిళ్ల కారణంగా ఫ్రీ హిందూస్థాన్‌ను నిషేధించారు.[12] 1910 తద్వారా అమెరికా తూర్పు తీరంలో కార్యకలాపాలు క్షీణించసాగాయి. అవి నెమ్మదిగా శాన్‌ఫ్రాన్సిస్కోకు తరలాయి. దాదాపుగా ఇదే సమయంలో హరదయాళ్‌ రంగప్రవేశంతో మేధావులైన నిరసనకారులు, సంఖ్యాపరంగా అధిక సంఖ్యలో ఉన్న పంజాబీ కార్మికులు, వలసవాదుల మధ్య ఉన్న అంతరం తొలగిపోయి, గదర్‌ పార్టీకి పునాదులు బలంగా పాదుకున్నాయి.[12]

గదర్ పార్టీ[మార్చు]

ఉత్తర అమెరికాలోని పసిఫిక్‌ తీరం 1900 సమయంలో భారీ భారత వలసలకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ఆర్థిక మాంద్యంతో బాధ పడుతున్న పంజాబ్‌ నుంచి భారీగా ఈ వలసలు సాగాయి. ఈ భారీ వలసలను నిరోధించేందుకు కెనడా ప్రభుత్వం చట్టాలు చేసింది. తద్వారా దక్షిణాసియా వాసులను కెనడాలోకి రాకుండా నిరోధించింది. అప్పటికే దేశంలో ఉన్నవారి రాజకీయ హక్కులను కూడా బాగా నియంత్రించింది. అప్పటిదాకా బ్రిటిష్‌ సామ్రాజ్యానికి, కామన్వెల్త్‌ దేశాలకు నమ్మకమైన సైనిక శక్తిగా పనిచేస్తూ వచ్చిన పంజాబీలు ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. తమ సేవలకు ప్రతిగా తమ చిత్తశుద్ధిని గౌరవించాలని, బ్రిటిష్‌ శ్వేతజాతి వలసవాదులతో సమానంగా బ్రిటిష్‌, కామన్వెల్త్‌ దేశాల్లో తమకు కూడా గౌరవం దక్కాలని వారు ఆశించారు. అలాంటి సమయంలో కెనడా చేసిన ఈ నియంత్రక చట్టాలు వారిలో అసంతృప్తికి మరింతగా ఆజ్యం పోశాయి. నిరసనలకు, పంజాబీల్లో వలసవాద వ్యతిరేకతలకు బీజాలు వేశాయి. ఈ సమస్యాత్మక పరిస్థితుల నడుమ పంజాబీలు తమలో తాము వ్యవస్థీకృతం కాసాగారు. దాంతోపాటు పంజాబీలు భారీ సంఖ్యలో అమెరికాకు తరలి వెళ్లారు. కానీ అక్కడ కూడా వారికి అవే రాజకీయ, సామాజిక సమస్యలు ఎదురయ్యాయి.[13]

అదేసమయంలో, తూర్పు తీరంలో ఉన్న భారతీయుల్లోని జాతీయవాదులు కూడా 1908 సమయంలో ఒక్కటవడం మొదలు పెట్టారు. పీఎస్‌ ఖంకోజీ, కాన్షీరాం, తారక్‌నాథ్‌ దాస్‌ వంటి భారతీయ విద్యార్థులు ఆరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌ను స్థాపించారు. ఆ సమయంలో ఆయన కార్యకలాపాలు ఆయన్ను అమెరికాలో ఉన్న తారక్‌నాథ్‌ దాస్‌ వంటి భారత జాతీయవాదులకు మరింతగా సన్నిహితం చేయసాగాయి. మొదటి ప్రపంచ యుద్ధం ముందు సంవత్సరాల్లో పసిఫిక్‌ కోస్ట్‌ హిందూస్థాన్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుల్లో ఖంకోజీ కూడా ఒకరు అనంతరం ఆయన గదర్‌ పార్టీని స్థాపించారు. ఆ సమయంలో పార్టీలో ఆయనే అత్యంత ప్రభావశీలుడైన సభ్యునిగా ఉండేవారు. 1911లో ఆయన లాలా హరదయాళ్‌ను కలిశారు. ఆయన ఒక సమయంలో వెస్ట్‌కోస్ట్‌ మిలిటరీ అకాడెమీలో కూడా చేరారు. తొలుత పసిఫిక్‌ కోస్ట్‌ హిందూస్థాన్‌ అసోసియేషన్ ‌గా పిలిచన గదర్‌ పార్టీ 1913లో హరదయాళ్‌ నేతృత్వంలో అమెరికాలో ఏర్పాటైంది. సోహన్‌సింగ్‌ భక్నా దానికి అధ్యక్షుడయ్యారు. భారత వలసవాదులు, ముఖ్యంగా పంజాబ్ల నుంచి సభ్యులను ఎక్కువగా చేర్చుకుంది.[13] దాని సభ్యుల్లో కూడా చాలామంది బెర్కెలీలోని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన వారే. దయాళ్‌, తారక్‌నాథ్‌ దాస్‌, కర్తార్‌సింగ్‌ సర్భా, వీజీ పింగళే వంటివారు వీరిలో ముఖ్యులు. ఈ పార్టీకి అమెరికా, కెనడా, ఆసియాల నుంచి వెళ్లగొట్టబడ్డ భారత సంతతి వారిలో అభిమానం, మద్దతు విపరీతంగా పెరిగాయి. లాస్‌ ఏంజెలెస్‌, ఆక్స్‌ఫర్డ్‌, వియన్నా, వాషింగ్టన్‌ డీసీ, షాంఘైల్లో గదర్‌ సమావేశాలు జరిగాయి.[14]

భారత్‌లోని బ్రిటిష్‌ వలసవాద రాజ్యాన్ని సాయుధ విప్లవం ద్వారా కూలదోయడమే గదర్‌ అంతిమ లక్ష్యం. భారత్‌కు డొమీనియన్‌ ప్రతిపత్తి కావాలంటూ కాంగ్రెస్‌ నేతృత్వంలో స్వదేశంలో జరుగుతున్న ప్రధాన స్రవంతి ఉద్యమాన్ని మితవాద ఉద్యమంగా, వారి రాజ్యాంగబద్ధమైన నిరసన ప్రయత్నాలను మరీ సుతారమైనవిగా పరిగణించింది. భారత సైనికులను తిరుగుబాటుకు రెచ్చగొట్టడమే గదర్‌ తాలూకు అతి ముఖ్యమైన వ్యూహం.[13] అందుకోసం 1913లో గదర్‌ యుగంతర్‌ ఆశ్రమ్‌ అనే ముద్రణా సంస్థను శాన్‌ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసింది. హిందూస్థాన్‌ గదర్‌ పత్రిక, ఇతర జాతీయవాద సాహిత్యాన్ని ఈ ముద్రణా సంస్థ ఉత్పత్తి చేసింది.[14]

గదర్‌ కుట్ర[మార్చు]

1914లో వాంకోవర్‌లోని బుర్రాడ్‌ ఇన్‌లెట్‌లోని కొమగత మేరు నౌకలోని పంజాబీ సిక్కులునౌకలోని ప్రయాణికుల్లో అత్యధికులను కెనడాలోకి అనుమతించలేదు. వారిని బలవంతంగా భారత్‌కు తిప్పి పంపారు.కొమగత మేరును ఆధారం చేసుకుని జరిగిన ఉదంతాలు గదర్‌ ఉద్యమానికి బాగా ఊతమిచ్చాయి.

ప్యారిస్‌, బెర్లిన్లలోని ఇండియా హౌస్‌ల మాజీ సభ్యులతో హరదయాళ్‌కు ఉన్న సంబంధాలు ఇండో-జర్మన్‌ భాగస్వామ్య భావనకు తావిచ్చాయి. తద్వారా అది పాదుకొనేందుకు సాయపడ్డాయి. ఈదిశగా 1913 చివరి నాటికి రాస్‌ బిహారీ బోస్‌ వంటి ప్రఖ్యాత భారత విప్లవకారులతో గదర్‌ పార్టీ సంబంధాలు ఏర్పరచుకుంది. హిందూస్థాన్‌ గదర్‌ తాలూకు భారత ఎడిషన్‌ కూడా భారత్‌లోని బ్రిటిష్‌ ప్రయోజనాలకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారీ ఉగ్రవాదం, అరాచకం వంటి తత్వాలనే ప్రబోధించింది. పంజాబ్‌లో రాజకీయ అసంతృప్తి, హింస పెరుగుతూ వచ్చాయి. అదే సమయంలో కాలిఫోర్నియా నుంచి బాంబేకు వచ్చే గదర్‌ ప్రచురణలను రెచ్చగొట్టే సాహిత్యంగా పేర్కొంటూ ప్రభుత్వం వాటిని నిషేధించింది. ఇవన్నీ 1912లో గదర్‌ కుట్రకు ముందే జరిగిన ఢిల్లీ-లాహోర్‌ కుట్రలో ప్రతిఫలించాయి. దాంతో అత్యధికంగా శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి పుట్టుకొస్తున్న గదర్‌ సాహిత్యం, భారత విప్లవకార కార్యకలాపాలను నిషేధించేలా అమెరికాపై బ్రిటిష్‌ ప్రభుత్వం బాగా ఒత్తిడి తీసుకొచ్చింది.[15][16]

1914[మార్చు]

మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా బ్రిటిష్‌ వారి యుద్ధ ప్రయత్నాలకు బ్రిటిషిండియా సైన్యం ఎంతగానో సాయం చేసింది. చివరికి భారత్‌లో మరీ తక్కువగా, అంటే కేవలం వే15 ల మంది బ్రిటిష్‌ సైనికులు మాత్రమే 1914 నాటికి భారత్‌లో ఉన్నారు.[17] ఈ పరిస్థితిలో భారత్‌లో తిరుగుబాటు ప్రయత్నాలను వ్యవస్థీకృతం చేసే యత్నాలు జోరందుకున్నాయి.

1913 సెప్టెంబరులో గదర్‌ పార్టీకి చెందిన మాత్రా సింగ్‌ షాంఘై సందర్శించాడు. అక్కడి గదర్‌ సమాజ సభ్యులను స్ఫూర్తిమంతులను చేసే బాధ్యతను ఆయనకు అప్పగించారు. 1914 జనవరిలో ఆయన భారత్‌కు వచ్చి, హాంకాంగ్‌ వెళ్ళే ముందు తనకున్న సంబంధాల సాయంతో భారత సైనికుల్లో గదర్‌ సాహిత్యాన్ని పంచాడు. భారత్‌లో పరిస్థితి విప్లవానికి పూర్తి సానుకూలంగా ఉందని హాంకాంగ్‌కు తిరిగి వెళ్లే ముందు పార్టీ పెద్దలకు నివేదిక పంపాడు.[18][19]

మే1914 నెలలో కెనడా ప్రభుత్వం 400 మంది భారత ప్రయాణికులను కొమగత మేరు నౌక నుంచి వాంకోవర్‌లో దిగేందుకు అనుమతించలేదు. భారతీయుల ఇమిగ్రేషన్‌ను నిరోధిస్తున్న కెనడా చట్టాలను ఎదిరించడమే ఈ ప్రయాణం లక్ష్యం. నౌక వాంకోవర్‌ చేరేముందే దాని గమనాన్ని జర్మన్‌ రేడియో ప్రసారం చేసింది. దాని ప్రయాణికులు కెనడాలో దిగకుండా నిరోధించాలని బ్రిటిష్‌ కొలంబియన్‌ వర్గాలు సిద్ధమయ్యాయి. ఈ ఉదంతమే కెనడాలోని భారత వర్గాలు ఈ ప్రయాణికులకు మద్దతుగా, కెనడా చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తక్షణ కారణంగా నిలిచింది. రెండు నెలల న్యాయ పోరాటం తర్వాత వారిలో 24 మందిని కెనడాలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. దాంతోపాటే నౌకను వాంకోవర్‌ నుంచి దూరంగా హెచ్‌ఎంసీఎస్‌ రెయిన్‌బో నౌక సంరక్షణలో భారత్‌కు పంపించేశారు. కలకత్తా చేరగానే అందులోని ప్రయాణికులందరినీ భారత రక్షణ చట్టం కింద బడ్జ్‌బడ్జ్‌ వద్ద బ్రిటిష్‌ ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వారిని బలవంతంగా పంజాబ్‌ తిప్పి పంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇవి బడ్జ్‌బడ్జ్‌లో అల్లర్లకు, ఇరు వర్గాల మధ్య గొడవలకు, ప్రాణ నష్టానికి దారి తీశాయి.[20] కొమగత మేరు ఉదంతం, సంబంధిత చర్యలను సాయంగా తీసుకుని జాతీయవాద భావాలను రెచ్చగొట్టేందుకు బర్కతుల్లా, తారక్‌నాథ్‌ దాస్‌ వంటి గదర్‌ పార్టీ నేతలు ప్రయత్నించారు. ఉత్తర అమెరికాలోని పలువరు అసంతృప్త భారతీయులను గదర్‌ పార్టీలోకి తేవడంలో వారు సఫలులయ్యారు.[19]

తిరుగుబాటు రూపురేఖలు[మార్చు]

1914 అక్టోబరుకల్లా భారీ సంఖ్యలో గదర్‌వాదులు భారత్‌కు తిరిగి వచ్చారు. భారత తిరుగుబాటుదారులు, సంస్థల వంటివాటిని కలుసుకున్నారు. తమ ప్రచారం, సాహిత్యాలను పంచిపెట్టారు. జర్మనీ సాయంతో అమెరికా నుంచి భారత్‌లోకి ఆయుధాలను చేరవేసేందుకు ప్రయత్నాలు కూడా చేయసాగారు.[21] జ్వాలా సింగ్‌ నేతృత్వంలో 60 మందితో కూడిన తొలి గదర్‌ బృందం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఎస్‌ఎస్‌ కొరియా నౌకలో ఆగస్టు 29న కాంటన్‌కు బయల్దేరింది. వారు భారత్‌ రాగానే ఆయుధాలను చేజిక్కించుకుని, తిరుగుబాటుకు నేతృత్వం వహించాలన్నది ఉపాయం. కాంటన్‌లో మరింత మంది భారతీయులు వారితో కలిశారు. ఇప్పుడు వారి సంఖ్య 150కి పెరిగింది. వారంతా కలిసి ఒక జపాన్‌ నౌకలో కలకత్తా వెళ్లారు. అక్కడ చిన్న చిన్న సమూహాల్లో తమ కోసం ఎదురు చూస్తున్న మరింత మంది భారతీయులతో వారు కలవాల్సి ఉంది. సెప్టెంబర్‌-అక్టోబర్‌ సమయంలో దాదాపు 300 మంది భారతీయులు ఎస్‌ఎస్‌ సైబీరియా, చిన్యో మేరు, చైనా, మంచూరియా, ఎస్‌ఎస్‌ తెన్యో మేరు, ఎస్‌ఎస్‌ మంగోలియా, ఎస్‌ఎస్‌ షిన్యో మేరు వంటి పలు నౌకల్లో భారత్‌కు బయల్దేరారు.[18][21][22] కానీ ఎస్‌ఎస్‌ కొరియా లోని బృందాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వం కనిపెట్టి, కలకత్తా చేరగానే అరెస్టుచేసింది. అయినా అమెరికా, భారత్‌ బృందాల మధ్య షాంఘై, స్వాటో, సియాంల గుండా విజయవంతంగా నెట్‌వర్క్‌ ఏర్పాటైంది. షాంఘైలోని గదర్‌ పార్టీ సభ్యులు తెహ్ల్‌ సింగ్‌ భారత్‌లోని విప్లవకారులకు సాయపడేందుకు వేల30 డాలర్లు వెచ్చించినట్టు సమాచారం.[23]

తిరిగి వచ్చిన వారిలో విష్ణు గణేశ్‌ పింగలే, కర్తార్‌ సింగ్‌, సంతోక్‌ సింగ్‌, పండిట్‌ కాన్షీరాం, భాయీ భగవాన్‌ సింగ్‌ వంటివారున్నారు. వీరంతా గదర్‌ పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నవారే. పింగళేకు జతిన్‌ ముఖర్జీ వార్తాహరుడైన సత్యేన్‌ భూషణ్‌ సింగ్‌ బాగా తెలుసు. కర్తార్‌ సింగ్‌ సర్బా వంటి గదర్‌ పార్టీ సభ్యులతో బెర్కెలీ వర్సిటీలో ఆయనను పింగళే చాలాసార్లు చూశారు. గదర్‌ తిరుగుబాటు కుట్రలో భాగంగా భారత తిరుగుబాటు ఉద్యమంతో సన్నిహిత సంబంధాలు నెరిపేందుకు సత్యేన్‌ భూషణ్‌ సేన్‌, కర్తార్‌ సింగ్‌ సర్బా, విష్ణు గణేశ్‌ పింగళేలతో పాటు కొందరు సిక్కు మిలిటెంట్లతో కూడిన బృందం అమెరికానుం చి ఎస్‌ఎస్ ‌సలామిన్‌లో 1914 అక్టోబర్‌ రెండో అర్ధ భాగంంలో పయనమైంది. సత్యేన్‌, పింగళే చైనాలో కొద్ది రోజుల పాటు ఆగారు. గదర్‌ నేతలను, ముఖ్యంగా తహల్‌ సింగ్‌ను కలవడంతో పాటు భావి వ్యూహాలను రూపొందించడం వారి లక్ష్యం. డాక్టర్‌ సన్‌యట్‌సేన్‌ను కూడా వారు కలిసి సహకారం అర్థించారు. కానీ బ్రిటిష్‌ వారిని అసంతుష్టులను చేసేందుకు డాక్టర్‌ సేన్‌ సిద్ధంగా లేరు. సత్యేన్‌, ఆయన బృందం భారత్‌కు బయల్దేరాక ఆత్మారాం కపూర్‌, సంతోష్‌ సింగ్‌, శివ్‌దయాల్‌ కపూర్‌లను కావాల్సిన ఏర్పాట్ల కో సం తహల్‌ బ్యాంకాక్‌ పంపారు.[24][25][26][27] 1914 నవంబరులో పింగళే, కర్తార్‌ సింగ్‌, సత్యేన్‌ సేన్‌ కలకత్తా వచ్చారు. అక్కడ పింగళే, కర్తార్‌ సింగ్‌లను జతిన్‌ ముఖర్జీకి సత్యేన్‌ పరిచయం చేశారు. జతిన్‌ ముఖర్జీతో పింగళే చాలాసేపు చర్చలు జరిపారు. ఆయన పింగళేను రాస్‌ బిహారీ వద్దకు పంపారు. డిసెంబర్‌ మూడో వారంలో తగిన సమాచారం ఇచ్చి, బెనారస్‌కు పంపారు.[28] కలకత్తాలో 159, బౌ బజార్‌ (వీధి) లో సత్యేన్‌ ఉండిపోయాడు. దక్షిణేశ్వర్‌ గన్‌పౌడర్‌ బజార్‌లో కొన్ని సిక్కు సైనిక బృందాలను ప్రభావితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల గురించి టెగార్ట్‌కు సమాచారం అందింది. ఈ దళాలు 93వ బుర్దమాన్‌రెజిమెంట్‌కు చెందిన వారని సైనిక వర్గాలను ఉటంకిస్తూ వచ్చిన సమాచారం పేర్కొంటోంది అని మెసపుటోమియాకు వర్తమానం పంపారు. జతిన్‌ ముఖర్జీ, సత్యేన్‌లను ఈ సిక్కులను ఇంటర్వ్యూ చేసేందుకు పంపారు.[29] బెంగాల్‌లోని ప్రముఖ ప్రవాసంలోని భారత విప్లవకారులతో గదర్‌ పార్టీ సభ్యులు శరవేగంగా సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. రాస్‌ బిహారీ బోస్‌, జతిన్‌ ముఖర్జీ, గా దర్‌ పార్టీ సభ్యులు సాధారణ తిరుగుబాటు కోసం ప్రయత్నాలను సమన్వయ పరచుకున్నారు. వారి వ్యూహాలు వ్యవస్థీకృతం కావడం మొదలైంది.

తొలి ప్రయత్నాలు[మార్చు]

లోకమాన్య తిలక్‌ స్ఫూర్తితో ఈ భారత తిరుగుబాటుదారులు బెనారస్‌ను ప్రబోధ కేంద్రంగా 1900 నుంచీ మొదలు పెట్టారు. సుబేదార్‌ లాల్‌ (1885లో జన్మించారు. ముజఫర్‌నగర్‌కు చెందిన తోతారాం కుమారుడు) 1907లో బెనారస్‌లో శివాజీ పండుగ సందర్భంగా చాలా అభ్యంతరకరమైన ప్రసంగం చేశారు. తిలక్‌, లాలా లజపతి రాయ్‌, శ్రీ అరవిందో ఘోష్‌ల అనుయాయి అయిన ఆయన యూపీ ప్రసంగ పర్యటనలో లాలాను అనుసరించారు. లాలాకు చెందిన అలహాబాద్‌లోని స్వరాజ్య సంస్థను ఈ రెచ్చగొట్టడాలకు వ్యతిరేకంగా 1908 ఏప్రిల్‌లో హెచ్చరికలు జారీ అయ్యాయి. 1909ఆగస్టు 22న సుందర్‌లాల్‌, శ్రీ అరబిందో కలకత్తా కాలేజీ స్క్వేర్‌ వద్ద ఆకతాయితనపు ప్రసంగాలు చేశారు. కర్మయోగి 1909 సెప్టెంబర్‌ నుంచి అలహాబాద్‌లో హిందీలో రాసాగింది: దీన్ని శ్రీ అరబిందో నియంత్రించారు. కలకత్తా కర్మయోగిన్ ‌కు అమరేంద్ర చటర్జీ సంపాదకత్వం వహించారు. రాస్‌ బిహారీని సుందర్‌లాల్‌కు ఆయనే పరిచయం చేశారు. 1915లో పింగళేను అలహాబాద్‌లో స్వరాజ్య బృందం స్వాగతం పలకనుంది.[30] 1914 నుంచీ రాస్‌ బిహారీ బోస్‌ బెనారస్‌లో ఉన్నారు. 1914 అక్టోబర్‌ నుంచి 1915 సెప్టెంబర్‌ మధ్య కాలంలో అక్కడ చాలా నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటిలో 45 దాకా ఒక్క ఫిబ్రవరిలోనే చోటుచేసుకున్నాయి. 1914 నవంబర్‌ 18న రెండు బాంబు మూతలను పరిశీలిస్తున్న సమయంలో ఆయన, సచిన్‌ సన్యాల్‌ గాయపడ్డారు. వారిని బంగాలీతల ఆస్పత్రికి తరలించారు. అక్కడ జతిన్‌ ముఖర్జీ రాసిన లేఖ తీసుకుని పింగళే వారిని కలుసుకున్నారు. గదర్‌ పార్టీకి చెందిన దాదాపు 4000 మంది సిక్కులు అప్పటికే కోల్‌కతా చేరుకున్నారని చెప్పారు. మరో 15 వేల మంది వచ్చి తిరుగుబాటులో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించారు.[31] పింగళే, సచిన్‌లను బోస్‌ అమృత్‌షర్‌కు పంపారు. షాంఘై నుంచి వచ్చిన మౌలా సింగ్‌తో చర్చలు జరపాల్సిందిగా కోరారు. రాస్‌ బిహారీకి విశ్వాసపాత్రుడైన పింగళే యూపీ, పంజాబ్‌లలో కొద్ది వారాల పాటు ఊపిరి సలపని పనుల్లో గడిపారు.[32]

కలకత్తా సమీపంలోని బడ్జ్‌ బడ్జ్‌లో కొమగత మేరు ఉదంతం సందర్భంగా 1914 సెప్టెంబర్‌ 29న బాబా గుర్ముఖ్‌ సింగ్‌, అతుల్‌ కృష్ణ ఘోష్‌, సతీశ్‌ చక్రవర్తి అనే ఇద్దరు ప్రఖ్యాత జతిన్‌ముఖర్జీ సహాయకులను సంప్రదించారు. వారు ఆయనకు చురుగ్గా సహకరించారు. అప్పటి నుంచీ జర్మనీ విజయంపై ఆశలు పెట్టుకున్న అమెరికాలోని భారతీయుల నుంచి ఆగ్రహంతో కూడిన లేఖలు భారత్‌కు వస్తుండేవి. అందులో ఒక ప్రఖ్యాత ప్రవాస నేత అయితే తనసహాయకకులు బెంగాల్‌ విప్లవ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారని కూడా ఒక లేఖలో హెచ్చరించారు. అదే సందర్భంలో 1914 డిసెంబరులో పింగళే పంజాబ్‌కు వెళ్లారు. అక్కడి ప్రవాసులకు బెంగాలీల మద్దతుంటుందని హామీ ఇచ్చారు. విప్లవం లేవనెత్తాలని, ప్రభుత్వ ఖజానాలను కొల్లగొట్టాలని ఒక సమావేశం డిమాండ్‌ చేసింది. భారత దళాలను రెచ్చగొట్టాలని, ఆయుధాలు సేకరించాలని, బాంబులు తయారు చేయాలని, బందిపోటు దొంగతనాలను పాల్పడాలని కోరింది. విప్లవం కోసం గ్రామస్థుల కూడిన దళాలను ఏర్పాటు చేసేందుకు రాస్‌ ప్రయత్నించారు. అదే సమయంలో లాహెAర్‌, ఫిరోజ్‌పూర్‌, రావల్పిండిల్లో తిరుగుబాటులకు వ్యూహరచన చేశారు. ఢాకా, బెనారస్‌, జబల్పూర్‌లకు కూడా ఏర్పాట్లను విస్తరించారు.[33]

బాంబుల తయారీ గదర్‌ కార్యక్రమాల్లో కచ్చితమైన భాగంగా ఉండేది. సిక్కు విద్రోహూలు (వారికి బాంబుల తయారీ ఎలాగో తెలిసింది చాలా తక్కువ కాబట్టి) ఒక బెంగాలీ బాంబు తయారీ నిపుణున్ని పిలిపించారు. తారక్‌నాథ్‌ దాస్‌ సహాయకుడైన కాలిఫోర్నియా ప్రొఫెసర్‌ సురేంద్ర బోస్‌కు వారు ముందే తెలుసు. 1914 డిసెంబర్‌ చివరికల్లా కపుర్తలాలో ఒక సమావేశం జరిగింది. తమతో సహకరించేందుకు బెంగాలీ బాబు సిద్ధంగా ఉన్నారని అందులో పింగళే ప్రకటించారు. 1915 జనవరి 3న పింగళే, శచీంద్ర అమృత్‌షర్‌లో గదర్‌ నుంచి 500 రూపాయలు స్వీకరించారు. బెనారస్‌లో ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్చ్చారు.[34]

సమన్వయం[మార్చు]

సమన్వయం ఏర్పాటు చేసుకుని, తుది ప్రణాళికను ఖరారు చేసేందుకు చర్చలకు రావాల్సిందిగా జుగంతర్‌ నేతలకు రాస్‌ బిహారీ ఆహ్వానంపై పింగళే కలకత్తా తిరిగి వచ్చారు. జతిన్‌ ముఖర్జీ, అతుల్‌కృష్ణ ఘోష్‌, నరేన్‌ భట్టాచార్య వంటివారు బెనారస్‌ బయల్దేరారు (1915 జనవరి మొదట్లో) . ఒక అతి ముఖ్యమైన సమావేశంలో, విప్లవాన్ని రాస్‌ బిహారీ బోస్‌ ప్రకటించారు. 'దేశం కోసం మరణించండి' అని ఈ సందర్భంగా ఆయన నినదించారు. హవల్దార్‌ మన్షా సింగ్‌ సాయంతో ఫోర్ట్‌ విలియంలోని 16వ రాజ్‌పుత్‌ రైఫిల్స్‌ విజయవంతంగా కోటను సమీపించేలా ఒప్పంచారు. కానీ సాయుధ సైనిక తిరుగుబాటుకు మరో రెండు నెలల సమయం కావాలని జతిన్‌ కోరారు. జర్మనీ ఆయుధాలు కూడా వచ్చాక వాటి సాయంతో విప్లవం లేవదీయవచ్చన్నారు. కానీ తక్షణం బరిలో దిగేందుకు గదర్‌ మిలిటెంట్లు రఅసహనంతో ఉండటంతో తన ప్రణాళికను కాస్త మార్చారు. రాస్‌ బిహారీ, పింగళే లాహోర్ వెళ్లారు. సచిన్‌ 7వ రాజ్‌పుత్స్‌ (బెనారస్‌), 89వ పంజాబీస్‌ (దీనాపూర్‌) రెజిమెంట్లను ఒప్పించారు. దామోదర్‌స రూప్‌ (సేథ్‌) అలహాబాద్‌ వెళ్లారు. వినాయక్‌ రావ్‌ కపిలే బెంగాల్‌ నుంచి పంజాబ్‌కు బాంబులను రవాణాచే శారు. విభూతి ( హల్దార్‌, అప్రూవర్‌గా మారాడు), ప్రియనాథ్‌ (భట్టాచార్య?) బెనారస్‌లోని సైనిక బలగాలను ఒప్పించారు. నళినీ (ముఖర్జీ) జబల్‌పూర్‌లో అదే పనిచేశారు. బాంబు తయారీ సామగ్రి ఉన్న ఒక పార్సిల్‌ను ఫిబ్రవరి 14న కపిలే బెనారస్‌ నుంచి లాహోర్‌కు రవాణా చేశారు.[35][36]

జనవరి మధ్య నాటికే పింగళేఅమత్‌సర్‌కు ఫత్‌ బాబు (రాస్‌ బిహారీ) తో కలిసి వచ్చారు. మరీ ఎక్కువగా వస్తున్న సందర్శకులను తప్పించుకునేందుకు రాస్‌ బిహారీ ఓ పక్షం రోజుల తర్వాత లాహెAర్‌ తిరిగి వెళ్లారు. ఈ రెండు స్థానాల్లోనూ వారు బాంబు తయారీ సామగ్రిని సేకరించారు. దాంతోపాటు లాహోర్‌లోని ఫౌండ్రీలో 80 బాంబు కేసులకు ఆర్డర్‌ ఇచ్చారు. దాని యజమాని అనుమానంతో అందుకు తిరస్కరించారు. దాంతో సిరాబుడ్డీలనే బాంబు కేసులుగా ఉపయోగించారు. పలు బందిపోటు దొంగతనాల్లో వాటినే వాడారు. ఇళ్ల సోదాల సందర్భంగా, పూర్తిగా తయారైన పలు బాంబులు బయట పడ్డాయి. కాకపోతే రాస్‌ బిహారీ మాత్రం వాటి నుంచి తప్పించుకున్నారు. కానీ అప్పటికే తిరిగి వచ్చిన గదర్‌ సభ్యులకు, రాస్‌ బిహారీ నేతృత్వంలోని విప్లవకారులకు మధ్య మంచి సంబంధాలు స్థిరపడ్డాయి. పైగా వాయవ్యంలోని పెద్ద సంఖ్యలో సైనికులు కూడా వారితో చేతులు కలిపారు. సంకేతాలు అందిన తక్షణం పంజాబ్‌ నుంచి బెంగాల్‌ దాకా తిరుగుబాటు లేవదీయాలని నిర్ణయించారు. లాహోర్ కుట్ర కేసులోని 81 మంది నిందితుల్లో రాస్‌ బిహారీ, ఆయన సన్నిహితులైన పింగళే, మథురా సింగ్‌, కర్తార్‌ సింగ్‌ కర్బా వంటి 48 మంది ఇటీవలే ఉత్తర అమెరికా నుంచి తిరిగి వచ్చారు.[37]

రాస్‌ బిహారీ బోస్‌తో పాటు సచిన్‌ సాన్యాల్‌, కర్తార్‌ సింగ్‌, పింగళే 1915 ఫిబ్రవరిలో తలపెట్టిన తిరుగుబాటులో ప్రముఖ పాత్రధారులయ్యారు. రాస్‌ బిహారీ నేతృత్వంలో ఈ విప్లవం గురించి 1914 డిసెంబర్‌ నుంచే పింగళే విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం కొన్నిసార్లు శ్యాంలాల్‌ అనే బెంగాలీగా, మరికొన్ని సార్లు గణ్‌పత్‌ సింగ్‌ అనే పంజాబీగా మారువేషాలు కూడా ఆయన వేసేవారు.[38]

తేదీ నిర్ణయం[మార్చు]

భారత సిపాయిల మద్దతు పూర్తిగా పొందగలమనే విశ్వాసంతో తిరుగుబాటుకు తుది ప్రయత్నాలు అప్పటికే రూపుదిద్దుకోసాగాయి. పంజాబ్‌లోని 23వ పదాతి దళం ఫిబ్రవరి 21న రోలింగ్‌లో ఉన్న సమయంలో తమ పై అధికారులను చంపేసి, ఆయుధాలను సేకరించాలన్నది వ్యూహం. తర్వాత 26న పంజాబ్‌లో తిరుగుబాటు లేవాలి. తిరుగుబాటు మొదలైందనేందుకు అదే ప్రారంభ సూచిక. ఢిల్లీ, లాహెAర్‌లలో కూడా దాన్ని అనుసరించి తిరుగుబాట్లు మొదలు కావాలి. బెంగాల్‌ విప్లవకారులు ఢాకాలోని సిక్కు సైనిక దళాలను లాహోర్‌లోని సిక్కు సైనికుల పరిచయ పత్రాల సాయంతో కలిశారు. వారిమద్దతు కూడా కూడగట్టడంలో సఫలమయ్యారు.[39] ఆ తర్వాతి రోజు హౌరా స్టేషన్‌కు వచ్చే పంజాబ్‌ మెయిల్‌ (పంజాబ్‌ను ముట్టడిస్తే దాన్ని మూసేసేవారు) ను బెంగాల్‌ విభాగం తక్షణం ముట్టడించాలని నిర్ణయించారు.

దేశవ్యాప్త తిరుగుబాటు[మార్చు]

1915 ప్రారంభం నాటికి పెద్ద సంఖ్యలో గదర్‌ సభ్యులు (ఒక్క పంజాబ్‌ ప్రావిన్సులోనే ఏకంగా 8000 మంది అన్నది ఒక అంచనా) భారత్‌కు తిరిగి వచ్చారు.[4][40] అయితే, వారంతా ఒక కేంద్రీకృత నాయకత్వం కింద పని చేయడం ఇంకా మొదలు పెట్టలేదు. కేవలం తమ తమ తాత్కాలిక పద్ధతి కింద పనిచేస్తున్నారు. వారిలో కొందరిని పోలీసులు అప్పటికే అనుమానంతో చుట్టుముట్టారు. కానీ వారిలో చాలామంది మాత్రం దొరక్కుండా తప్పించుకున్నారు. దాంతోపాటు లాహోర్‌, ఫిరోజ్‌పూర్‌, రావల్పిండి వంటి పెద్ద నగరాల్లోని తమ దళాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోగలిగారు. లాహోర్ ‌ సమీపంలోని మియా మీర్‌ సైనిక గిడ్డంపై దాడి చేయాలని, తద్వారా నవంబర్‌ 1914 15 సాధారణ తిరుగుబాటుకు తెర తీయాలని నిర్ణయం జరిగింది. మరో పథకం ప్రకారం కొందరు సిక్కు సైనికుల సమూహం (మంజా జాతా ) లాహోర్ సైనిక శిబిరంలోని 23వ పదాతి దళంలో నవంబర్‌ 26న తిరుగుబాటుకు నిర్ణయం తీసుకుంది. తర్వాత నిదామ్‌ సింగ్‌ నేతృత్వంలో ఫిరోజ్‌పూర్‌లో నవంబర్‌ 30న తిరుగుబాటు మొదలు కావాలని నిశ్చయించారు.[41] బెంగాల్‌లో జతిన్‌ ముఖర్జీ ద్వారా కలకత్తాలోని ఫోర్ట్‌ విలియం శిబిరంతో జుగంతర్‌ సంబంధాలు ఏర్పాటు చేసుకోగలిగింది.[4][42] 1914 ఆగస్టులో ముఖర్జీ శిబిరం భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని భారత్‌లోని పెద్ద తుపాకీ తయారీ సంస్థ అయిన రోడా కంపెనీ నుంచి కొల్లగొట్టగలిగింది. తిరుగుబాటుకు నిధులు సమకూర్చుకునేందుకు డిసెంబరులో కలకత్తాలో పలు రాజకీయ ప్రేరేపిత సాయుధ బందిపోటు దొంగతనాలు జరిగాయి. ముఖర్జీ కర్తార్‌ సింగ్‌, వీజీ పింగళేల ద్వారా రాస్‌ బిహారీతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. అప్పటిదాకా పలు గ్రూపులు సొంతంగా నిర్వహిస్తూ వచ్చిన ఈ తిరుగుబాటు చర్యలు ఇప్పుడు కేంద్రీకృతమయ్యాయి. ఉత్తరాన రాస్‌బిహారీ బోస్‌, మహారాష్ట్రలో వీజీ పింగళే, బెనారస్‌లో శచీంద్రనాథ్‌ సాన్యాల్‌ సారథ్యంలోకి వచ్చాయి.[4][42][43] ఏకీకృత సాధారణ తిరుగుబాటుకు పథకం మొదలైంది. దానికి 1915 ఫిబ్రవరి 15ను ముహూర్తంగా నిర్ణయించారు.[4][42]

1915 ఫిబ్రవరి[మార్చు]

భారత్‌లో స్వదేశీ సిపాయిలను కూడగట్టుకుంటామనే ధీమాతో తిరుగుబాటు ప్రయత్నాలు తుది రూపు దిద్దుకున్నాయి. వాటిప్రకారం పంజాబ్‌లోని 23వ పదాతి దళం ఫిబ్రవరి 21న రోల్‌ కాల్‌ సందర్భంగా ఆయుధాలను చేజిక్కించుకుని, తమ అధికారులను చంపేయాలి.[19] మరోవైపు 26న పంజాబ్‌లో తిరుగుబాటు రేగాలి. సాధారణ తిరుగుబాటు మొదలైందనేందుకు ఇదే సూచిక. తర్వాత ఢిల్లీ లాహోర్‌లలో కూడా తిరుగుబాట్లు మొదలవాలి. బెంగాల్‌ విభాగం ఆ తర్వాతి రోజున హౌరా స్టేషన్‌లోకి ప్రవేశించే పంజాబ్‌ మెయిల్‌ కోసం ఎదురు చూడాలి. రాగానే దాన్ని ముట్టడించాలి (అంతకు ముందే పంజాబ్‌ను ఆక్రమిస్తే మెయిల్‌ రద్దవుతుంది) .

అయితే, పంజాబ్‌ సీఐడీ విభాగం చివరి నిమిషంలో కుట్రను విజయవంతంగా కనిపెట్టగలిగింది. బల్వంత్‌ సింగ్‌ (23వ పదాతి దళం) సోదరుడు కృపాల్‌ సింగ్‌ అనే వ్యక్తి ద్వారా విషయం తెలుసుకుంది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన కృపాల్‌ ఒక వేగు. అతను లాహోర్‌ ప్రధాన కార్యాలయంలోని మోచీ గేట్‌ సమీనపంలో ఉన్న రాస్‌ బిహారీని ఒకసారి కలిశాడు. అక్కడ డజనుకు పైగా నేతలు పింగళేతో కలిసి 1915 ఫిబ్రవరి 15న సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కృపాల్‌ పోలీసులకు చేరవేశాడు.[44] తమ పథకాలు బయటికి పొక్కాయని తెలుసుకున్న విప్లవకారులు తిరుగుబాటు తేదీని మరింతగా ముందుకు జరిపారు. ఫిబ్రవరి 19నే దాడికి సిద్ధపడ్డారు. కానీ ఆ వివరాలు కూడా పంజాబ్‌ సీఐడీకి చేరాయి. ఫిబ్రవరి 21న రంగూన్‌లోని 130వ బలూచీ రెజిమెంట్‌లో తిరుగుబాటు ప్రయత్నాలను అణగదొక్కారు. ఫిబ్రవరి 15న విజయవంతంగా తిరుగుబాట్లు మొదలైన సైనిక విభాగాల్లో సింగపూర్‌లోని లైట్‌ ఇన్‌ఫాంట్రీ స్టేషన్‌ ఒకటి. మొత్తం రెజిమెంట్‌లోని 850 మంది సైనికుల్లో దాదాపు సగం మంది 15[45] మధ్యాహ్నం తిరుగుబాటు చేశారు. మలయ్‌ స్టేట్స్‌ గైడ్స్‌కు చెందిన దాదాపు 100 మంది సిబ్బంది కూడా వారికి సహకరించారు. ఈ తిరుగుబాటు కొద్ది రోజుల పాటు కొనసాగింది. దాదాపు 47 మంది బ్రిటిష్‌ సైనికులు, ఇతర స్థానికుల మరణానికి ఇది దారితీసింది. తిరుగుబాటుదారులు నిర్బంధంలోని ఎస్‌ఎంఎస్‌ ఎండెన్‌ సిబ్బందిని విడిపించారు. రష్యా, జపాన్‌, ఫ్రాన్స్‌ దళాలు అదనపు బలగాల సాయంతో నౌకల్లో వచ్చిన తర్వాత మాత్రమే, అంటే చాలా రోజులకు ఈ తిరుగుబాటును అణచగలిగారు.[46][47] వీరిలో దాదాపు 200 మందిని సింగపూర్‌లోనే విచారించారు. వారిలో 47 మందిని బహిరంగంగా కాల్చి చంపారు. మిగతా వారిలో చాలామందిని జీవిత ఖైదుకు, 7 నుంచి 20 ఏళ్ల కారాగారవాసానికి పంపారు.[46] సింగపూర్‌ యూనిట్‌లోని గదర్‌ సభ్యులకు ఈ తిరుగుబాటుతో భాగమున్నా నిజానికి భారత్‌లోని తిరుగుబాటుకు దీనితో ఏ సంబంధమూ లేదని హూ స్ట్రాషన్‌తో సహా పలువురు చరిత్రకారులు అంటారు.[48] కానీ మిగతావారు మాత్రం గదర్‌ తరహా కుట్రలో అంతర్భాగమైన సిక్కు సైనికుల లేఖల ఉద్యమం లేఖల ద్వారానే ఈ తిరుగుబాటుకు ఊతం లభించిందని నమ్ముతారు.[49] ఇక 26వ పంజాబ్‌, 7వ రాజ్‌పూత్‌, 130వ బలూచ్‌, 24వ జాట్‌ ఆర్టిలరీ, ఇతర రెజిమెంట్లలో తిరుగుబాటు ప్రయత్నాలను ఎక్కడికక్కడ అణచేశారు. ఫిరోజ్‌పూర్‌, లాహోర్‌, ఆగ్రాల్లోని తిరుగుబాట్లను కూడా అణచేశారు. దాంతోపాటు విప్లవానికి చెందిన అతి కీలకమైన పలువురు నేతలను అరెస్టు చేశారు. కొందరునేతలు మాత్రం తప్పించుకోవడంలో, లే అరెస్టులను తప్పించుకోవడంలో సఫలమయ్యారు. చివరి ప్రయత్నాన్ని కర్తార్‌సింగ్‌, పింగళే మొదలు పెట్టారు. మీరట్‌లోని 12వ పదాతి దళంలో తిరుగుబాటు లేవదీసేందుకు వారు ప్రయత్నించారు.[50] కర్తార్‌సింగ్‌ లాహోర్‌ నుంచి తప్పించుకున్నాడు. కానీ అతన్ని బెనారస్‌లో అరెస్టు చేశారు. ఇక వీజీ పింగళేను మీరట్‌లోని 12వ అశ్విక దళ స్థావరం సమీపంలో 1915 మార్చి 23న రాత్రి పట్టుకున్నారు. అతని వద్ద ఢిల్లీలో లార్డ్‌ హార్డింజ్‌ను చంపేందుకు ప్రయత్నం చేసిన బాంబుల వంటి పది బాంబులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని బాంబే పోలీసుల నివేదికలు పేర్కొంటున్నాయి.[39] మొత్తం రెజిమెంట్‌నే పేల్చేసేందుకు ఆ 10 బాంబులు సరిపోతాయట.[51] ఆ తర్వాత భారీ సామూహిక అరెస్టులు చోటుచేసుకున్నాయి. గదర్‌ పార్టీ సభ్యులను పంజాబ్‌, సెంట్రల్‌ ప్రావిన్సుల నుంచి పెద్ద సంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. రాస్‌ బిహారీ బోస్‌ 1915 మేలో లాహోర్‌ నుంచి తప్పించుకుని జపాన్‌కు పారిపోయాడు. గిలానీ ప్రీతం సింగ్‌, స్వామి సత్యానంద పురి వంటి ఇతర నేతలు థాయ్‌లాండ్‌ తదితర సానుభూతిపర దేశాలకు పారిపోయారు.[19][50]

చివరి ప్రయత్నాలు[మార్చు]

మరోవైపు, 1915 సింగపూర్‌ సిపాయిల తిరుగుబాటుతో పాటు దీనికి సంబంధించిన ఇతర ఉదంతాలు కూడా అనేకం చోటుచేసుకున్నాయి. అన్నీ లార్సెన్‌ సాయుధ కుట్ర, క్రిస్మస్‌ డే కుట్ర వంటివి ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కలిసి బాగా జతిన్‌ మరణానికి, కాబూల్‌కు జర్మనీ బృందం రాకకు, భారత్‌లో కన్నాట్‌ రేంజర్ల తిరుగుబాటుకు, కొన్ని వివరాల ప్రకారం 1916లో బ్లాక్‌ టామ్‌ పేలుడుకు కూడా దారితీశాయి. ఇండో-ఐరిష్‌-జర్మన్‌ కూటమి, వారి కుట్రలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రిటిష్‌ నిఘా వర్గాలు దృష్టి సారించాయి. మరిన్ని దాడులు జరగకుండా అవి విజయవంతంగా నిరోధించాయి.1917లో అన్నీ లార్సెన్‌ ఉదంతం తర్వాత పలువురు కీలక నేతలను అమెరికా నిఘా వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ కుట్ర కాస్తా భారత్‌లో లాహోర్‌ కుట్ర కేసు, అమెరికాలో హిందూ జర్మన్‌ కుట్ర కేసు తరహాలో విచారణలకు దారి తీసింది. హిందూ జర్మన్‌ కుట్ర కేసు అప్పటికి అమెరికాలో అత్యంత సుదీర్ఘం, వ్యయభరితమైన విచారణగా చరిత్రకెక్కింది.[1]

విచారణలు[మార్చు]

ఈ కుట్ర భారత్‌లో పలు విచారణలకు దారితీసింది. వీటిలో లాహోర్‌ కుట్ర కేసు విచారణ అతి ప్రముఖమైనది. 'ఫిబ్రవరి విఫల తిరుగుబాటు' తర్వాత 1915లో లాహోర్‌లో ఇది మొదలైంది. బెనారస్‌, సిమ్లా, ఢిల్లీ, ఫిరోజ్‌పూర్‌ కుట్ర కేసుల్లోని విచారణలు పూర్తయ్యాయి. వారితో పాటు బడ్జ్‌బడ్జ్‌ కేసులో అరెస్టయిన వారిపై విచారణలు కూడా.[51] లాహోర్‌లో భారత రక్షణ చట్టం 1915 ప్రకారం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ కూడా ఏర్పాటైంది. మొత్తం 291 మందిని విచారణ జరిపారు. వీరిలో 42 మందికి మరణ శిక్ష విధించారు. 114 మందికి జీవిత కాలానికి ప్రవాసపు ఖైదు, 93 మందికి పలు శిక్షలు విధించారు. వీరిలో చాలమందిని అండమాన్‌లోని సెల్యులార్‌ జైలుకు పంపారు. మరో 42 మందిని నిర్దోషులుగా విడుదల చేశారు. ఫిబ్రవరి తిరుగుబాటుకు క్రుటకు అమెరికాతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని లాహోర్‌ విచారణ పేర్కొంది. విచారణ ముగియగానే అమెరికాలో భారత తిరుగుబాటు ఉద్యమాన్ని నాశనం చేసేందుకు, అక్కడి సభ్యులను విచారణకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.[52][53][54]

ప్రభావం[మార్చు]

భారత రక్షణ చట్టం ఏర్పాటుకు, రౌలత్‌ కమిటీ నియామకానికి, రౌలత్‌ చట్టం ఏర్పాటుకు ఇండో-జర్మన్‌ కుట్ర పూర్తిస్థాయిలో, యుద్ధ సమయంలో పంజాబ్‌లో పెరిగిన గదర్‌ పార్టీ కార్యకలాపాలు పాక్షికంగా గదర్‌ పార్టీ కారణంగా నిలిచాయి. భారత్‌లో గదర్‌ తరహా కార్యకలాపాలు, ముఖ్యంగా 1919లో పంజాబ్‌లో గొడవలకు ఆస్కారముందన్న బ్రిటిష్‌ ప్రభుత్వ భయాలే జలియన్‌వాలాబాగ్‌ ఊచకోతకు దారితీశాయి.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 Plowman 2003, p. 84
 2. 2.0 2.1 Hoover 1985, p. 252
 3. 3.0 3.1 Brown 1948, p. 300
 4. 4.0 4.1 4.2 4.3 4.4 Gupta 1997, p. 12
 5. Popplewell 1995, p. 201
 6. Strachan 2001, p. 798
 7. Strachan 2001, p. 788
 8. Hopkirk 2001, p. 41
 9. Popplewell 1995, p. 234
 10. 10.0 10.1 10.2 Fischer-Tinē 2007, p. 333
 11. 11.0 11.1 Fischer-Tinē 2007, p. 334
 12. 12.0 12.1 Fischer-Tinē 2007, p. 335
 13. 13.0 13.1 13.2 Strachan 2001, p. 795
 14. 14.0 14.1 Deepak 1999, p. 441
 15. Sarkar 1983, p. 146
 16. Deepak 1999, p. 439
 17. Strachan 2001, p. 793
 18. 18.0 18.1 Deepak 1999, p. 442
 19. 19.0 19.1 19.2 19.3 Strachan 2001, p. 796
 20. Ward 2002, pp. 79–96
 21. 21.0 21.1 Sarkar 1983, p. 148
 22. Hoover 1985, p. 251
 23. Brown 1948, p. 303
 24. Bose 1971, pp. 87–88, 132
 25. క్లైవ్‌లాండ్‌కు పింగళే, మౌలా సింగ్‌ ప్రకటనలు. తేదీ/1915 -3-31, హెచ్‌పీ, 1916, మే 435 -439బీ. నోట్స్‌ ఆన్‌ తహల్‌, రోల్‌ 6, ఆర్‌జీ 118.
 26. రౌలత్‌ నివేదిక 110, 121, 138.
 27. Majumbar 1967, p. 167.
 28. Bose 1971, pp. 161–162
 29. బెంగాల్‌లో ఉగ్రవాదం , పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం మూడో సంపుటి, పేజీ 505
 30. Ker 1917, pp. 373–375
 31. రౌలత్‌ 121, 132, 138
 32. బెంగాల్‌లో ఉగ్రవాదం , ఐదో సంపుటి, పేజీ 170
 33. రౌలత్‌ , 138
 34. Ker 1917, p. 367
 35. రౌలత్‌ , 121
 36. Ker 1917, pp. 377–378
 37. Bose 1971, pp. 124–125
 38. Majumbdar 1967, p. 167
 39. 39.0 39.1 Majumbdar 1967, p. 169
 40. Chhabra 2005, p. 597
 41. Deepak 1999, p. 443
 42. 42.0 42.1 42.2 Gupta 1997, p. 11
 43. Puri 1980, p. 60
 44. Ker 1917, p. 369
 45. ఫిలిప్‌ మాసన్‌, పేజీలు 426 -427 అ మ్యాటర్‌ ఆఫ్‌ ఆనర్‌, ISBN 0-333-41837-9
 46. 46.0 46.1 Sareen 1995, p. 14,15
 47. Kuwajima 1988, p. 23
 48. Strachan 2001, p. 797
 49. Qureshi 1999, p. 78
 50. 50.0 50.1 Gupta 1997, p. 3
 51. 51.0 51.1 Chhabra 2005, p. 598
 52. Talbot 2000, p. 124
 53. "History of Andaman Cellular Jail". Andaman Cellular Jail heritage committee. మూలం నుండి 2007-01-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-12-08. Cite web requires |website= (help)
 54. Khosla, K (June 23, 2002). "Ghadr revisited". The Tribune, Chandigarh. Retrieved 2007-12-08. Cite web requires |website= (help)
 • Bose, A. C. (1971), Indian Revolutionaries Abroad,1905-1927, Patna:Bharati Bhawan., ISBN 8172111231.
 • Brown, Giles (1948), The Hindu Conspiracy, 1914-1917.The Pacific Historical Review, Vol. 17, No. 3. (Aug., 1948), pp. 299-310, University of California Press, ISSN 0030-8684.
 • Chhabra, G. S. (2005), Advance Study In The History Of Modern India (Volume-2: 1803-1920), Lotus Press, ISBN 818909307X, మూలం నుండి 2011-07-17 న ఆర్కైవు చేసారు, retrieved 2011-03-09.
 • Deepak, B. R. (1999), Revolutionary Activities of the Ghadar Party in China. China Report 1999; 35; 439, Sage Publications, ISSN: 0009-4455.
 • Fischer-Tinē, Harald (2007), Indian Nationalism and the ‘world forces’: Transnational and diasporic dimensions of the Indian freedom movement on the eve of the First World War. Journal of Global History (2007) 2, pp. 325–344, Cambridge University Press., ISSN: 1740-0228.
 • Gupta, Amit K. (1997), Defying Death: Nationalist Revolutionism in India, 1897-1938.Social Scientist, Vol. 25, No. 9/10. (Sep. - Oct., 1997), pp. 3-27, Social Scientist, ISSN: 09700293.
 • Hoover, Karl (1985), The Hindu Conspiracy in California, 1913-1918. German Studies Review, Vol. 8, No. 2. (May, 1985), pp. 245-261, German Studies Association, ISBN 01497952 Check |isbn= value: length (help).
 • Hopkirk, Peter (2001), On Secret Service East of Constantinople, Oxford Paperbacks, ISBN 0192802305.
 • Ker, J. C. (1917), Political Trouble in India 1907-1917, Calcutta. Superintendent Government Printing, India, 1917. Republished 1973 by Delhi, Oriental Publishers, OCLC: 1208166.
 • Kuwajima, Sho (1988), First World War and Asia — Indian Mutiny in Singapore (1915).Journal of Osaka University of Foreign Studies Vol 69,pp. 23-48, Osaka University of Foreign studies, ISSN 0472-1411.
 • Majumdar, Bimanbehari (1967), Militant Nationalism in India and Its Socio-religious Background, 1897-1917, General Printers & Publishers.
 • Plowman, Matthew (2003), Irish Republicans and the Indo-German Conspiracy of World War I. New Hibernia Review 7.3 pp 81-105, Center for Irish Studies at the University of St. Thomas, ISBN 10923977 Check |isbn= value: length (help).
 • Popplewell, Richard J. (1995), Intelligence and Imperial Defence: British Intelligence and the Defence of the Indian Empire 1904-1924., Routledge, ISBN 071464580X.
 • Puri, Harish K. (1980), Revolutionary Organization: A Study of the Ghadar Movement. Social Scientist, Vol. 9, No. 2/3. (Sep. - Oct., 1980), pp. 53-66, Social Scientist, ISSN: 09700293.
 • Qureshi, M. Naeem (1999), Pan-Islam in British Indian Politics: A Study of the Khilafat Movement, 1918-1924., Brill Academic Publishers, ISBN 9004113711.
 • Sareen, Tilak R. (1995), Secret Documents On Singapore Mutiny 1915., Mounto Publishing House, New Delhi, ISBN 8174510095.
 • Sarkar, Sumit (1983), Modern India, 1885-1947, Delhi:Macmillan, ISBN 9780333904251.
 • Strachan, Hew (2001), The First World War. Volume I: To Arms, Oxford University Press. USA, ISBN 0199261911.
 • Ward, W. P. (2002), White Canada Forever: Popular Attitudes and Public Policy Toward Orientals in British Columbia (McGill-Queen's Studies in Ethnic History). 3rd ed, McGill-Queen's University Press, ISBN 0773523227.

మూస:Ghadar Conspiracy