గద్దె బాబూరావు
| గద్దె బాబూరావు | |||
| పదవీ కాలం 1994 – 2004 | |||
| ముందు | టంకాల సరస్వతమ్మ | ||
|---|---|---|---|
| తరువాత | బొత్స సత్యనారాయణ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ | ||
| నివాసం | చీపురుపల్లి, విజయనగరం | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గద్దె బాబూరావు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకుడు. ఆయన చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]గద్దె బాబూరావు 1978లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆ తరువాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కెంబూరి రామ మోహన్ రావుపై 17065 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి మీసాల నీలకంఠంపై 4651 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ విప్‌గా పని చేశాడు.
గద్దె బాబూరావు 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో 11034 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 20099 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ చేతిలో 5,942 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
గద్దె బాబూరావు 2020 సెప్టెంబర్ 27న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి,[1] అక్టోబర్ 31న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఏపీ సహ ఇంచార్జి సునీల్ దేవధర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2] ఆయన 2023 డిసెంబరు 18న వ్యక్తిగత సమస్యలతో బీజేపీ పార్టీని వీడి,[3] 2024 జనవరి 18న చంద్రబాబునాయుడు సమక్షంలో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరాడు.[4][5]
మూలాలు
[మార్చు]- ↑ "అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు". Sakshi. 27 September 2020. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
- ↑ "బీజేపీలో చేరిన గద్దె బాబూరావు". TV9 Telugu. 31 October 2020. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
- ↑ "బీజేపీకి గద్దె బాబూరావు రాజీనామా". Andhrajyothy. 19 December 2023. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
- ↑ "టీడీపీకి కొత్త బలం". Andhrajyothy. 18 January 2024. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.
- ↑ "Former MLA Gadde Baburao seeks TDP ticket for Cheepurupalli" (in Indian English). The Hindu. 3 March 2024. Archived from the original on 29 April 2025. Retrieved 29 April 2025.