గద్వాల రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గద్వాల రెవెన్యూ డివిజను
గద్వాల కోటలోని చెన్నకేశవ స్వామి దేవాలయం
గద్వాల కోటలోని చెన్నకేశవ స్వామి దేవాలయం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజోగులాంబ గద్వాల

గద్వాల రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న ఏకైక రెవెన్యూ డివిజన్ ఇది. దీని పరిపాలనలో 12 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం గద్వాల పట్టణంలో ఉంది.[2] 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[3] ఇది నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంలోని గద్వాల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[4]

పరిపాలన[మార్చు]

గద్వాల డివిజన్‌లోని మండలాలు:[5]

క్ర.సం గద్వాల రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 గద్వాల మండలం 21 రెవెన్యూ గ్రామాలు
2 ధరూర్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు
3 మల్దకల్ మండలం 22 రెవెన్యూ గ్రామాలు
4 గట్టు మండలం 17 రెవెన్యూ గ్రామాలు
5 అయిజ మండలం 18 రెవెన్యూ గ్రామాలు
6 కాలూర్‌తిమ్మన్‌దొడ్డి మండలం 15 రెవెన్యూ గ్రామాలు
7 వడ్డేపల్లి మండలం 9 రెవెన్యూ గ్రామాలు
8 రాజోలి మండలం 11 రెవెన్యూ గ్రామాలు
9 ఇటిక్యాల మండలం 22 రెవెన్యూ గ్రామాలు
10 మానవపాడ్ మండలం 17 రెవెన్యూ గ్రామాలు
11 ఉండవెల్లి మండలం 15 రెవెన్యూ గ్రామాలు
12 అలంపూర్ మండలం 16 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Suryapet district" (PDF). New Districts Formation Portal. Archived from the original (PDF) on 11 October 2016. Retrieved 2022-11-12.
  3. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-11-12.
  4. Mahammad (2016-10-12). "Jogulamba District HQ at Gadwal Revenue Divisions, Mandals,Villages Telangana TS GO 244". Teacher4us. Archived from the original on 2022-11-12. Retrieved 2022-11-12.
  5. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-11-12. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)