Jump to content

గన్నవరం శాసనసభ నియోజకవర్గం (కృష్ణా జిల్లా)

వికీపీడియా నుండి
(గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
గన్నవరం శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°32′24″N 80°48′0″E మార్చు
పటం
గన్నవరం శాసనసభ్యునిగా సేవలందించిన పుచ్చలపల్లి సుందరమ్మ

గన్నవరం శాసనసభ నియోజకవర్గం కృష్ణా జిల్లాలో గలదు.

చరిత్ర

[మార్చు]

గన్నవరం నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. గన్నవరం, ఉంగుటూరు మండలాలు పూర్తిగా, కంకిపాడు మండలంలోని రెండు, బాపులపాడు మండలంలోని తొమ్మిది గ్రామాలు, ఉయ్యూరు మండలంలోని రెండు గ్రామాలు కలిపి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు.

పునర్విభజన తదుపరి గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల పరిధిలోని గ్రామాలు పూర్తిగా, విజయవాడ రూరల్‌ మండలంలోని తొమ్మిది గ్రామాలతో నియోజకవర్గాన్ని పునర్విభజించారు. తూర్పున ఉంగుటూరు మండలం కొయ్యగూరపాడు, పడమరన విజయవాడ రూరల్‌ మండలంలోని పి.నైనవరం, దక్షిణాన రామవరప్పాడు, ఉత్తరాన బొమ్ములూరు గ్రామాలు నియోజకవర్గంలో ఉన్నాయి.

నియోజకవర్గ ప్రజలలో సామాజిక ఆర్థిక పరిస్థితుల జీవనశైలిలో ఇక్కడ నిరుపేదలు, దళిత, వ్యవసాయ కార్మికులు ఎక్కువ. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, పెద్ద పథకాలు అయిన ఐటీ పార్కు, విమానాశ్రయ అభివృద్ధి, పోలవరం తవ్వకం వంటివి ఉన్నాయి.

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]

నైసర్గికం

[మార్చు]
  • విజయవాడ, రామవరప్పాడు రింగ్‌ నుంచి గన్నవరం నియోజకవర్గం వస్తుంది.

ముఖ్యమైన ప్రదేశాలు

[మార్చు]

విమానాశ్రయం, ఐటీపార్కు . సూరంపల్లి పారిశ్రామిక వాడ, పశుదాణా కర్మాగారం, డెల్టా షుగర్స్‌, పట్టుగూళ్ల పరిశ్రమ, శ్రీనివాస హేచరీస్‌ వంటివి ఉన్నాయి. పెద అవుటుపల్లిలో జోసెఫ్‌ తంబి పుణ్యక్షేత్రం, చిక్కవరం గ్రామములో బ్రహ్మయ్య లింగం ఆలయం, హనుమాన్ జంక్షన్‌లో అభయాంజనేయస్వామి దేవాలయం ఉన్నాయి.

ప్రముఖులు

[మార్చు]

ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రముఖుల పేర్లు ఉన్నాయి. కవి విశ్వనాథ సత్యనారాయణ, పారిశ్రామిక వేత్త దాసరి జైరమేష్‌, తమిళనాడు మాజీ గవర్నర్‌ పీఎస్‌.రామ్మోహనరావు, పుచ్చలపల్లి సుందరయ్య, కంభంపాటి రామ్మోహనరావు, గద్దె రామ్మోహనరావు, తానా అధ్యక్షుడు టీబీఆర్‌ ప్రసాద్‌, కేవీపీ రామచంద్రరావు వంటి వారు ఎందరో ఉన్నారు.

1983 ఎన్నికలు

[మార్చు]

1983 రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముసునూరు రత్నబోస్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కొమ్మినేని శేషగిరిరావుపై 1211 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. రత్నబోస్‌కు 23436 ఓట్లు రాగా, శేషగిరిరావుకు 22225 ఓట్లు లభించాయి.[1]

2004 ఎన్నికలు

[మార్చు]

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో గన్నవరం శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకిచెందిన ఎం.వెంకటేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.వి.బలవర్థన్ రావుపై 2235 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. వెంకటేశ్వరరావుకు 42444 ఓట్లు లభించగా, బలవర్థన్ రావు 40209 ఓట్లు పొందినాడు.

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన డి.బాలవర్థనరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వెంకటేశ్వరరావుపై 17195 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[2]

2014 ఎన్నికలు

[మార్చు]

2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసిన వల్లభనేని వంశీమోహన్ తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి దుట్టా రామచంద్రరావు 9548 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[3]

సంవత్సరం సభ్యుడు రాజకీయ పార్టీ
1955 పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1962
1967 వి. సీతా రామయ్య భారత జాతీయ కాంగ్రెస్
1968 కె. వెంకట రత్నం
1972 టీఎస్ ఆనంద్ బాబు
1978 పుచ్చలపల్లి సుందరయ్య కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
1983 ఎం. రత్న బోస్ తెలుగుదేశం పార్టీ
1985 ఎం. బాలకృష్ణారావు
1989 ఎం. రత్న బోస్ భారత జాతీయ కాంగ్రెస్
1994 గద్దె రామమోహన్ రావు స్వతంత్ర
1999 డివి బాలవర్ధనరావు తెలుగుదేశం పార్టీ
2004 ఎం. వెంకటేశ్వరరావు స్వతంత్ర
2009 డివి బాలవర్ధనరావు తెలుగుదేశం పార్టీ
2014 వల్లభనేని వంశీ మోహన్
2019
2024 యార్లగడ్డ వెంకటరావు
సంవత్సరం రకం గెలుపొందిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2024[4] జనరల్ యార్లగడ్డ వెంకట రావు పు తె.దే.పా 135552 వల్లభనేని వంశీమోహన్ పు తె.దే.పా 103043
2019 జనరల్ వల్లభనేని వంశీమోహన్ పు తె.దే.పా 103881 యార్లగడ్డ వెంకట రావు పు వై.కా.పా 97924
2014 జనరల్ వల్లభనేని వంశీమోహన్ పు తె.దే.పా 99163 దుట్టా రామచంద్రరావు పు వై.కా.పా 89615
2009 జనరల్ దాసరి బాలవర్ధనరావు పు తె.దే.పా 82218 ముద్రబోయిన వెంకటేశ్వర రావు పు కాంగ్రెస్ 66923
2004 జనరల్ ముద్రబోయిన వెంకటేశ్వర రావు పు ఇతరులు 42444 దాసరి బాలవర్ధనరావు పు తె.దే.పా 40209
1999 జనరల్ దాసరి బాలవర్ధనరావు పు తె.దే.పా 49563 ముద్రబోయిన వెంకటేశ్వర రావు పు కాంగ్రెస్ 27763
1994 జనరల్ గద్దే రామమోహన్ పు ఇతరులు 45824 దాసరి బాలవర్ధనరావు పు తె.దే.పా 35121
1989 జనరల్ ముసునూరు రత్న బోస్ పు కాంగ్రెస్ 43225 ములుపూరు బాల క్రిష్ణరావు పు తె.దే.పా 42510
1985 జనరల్ ములుపూరు బాల క్రిష్ణరావు పు తె.దే.పా 40641 కొలుసు పెద బెద్దయ్య పు కాంగ్రెస్ 35072
1983 జనరల్ రత్న బోస్ ముసునూరు పు ఇతరులు 23436 శేషగిరిరావు కొమ్మినేని పు కాంగ్రెస్ 22225
1978 జనరల్ పుచ్చలపల్లి సుందరయ్య పు సిపిఐ(ఎం) 35984 లంక వేంకటేశ్వర రారు (చిన్ని) పు కాంగ్రెస్ 18472
1972 జనరల్ ఇ.ఎస్.ఆనంద బాయి తప్పట పు కాంగ్రెస్ 21662 అట్లూరి శ్రీమన్నారాయణ పు సిపిఐ(ఎం) 21307
1967 జనరల్ వి.సీతారామయ్య పు కాంగ్రెస్ 27656 ఎస్.మనికొండ పు సిపిఐ(ఎం) 23727
1962 జనరల్ పుచ్చలపల్లి సుందరయ్య పు సి.పి.ఐ 28264 కలపల సూర్య ప్రకాశరావు పు కాంగ్రెస్ 23463
1955 జనరల్ పుచ్చలపల్లి సుందరయ్య పు సి.పి.ఐ 22575 వెలివెల సీతారామయ్య పు కాంగ్రెస్ 21754

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, పేజీ 1, తేది 07-01-1983.
  2. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  3. http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/gannavaram.html
  4. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Gannavaram". Archived from the original on 15 June 2024. Retrieved 15 June 2024.